MLA Seethakka : ‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు’ అంటూ ఏడ్చేసిన ఎమ్మెల్యే సీతక్క..!

ABN , First Publish Date - 2023-09-03T20:32:57+05:30 IST

‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు.. చాలా ఏళ్లుగా నాకు వ్యక్తిగత పీఏగా ఉంటూ, నిన్న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం మాకు తీరని లోటు...

MLA Seethakka : ‘మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు’ అంటూ ఏడ్చేసిన ఎమ్మెల్యే సీతక్క..!

ములుగు ఎమ్మెల్యే సీతక్క (MLA Seethakka) పీఏ కొట్టం వెంకటనారాయణ (జబ్బార్) రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జిల్లా కేంద్రంలోని సాధన హైస్కూల్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో (Road Accident) ఆయన దుర్మరణం పాలయ్యారు. వ్యక్తిగత పనిమీద నర్సంపేటకు బైక్ వెళ్లి తిరిగి ములుగుకు వస్తుండగా బైక్ స్కిడ్ అయ్యి డివైడర్‌ను ఢీ కొట్టాడు. జబ్బార్ తల రోడ్డుకు బలంగా తాకడంతో తీవ్ర రక్తస్రావమై చనిపోయాడు. గత ఎనిమిదేళ్లుగా సీతక్క దగ్గర అంతర్గత పీఏగా ఆయన పనిచేస్తున్నాడు. అయితే హెల్మెట్ ధరించి ఉంటే.. బతికేవాడని, తలకు బలమైన గాయాలు కావడంతో రక్తస్రావమై చనిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.


Seethakka-PA.jpg

ఏడ్చేసిన సీతక్క!

కాగా.. వెంకటనారాయణ అంత్యక్రియలు ఆదివారం నాడు ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో జరిగాయి. అంతిమ సంస్కారాలకు హాజరైన సీతక్క.. జబ్బార్ ఇకలేరని కంటతడి పెట్టుకున్నారు. ఆయన మరణం తీరని లోటని బోరున ఏడ్చేశారు సీతక్క. వెంకటనారాయణ కుటుంబానికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని సీతక్క హామీ ఇచ్చారు. ఓ వైపు వర్షం కురుస్తున్నప్పటికీ సీతక్క స్వయంగా అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జబ్బార్ సతీమణి.. కుటుంబ సభ్యులను ఓదార్చారు. జబ్బార్ అందరితో ఎంతో కలిసి, మెలిసి ఉండేవారని.. దేవుడు ఇంత చిన్నచూపు చూస్తాడనుకోలేదని అతని మిత్రులు, స్థానికులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు.. జబ్బార్ అంత్యక్రియలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు.

Seethakka-Jabbar.jpg

ఫేస్‌బుక్ పోస్టు..

మా ఊరివాడు.. నా ముందే పెరిగాడు.. చాలా ఏళ్లుగా నాకు వ్యక్తిగత పీఏగా ఉంటూ, నిన్న దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించడం మాకు తీరని లోటు. వెంకట నారాయణ (జబ్బార్) ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. ఆయన కుటుంబానికి నేను, కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని హామీ ఇస్తున్నాముఅని తన అధికారిక ఫేస్‌బుక్‌లో సీతక్క రాసుకొచ్చారు. వందలాది మంది అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు ఈ పోస్టుకు కామెంట్స్ చేస్తూ భావోద్వేగానికి లోనయ్యారు.

Jabbar.jpg


ఇవి కూడా చదవండి


TS Assembly Polls : ఎన్నికల సమయంలో తెలంగాణకు కేంద్రం భారీగా నిధులు.. ఎన్నికోట్లు ఇచ్చిందంటే..?


Land On Moon : చంద్రుడిపై జోరుగా రియల్ ఎస్టేట్.. రెండెకరాల భూమి కొన్న కృష్ణా జిల్లా వాసి..


Massive Rain Alert : తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్య గమనిక.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో రేపు అతి భారీ వర్షాలు

Updated Date - 2023-09-03T20:36:15+05:30 IST