YSRCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీపై క్లారిటీ ఇచ్చేసిన ఎమ్మెల్యే.. ఆయన మాటలతో ఒక్కసారిగా..

ABN , First Publish Date - 2023-02-05T22:37:00+05:30 IST

రానున్న ఎన్నికల్లో అసలు పోటీచేయనంటే చేయను.. అసలు తనకు ఆ ఆలోచనే లేదు.. ఎమ్మెల్యే టికెట్ (MLA Ticekt) ఎవరికి ఇచ్చుకున్నా..

YSRCP : వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీపై క్లారిటీ ఇచ్చేసిన ఎమ్మెల్యే.. ఆయన మాటలతో ఒక్కసారిగా..

కర్నూలు : రానున్న ఎన్నికల్లో అసలు పోటీచేయనంటే చేయను.. అసలు తనకు ఆ ఆలోచనే లేదు.. ఎమ్మెల్యే టికెట్ (MLA Ticekt) ఎవరికి ఇచ్చుకున్నా అనవసరం.. ఇదీ వైసీపీ (YSR Congress) ఎమ్మెల్యే నోట వచ్చిన కామెంట్స్. ఇదంతా ఉదయం జరిగితే సాయంత్రం అయ్యేసరికి టోన్ మారిపోయింది.. అబ్బే అదేం లేదు తానే ఎమ్మెల్యేగా పోటీచేస్తా.. అది కూడా ఇదే నియోజకవర్గం నుంచే అని క్లారిటీ ఇచ్చుకున్నారు. బాబోయ్.. ఈయనేంటి ఉదయం అలా.. ఇప్పుడు చూస్తే ఇలా అన్నారని ఎమ్మెల్యే అనుచరులు, కార్యకర్తలు తెగ కంగారుపడిపోయారు. ఇంతకీ ఈ సీన్ ఎక్కడ జరిగింది..? ఎవరా ఎమ్మెల్యే అనే విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.

అసలేం జరిగింది..!?

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘గడప గడపకు ప్రభుత్వం’ (Gadapa Gadapaku Prabhutvam) కార్యక్రమంలో కర్నూలు (Kurnool) జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ (Kodumur MLA Sudhakar) పాల్గొన్నారు. అయితే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సొంతపార్టీ నేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యేను నిలదీశారు. మరికొందరు.. ఎమ్మెల్యే అయిన తర్వాత తమను ఎందుకు పట్టించుకోవట్లేదని.. ఎందుకు పక్కనపెట్టారని ప్రశ్నించారు. ఇలా సొంత పార్టీ నేతలే వరుస ప్రశ్నల వర్షం కురిపించడంతో.. తీవ్ర ఆగ్రహం, అసంతృప్తికి లోనయ్యారు. వారికి జవాబు చెప్పలేక వచ్చే ఎన్నికల్లో తాను పోటీచేయడం లేదని చెప్పేశారు. అసలు తనకు పోటీచేసే ఆలోచనే లేదని కూడా చెప్పారు సుధాకర్. ఎమ్మెల్యే మాటలతో అనుచరులు, కార్యకర్తలు కంగుతిన్నారు.

MLA-Kodumur.jpg

సాయంత్రమయ్యే సరికి..!

సుధాకర్ కామెంట్స్ ఇటు మీడియా.. అటు సోషల్ మీడియాలో (Social Media) పెద్ద ఎత్తున వైరల్ కావడంతో మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చుకున్నారు. తనపై వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలే అని కొట్టిపారేశారు. ‘వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేస్తాను. సీఎం జగన్ (CMJagan) ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. ఆయన ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో కూడా నేనే పోటీ చేస్తాను. భారీ మెజార్టీతో కూడా గెలుస్తాను’ అని సుధాకర్ ధీమా వ్యక్తం చేశారు.

అయితే.. ఉదయం అలా అనడం సాయంత్రమయ్యే సరికి ఇలా కామెంట్స్ చేయడంతో నియోజకవర్గంలో అసలేం జరుగుతోందని వైసీపీ కార్యకర్తలు కంగారుపడిపోయారు. ఉదయం ఎమ్మెల్యే అలా అనలేదని.. కొందరు పనిగట్టుకుని ఆ కామెంట్స్‌ను ఇలా వక్రీకరించారనే కామెంట్స్ కూడా అనుచరులు, సుధాకర్ నుంచి వినిపిస్తున్నాయి. అసలు ఎమ్మెల్యే ఉదయం ఏమన్నారు..? ఎందుకలా అన్నారు..? సాయంత్రమయ్యే సరికి ఎందుకు టోన్ మార్చారనేది సుధాకర్‌కే తెలియాలి మరి.

Updated Date - 2023-02-05T22:41:14+05:30 IST