Share News

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

ABN , First Publish Date - 2023-10-22T16:35:27+05:30 IST

ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్‌లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్‌కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది.

KCR Vs Etela Rajender: కేసీఆర్ వర్సెస్ ఈటల.. గజ్వేల్‌లో ఈసారి టఫ్ ఫైట్..!

హైదరాబాద్: ఒకప్పటి టీఆర్ఎస్ పార్టీలో నంబర్-1, నంబర్-2 వ్యక్తులుగా చక్రం తిప్పిన సీఎం కేసీఆర్, బీజేపీ నేత ఈటల రాజేందర్ నేడు ప్రత్యర్థులయ్యారు. గజ్వేల్‌లో ఇద్దరి మధ్య పోటీ ఖరారైంది. బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో ఈటల రాజేందర్‌కు అధిష్టానం రెండు స్థానాలు కేటాయించింది. ఒకటి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్.. కాగా సీఎం కేసీఆర్ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ రెండవది. హుజురాబాద్ సంగతి పక్కన పెడితే గజ్వేల్‌లో పోరు కన్ఫార్మ్ అయ్యింది. కేసీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానని ఈటల రాజేందర్ వ్యక్తిగతం సవాల్ చేశారు. అనుకున్నట్టుగానే అధిష్టానం వద్ద సీటును కూడా కన్ఫార్మ్ చేసుకున్నారు.


అహంకారం, ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధంలో కేసీఆర్‌తో అమీతుమీ తేల్చుకుంటానని ఈటల సవాలు విసురుతున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను ఈటల విశ్వసిస్తున్నారు. ముదిరాజ్ సహా బీసీ సెక్షన్ల ప్రజలు మద్దతుపై ఆయన ఆశలు పెట్టుకున్నారు.

మరోవైపు సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టిసారించారు. ఈటల రాజేందర్‌కు ఏవిధంగా చెక్ పెట్టొచ్చనే అంశాలపై దృష్టిసారించారు. ఈ మేరకు స్వయంగా ఆయనే రంగంలోకి దిగారు. 2 రోజుల క్రితం నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలు, పెద్దలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ‘‘ ఎంత మెజారిటీతో గెలిపిస్తారో మీ దయ..” అంటూ కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీనిని బట్టి చూస్తే కామారెడ్డిలో పోటీతోపాటు గజ్వేల్‌ను కూడా కేసీఆర్ ప్రతిష్టాత్మంగా తీసుకున్నట్టు స్పష్టమవుతోంది. ఇంకా చెప్పాలంటే ఈటల పోటీ చేస్తుండడంతో మరింత పకడ్బందీగా వ్యవహరించాలని నిర్ణయించినట్టు రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి గజ్వేల్ కింగ్ ఎవరో తెలియాలంటే ఫలితాలు వచ్చే వరకు వేచిచూడాల్సిందే.

Updated Date - 2023-10-22T16:35:27+05:30 IST