TS Congress : రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదీ.. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా..!

ABN , First Publish Date - 2023-02-21T21:49:49+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (TPCC Chief Revanth Reddy) మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కొండా సురేఖ (Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి గురించి పెద్ద మాట్లాడని ఆమె ఇలా కామెంట్స్ చేయడంతో ..

TS Congress : రేవంత్‌రెడ్డిపై కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు.. టీపీసీసీ చీఫ్ రియాక్షన్ ఇదీ.. ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా..!

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై (TPCC Chief Revanth Reddy) మాజీ మంత్రి, కాంగ్రెస్ కీలక నేత కొండా సురేఖ (Konda Surekha) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ రేవంత్ రెడ్డి గురించి పెద్ద మాట్లాడని ఆమె ఇలా కామెంట్స్ చేయడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. అంతటిదో ఆగని ఆమె.. వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో (YS Rajasekhar Reddy) రేవంత్ రెడ్డిని పోల్చుతూ కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో పోటీపై.. రేవంత్ రెడ్డి ఎక్కడ్నుంచి పోటీ చేయాలి అనేదానిపై కూడా మాట్లాడారామె. అయితే కొందరు సురేఖ వ్యాఖ్యలను స్వాగతిస్తుండగా.. మరికొందరు అసలు ఎవర్ని ఎవరితో పోలుస్తున్నారు మేడం అంటూ ప్రశ్నిస్తున్నారు. సురేఖ కామెంట్స్‌పై రేవంత్ రెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు.అసలు కొండా సురేఖ ఏం మాట్లాడారు..? ఎందుకింతలా చర్చనీయాంశం అయ్యాయ్..? రేవంత్ రెడ్డి ఎలా రియాక్ట్ అయ్యారనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Revanth-Reddy-3.jpg

సురేఖ ఏమన్నారు..?

‘యాత్ర’ (Yatra) పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గాలన్నీ తిరుగుతున్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా.. మంగళవారం నాడు వరంగల్‌లో బహిరంగ సభ నిర్వహించారు. సభలో భాగంగా కొండా సురేఖ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వరంగల్ వచ్చారని ఎర్రబెల్లి దయాకర్ రావుకు (Errabelli Dayakar Rao) భయం పట్టుకుంది. రేవంత్ రెడ్డిని ఓటుకు నోటు కేసులో (Cash For Vote Case) ఇరికించిన వ్యక్తి దయాకర్ రావు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ప్రజలకు రక్షణ లేకుండా పోయింది. మంత్రి, ఎమ్మెల్యే వరంగల్‌పై పడి దోచుకుంటున్నారు. పాలకుర్తి నుంచి రేవంత్ రెడ్డి పోటీచేయాలి.. లేదంటే మేం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. వచ్చే ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్ రావును ఓడించాల్సిందే. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిని ఎంత విశ్వసించామో.. నేడు రేవంత్ రెడ్డిని కూడా అంతే విశ్వసిస్తున్నాం. రేవంత్ రెడ్డితోనే ఇందిరమ్మ (Indiramma) పాలన సాధ్యం. రేవంత్ రెడ్డిని సీఎంగా చూడాలి అని కొండా సురేఖ ఆకాంక్షించారు. ఇంతవరకూ అంతా ఓకే కానీ.. వైఎస్‌తో పోలుస్తూ రేవంత్ గురించి మాట్లాడటం కాంగ్రెస్ అభిమానులకు, కొండా అనుచరులకు కొందరికి రుచించలేదట. పనిలో పనిగా వచ్చే ఎన్నికల్లో పాలకుర్తి నుంచి పోటీ చేస్తానని కూడా క్లారిటీ ఇచ్చేశారు.

Revanth-Reddy-2.jpg

రేవంత్ రియాక్షన్..!

సురేఖ మాట్లాడిన తర్వాత సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని కామెంట్స్‌కు రియాక్ట్ అయ్యారు. ‘2014లో కేసీఆర్ ప్రభుత్వం రాకతో వరంగల్‌కు గ్రహణం పట్టింది. వరంగల్ ఈస్ట్-వెస్ట్ ఎమ్మెల్యేలు బిల్లా-రంగాలు. ఎమ్మెల్యేల అనుచరులు దండుపాళ్యం ముఠాగా ఏర్పడి ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారు. అజంజాహి మిల్లు భూములను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్‌కు వరంగల్‌పై ప్రేమకాదు.. వరంగల్ భూములంటే ప్రేమ. తెలంగాణ తెచ్చినోనికి రెండుసార్లు అవకాశం ఇచ్చారు.. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌కు ఒక్క అవకాశం ఇవ్వండి. తెలంగాణలో ఇందిరమ్మ పాలన తెస్తాం. వరంగల్ తూర్పులో కొండా సురేఖను గెలిపించండి. సురేఖకు రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన గౌరవం ఇస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో బెల్టుషాపులు పెడితే బట్టలూడదీసి బొక్కలో వేస్తాం. కేసీఆర్ సర్కార్ పై బెల్టు తీయాలి’ అని రేవంత్ రెడ్డి ధీమా చెప్పుకొచ్చారు. రేవంత్, సురేఖ మాట్లాడుతున్నంత సేపూ అభిమానులు, కార్యకర్తలు ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించారు. కాగా.. నేటితో వరంగల్‌లో రేవంత్ రెడ్డి పాదయాత్ర ముగిసింది. బుధవారం నాడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రేవంత్ రెడ్డి పాదయాత్ర జరగనుంది. వరంగల్ నుంచి భూపాలపల్లి జిల్లాకు రేవంత్ బయల్దేరి వెళ్లారు. ఇవాళ రాత్రి చిట్యాల మండలం వెంకట్రావుపల్లెలో రేవంత్ బస చేయనున్నారు.

Revanth-Reddy.jpg

మొత్తానికి చూస్తే.. రేవంత్ గురించి పెద్దగా మాట్లాడని సురేఖ ఇవాళ ఈ రేంజ్‌లో పొగడ్తలతో ముంచెత్తడంతో కాంగ్రెస్‌లో ఒక్కసారిగా ఊపు వచ్చిందని అభిమానులు చెప్పుకుంటున్నారు. నాడు వైఎస్‌తో మంచిగా ఉన్నట్లే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డితో అది కూడా ఎన్నికల వరకూ ఉంటారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదైతేనేం.. సురేఖ కామెంట్స్‌తో కాంగ్రెస్‌ శ్రేణుల్లో కాస్త జోష్ వచ్చిందని మాత్రం చెప్పుకోవచ్చు.

**********************************

ఇవి కూడా చదవండి..

**********************************

Telugudesam : టీడీపీలో చేరబోతున్న కన్నాపై వైసీపీకి ఎందుకింత పైత్యం.. ఏపీ మంత్రి ఇంత మాట అనేశారేంటి..!

**********************************

YSRCP ALI : ఆ నాలుగు నియోజకవర్గాలపై అలీ కన్ను.. సొంతంగా సర్వేలు.. టికెట్ ఇస్తే చాలు గెలిచేస్తానని ధీమా.. అన్నీ సరే అయ్యే పనేనా..!?
**********************************

AP BJP : కన్నా లక్ష్మీనారాయణ బాటలో మరో కీలకనేత అడుగులు.. బీజేపీకి గుడ్ బై చెప్పేస్తారా..!?

**********************************

YSRCP MLC Candidates : లక్ అంటే ఈయనదే.. వైసీపీలో చేరిన రెండ్రోజులకే ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన YS Jagan.. ఓహో అసలు ప్లాన్ ఇదా..!


**********************************

MLC Candidates: వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన.. మర్రి రాజశేఖర్‌కు ఎన్నాళ్లకెన్నాళ్లకు ! లిస్ట్ ఇదే..


**********************************

#RIPTarakaRatna : నందమూరి తారకరత్న పాత జ్ఞాపకాలు.. ఈ వీడియో చూస్తే ఎవరికైనా కన్నీరు ఆగదు..!

**********************************

BRS : బీఆర్ఎస్‌ను వెంటాడుతున్న విషాదాలు.. సాయన్న మరణవార్త మరువకముందే మరో సీనియర్ నేత కన్నుమూత..


**********************************

MLA Sayanna: గుండెపోటుతో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి


**********************************

#RIPTarakaRatna : రాజకీయాలను పక్కనపెట్టి నందమూరి తారకరత్న ఇంటికి వైఎస్ షర్మిల..

**********************************

TarakaRatna : తారకరత్నను ఐసీయూలో పరామర్శించిన మాజీ మంత్రి.. బయటికొచ్చాక...!


**********************************

Taraka Ratna Death : బాలయ్యా.. మీరు సూపరయ్యా.. తారకరత్న కోసం నిద్రాహారాలు మాని.. దండం పెడుతున్న ఫ్యాన్స్.. రూపాయితో సహా..!


**********************************

TarakaRatna : ఎమ్మెల్యేగా పోటీచేయాలనుకున్న తారకరత్న... చంద్రబాబు, లోకేష్‌తో కూడా చర్చ.. అయ్యో పాపం చివరికోరిక తీరకుండానే..!

Updated Date - 2023-02-21T22:37:02+05:30 IST