CBN Health : చంద్రబాబు ఆరోగ్యంపై జీజీహెచ్ సూపరిడెంట్ కీలక ప్రకటన.. ఎక్స్‌క్లూజివ్
ABN , First Publish Date - 2023-10-13T17:42:42+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Health) ఆరోగ్యం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు (AP Politics) నడుస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబు ఇప్పటికే రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు...
టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Health) ఆరోగ్యం చుట్టూ ఇప్పుడు ఏపీ రాజకీయాలు (AP Politics) నడుస్తున్నాయి. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న బాబు ఇప్పటికే రెండుసార్లు అస్వస్థతకు గురయ్యారు. మొదటిసారి తీవ్ర ఉక్కపోతతో డీ హైడ్రేషన్‌కు (Dehydration) గురవ్వగా.. రెండోసారి స్కిన్ ఎలర్జీతో (Skin Allergy) బాధపడుతున్నట్లు జీజీహెచ్ వైద్యులు (GGH Doctors) తెలిపారు. గురువారం నాడు వైద్యులు పరీక్షలు చేయగా చర్మ సంబంధిత ఎలర్జీని గుర్తించారు. అయితే ప్రస్తుతం చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంది..? ఆయనకు ఎలాంటి పరీక్షలు చేశారు..? పరీక్షల తర్వాత ఏం చేయబోతున్నారు..? అనే విషయాలపై ఏబీఎన్-ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) జీజీహెచ్ సూపరిడెంట్ లక్ష్మీ సూర్యప్రభ (GGH Superintendent Lakshmi Surya Prabha) ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు.
సూపరిడెంట్ ఏం చెప్పారు..?
‘ చంద్రబాబుకు చర్మ సంబంధిత అస్వస్థత ఉందని జైలు శాఖ అధికారుల నుంచి లెటర్ వచ్చింది. చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సూర్యనారాయణ, డాక్టర్ సునీతలు బాబుకు వైద్య పరీక్షలు చేసి మందులు ఇచ్చారు. చంద్రబాబు వైద్య పరీక్షలపై వివరాలన్నీ సీల్డ్ కవర్‌లో (Sealed Cover) అందజేశాం’ అని లక్ష్మీ సూర్యప్రభ ఏబీఎన్‌తో చెప్పారు. మరోవైపు.. చర్మవ్యాధి నిపుణులు డాక్టర్ సునీతాదేవి కూడా ఏబీఎన్‌తో మాట్లాడారు. ‘సెకండ్ ఒపీనియన్ కోసం వెళ్ళి చంద్రబాబుకు వైద్య పరీక్షలు చేశాం. జైలులో చంద్రబాబుకు చర్మ సంబంధిత అస్వస్థతపై మందులు సిపార్సు చేశాం’ అని తెలిపారు. అయితే.. సీల్డ్ కవర్‌లో ఏముంది..? అనేదానిపై టీడీపీ శ్రేణుల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే శుక్రవారం రాత్రి చంద్రబాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసినప్పటికీ.. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు మరింత ఆందోళన చెందుతున్నాయి. చంద్రబాబుకు ఏదైనా జరిగితే సీఎం వైఎస్ జగన్ రెడ్డిదే బాధ్యత అని టీడీపీ వార్నింగ్ ఇస్తోంది. మరోవైపు.. టీడీపీకి వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు.
కుటుంబ సభ్యుల ఆందోళన!
చంద్రబాబు అనారోగ్యానికి గురయ్యారని తెలిసినప్పట్నుంచీ ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఇవాళ బాబు సతీమణి నారా భువనేశ్వరి ట్విట్టర్ వేదికగా మాట్లాడుతూ ఆందోళన వ్యక్తం చేశారు. ‘బాబుకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోంది. ఈ భయంకరమైన పరిస్థితులు నా భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయి’ అని ట్విట్టర్‌లో భువనేశ్వరి పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తో తెలుగు తమ్ముళ్లు, టీడీపీ శ్రేణులు మరింత ఆందోళన చెందుతున్నారు.