Kishan Reddy: కారులో డీజిల్‌కు డబ్బులు లేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయి?

ABN , First Publish Date - 2023-04-04T21:33:32+05:30 IST

అక్రమ సంపాదనతో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రధాని కావాలనుకోవటం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు.

Kishan Reddy: కారులో డీజిల్‌కు డబ్బులు లేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయి?

హైదరాబాద్: అక్రమ సంపాదనతో సీఎం కేసీఆర్ (CM KCR) ప్రధాని కావాలనుకోవటం దుర్మార్గమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Union Minister Kishan Reddy) అన్నారు. ప్రతిపక్ష కూటమికి చైర్మన్‌ను చేస్తే ఎన్నికల ఖర్చు భరిస్తానని కేసీఆర్ అనడం తీవ్రమైన చర్య, దేశంలోని కుటుంబ పార్టీలకు కేసీఆర్ ఎన్నికల ఖర్చు భరించబోతున్నారని, కారులో డీజిల్‌కు డబ్బులు లేని కేసీఆర్‌కు వేల కోట్లు ఎలా వచ్చాయి?' అని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీ మద్యం బాటిళ్లకు కేసీఆర్ కుటుంబం తాకట్టు పెట్టిందని, ప్రధాని తెలంగాణ పర్యటనలో కేసీఆర్ పాల్గొనాలని, ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రికి ఆహ్వానం పంపామని కిషన్‌రెడ్డి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వ తీరు వల్లే అంబర్‌పేట్‌, ఉప్పల్‌ ఫ్లైఓవర్లు ఆలస్యమయ్యాయని, వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తిచేస్తే రీజనల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభిస్తామని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఈ నెల 8న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పనులు ప్రారంభిస్తామని, రైళ్ల రాకపోకలు కొనసాగిస్తూనే పనులు జరుపుతామని కిషన్‌రెడ్డి తెలిపారు. కొత్త ఎయిమ్స్ భవనానికి 8న‌ ప్రధాని శంకుస్థాపన చేస్తారని, ప్రధాని చేతుల మీదుగా జాతీయ రహదారుల పనులు ప్రారంభిస్తామన్నారు. ఒప్పందాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించడం వల్లే MMTS ఆలస్యమైదని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2023-04-04T21:35:22+05:30 IST