TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?

ABN , First Publish Date - 2023-08-26T16:51:12+05:30 IST

తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన తర్వాత టికెట్ రాని సిట్టింగులు, కీలక నేతలు, మాజీలు, ముఖ్యనేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్‌కు బై.. బై చెప్పేయగా...

TS Politics : బీఆర్ఎస్‌కు మరో షాక్.. మాజీ మంత్రి రాజీనామా.. అడుగులు ఎటువైపో..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ (TS CM KCR) బీఆర్ఎస్ అభ్యర్థులను (BRS First List) ప్రకటించిన తర్వాత టికెట్ రాని సిట్టింగులు, కీలక నేతలు, మాజీలు, ముఖ్యనేతలు కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్‌కు బై.. బై చెప్పేయగా మరికొందరు రాజీనామాకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే తాజాగా.. బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సి. కృష్ణయాదవ్ (Former Minister Krishna Yadav) రాజీనామా చేశారు. తనకు అంబర్‌పేట (Amberpet) అసెంబ్లీ నుంచి టికెట్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తిని వెలిబుచ్చారు. అందుకే ఆత్మగౌరవంలేని బీఆర్ఎస్‌లో తాను కొనసాగనని రాజీనామా చేస్తున్నట్లు ప్రెస్‌క్లబ్ వేదికగా కృష్ణ యాదవ్ ప్రకటించారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని.. కార్యకర్తలు, అభిమానులు, అనుచరులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. అయితే.. ఎన్నికల ముందు మాజీ మంత్రి ఈ నిర్ణయం తీసుకోవడం బీఆర్ఎస్ పెద్ద ఝలక్ ఇచ్చినట్లేననని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


BRS-Car.jpg

అడుగులు ఎటువైపు..?

హైదరాబాద్‌కు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి కృష్ణాయాదవ్ (Krishna Yadav) బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. గత ఏడాదే చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్.. కృష్ణాతో చర్చలు జరిపినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల చేరిక వాయిదా పడుతూ వస్తోంది. దీంతో మరోసారి బీజేపీ రాష్ట్ర నాయకత్వం సంప్రదింపులు జరపడంతో చేరికకు రంగం సిద్ధం చేసుకున్నారట. అయితే.. బీఆర్ఎస్ టికెట్ వస్తుందేమోనని ఆఖరి నిమిషం వరకూ వేచి చూసిన ఆయన.. అధిష్టానం ఇవ్వకపోవడంతో ఇక భవిష్యత్ కార్యచరణ ప్రకటించడానికి సిద్ధమయ్యారట. కాగా.. అంబర్‌పేట లేదా మలక్‌పేట నుంచి టికెట్ ఇవ్వాలని కృష్ణాయాదవ్ హామీ అడుగుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు ఒకరిద్దరు ఇప్పటికే ఈయనతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలియవచ్చింది. అయితే ఏ పార్టీ టికెట్ హామీ ఇస్తుందో ఆ కండువా కప్పుకోవాలని ఈయన భావిస్తున్నారట.

Krishna-Yadav.jpg

ఎవరీ యాదవ్..!?

పూర్వ హిమాయత్‌నగర్‌ (Himayat Nagar) అసెంబ్లీ నుంచి 1999లో టీడీపీ (Telugudesam) అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. అయితే.. మారిన రాజకీయ పరిణామాలతో 2016లో టీడీపీకి టాటా చెప్పి బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నారు. సీనియార్టీ, ఇంత పలుకుబడి ఉన్నప్పటికీ తగిన ప్రాధాన్యత ఇవ్వట్లేదని గత కొన్నిరోజులుగా పార్టీ మారాలని అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు యాదవ్‌పై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని.. ఈటల మంతనాలు జరిపిన తర్వాతే ఇదంతా జరిగిందని తెలుస్తోంది. కాగా.. నకిలీ స్టాంపుల కుంభకోణంలో కృష్ణాయాదవ్‌ హస్తముందని తేలడంతో 2003లో అరెస్టై మూడున్నరేళ్లు జైలు శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. అయితే.. ఇటీవలే ఈ కేసు నుంచి బయటపడటంతో మళ్ళీ యాక్టివ్‌ పాలిటిక్స్‌లోకి రావాలని కృష్ణాయాదవ్‌ భావిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ నుంచి ఆహ్వానం రావడం.. టికెట్‌పై హామీ వస్తే కాషాయ కండువా కప్పుకోవడానికి రెడీ ఉన్నారట. మొత్తానికి చూస్తే.. బీజేపీకి పాతరోజులు మళ్లీ వస్తున్నాయని కార్యకర్తలు చెప్పుకుంటున్నారు. అయితే.. అంబర్‌పేట నుంచి పోటీచేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఈయన బీజేపీ వైపు అడుగులేస్తారా..? లేకుంటే కాంగ్రెస్ (Congress) కండువా కప్పుకుంటారా..? అనేది తెలియాల్సి ఉంది.

Krishna-Yadav-1.jpg


ఇవి కూడా చదవండి


TS Assembly Polls : కాంగ్రెస్ ఆశావాహుల నుంచి భారీగా దరఖాస్తులు.. ఆ రెండు నియోజకవర్గాలకు ఒక్కటి మాత్రమే.. ఎన్నారైల క్యూ..


TTD Board Members : 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలి ప్రకటన.. ప్చ్ ఈయనకు ఎందుకిచ్చారో..!?


MLA Seethakka : ఎన్నికల బరిలో సీతక్క కొడుకు.. ఎక్కడ్నుంచి పోటీ చేస్తున్నారంటే.. గెలుపు పక్కానేనా..!?


Rebel Trouble In BRS : కేసీఆర్‌కు ఊహించని ట్విస్ట్.. పోటీపై తేల్చి చెప్పేసిన తుమ్మల


TS Assembly Polls : కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం అప్లై చేసిన టాలీవుడ్ ప్రముఖ నిర్మాత.. ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే..!


TS Politics : స్పీడ్ పెంచిన కమలం.. బీజేపీలో చేరేందుకు డజను మంది మాజీలు రెడీ.. మాజీ మంత్రితో చర్చలు!


Updated Date - 2023-08-26T16:57:23+05:30 IST