Delhi Liquor Scam Case : ఎమ్మెల్సీ కవితను విచారిస్తూనే ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ.. సిబ్బందిని ఇంటికి పంపి...
ABN , First Publish Date - 2023-03-11T17:22:02+05:30 IST
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఐదు గంటలుగా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) ఐదు గంటలుగా ఈడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఈ విచారణలో సాయంత్రం కీలక పరిణామం చోటుచేసుకుంది. పర్సనల్ ఫోన్ (Kavitha Personal Phone) ఇవ్వాలని కవితను ఈడీ ఆదేశించింది. కవిత ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌ను మాత్రమే ఇవ్వాలని అధికారులు చెప్పారు. ఇంటి దగ్గర ఉందని కవిత చెప్పగా ఆఫీసుకు తెప్పించాలని ఈడీ ఆదేశించింది. దీంతో కవిత తన సిబ్బందిని ఇంటికి పంపి ఫోన్ తెప్పించారు. అనంతరం సిబ్బంది దగ్గర్నుంచి ఆ ఫోన్ తీసుకున్న కవిత.. విచారణ అధికారులకు అందించారు. ఆ వెంటనే కవిత పర్సనల్ ఫోన్‌ను ఈడీ సీజ్ చేసింది. లంచ్ బ్రేక్ కోసం కవిత బయటికొచ్చిన తర్వాత ఈ ఊహించని ట్విస్ట్ ఇచ్చింది ఈడీ.
ఎన్ని ఫోన్లు వాడారు..!?
కాగా.. కవిత వాడిన 10 మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారన్నది ఆమెపై మొదట్నుంచీ వస్తున్న ఆరోపణ. అసలు కవిత వాడిన ఫోన్లు ఎన్ని..? ఎందుకు ధ్వంసం చేశారనేదానిపై ప్రధానంగా ఈడీ ఇప్పుడు విచారించినట్లు తెలుస్తోంది. అయితే ఫోన్లపై ఈడీ ప్రశ్నలకు కవిత ఏమని సమాధానం చెప్పారనేది తెలియరాలేదు. ఇలా ఫోన్ల ధ్వంసం గురించి విచారణ అయ్యాకే అధికారులు కవిత ఫోన్‌ను ఇంటి నుంచి తెప్పించారని తెలుస్తోంది. ఈ ఫోన్‌లో కాల్ డేటాను, వాట్సాస్ చాటింగ్‌ను అధికారులు నిశితంగా పరిశీలిస్తారని తెలియవచ్చింది. ఇదిలా ఉంటే.. కవిత విచారణ ఐదు గంటలు పూర్తయ్యింది. శనివారం రాత్రి 8 గంటల వరకూ విచారణ జరిగే ఛాన్స్ ఉంది. అయితే ఆదివారం కూడా విచారణ ఉంటుందని వార్తలు వస్తున్నాయి.
సాక్ష్యాలన్నీ...!
ముఖ్యంగా.. లిక్కర్ స్కామ్‌లో కవిత ప్రమేయానికి సంబంధించిన అన్ని సాక్ష్యాలను విచారణలో ఈడీ అధికారులు ఆమె ముందు ఉంచారు. గతంలో కవిత వాడిన ఫోన్లలోని సమాచారాన్ని ఈడీ ఆమె ముందు ఉంచి.. లోతుగా అధికారులు విచారిస్తున్నారు. లిక్కర్ స్కామ్ సమయంలో రెండు ఫోన్లు, 10 సిమ్ కార్డులు మార్చినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. పాత ఫోన్లలో ఉన్న సమాచారాన్ని ఈడీ అధికారులు కవిత ముందు ఉంచినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.