NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం

ABN , First Publish Date - 2023-09-11T19:37:37+05:30 IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రెండు మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు అరెస్ట్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు...

NCBN Arrest : చంద్రబాబు అరెస్ట్‌తో బాధ్యతగా నారా లోకేష్ కీలక నిర్ణయం

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌తో రెండు మూడ్రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బాబు అరెస్ట్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ తెలుగు ప్రజలు, సినీ, రాజకీయ ప్రముఖులు, పలు రాజకీయ పార్టీల అధినేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరీముఖ్యంగా ఏపీలో ఇవాళ బంద్‌కు టీడీపీ పిలుపునివ్వగా.. ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీలన్నీ మద్దతిచ్చాయి. మరోవైపు.. రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్‌పై ఉన్న చంద్రబాబును బయటికి తీసుకొచ్చేందుకు టీడీపీ నేతలు న్యాయ పోరాటం చేస్తున్నారు. చంద్రబాబును హౌస్ కస్టడీకి ఇవ్వాలని సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగినప్పటికీ చివరికీ మంగళవారానికి తీర్పు వాయిదా పడింది.


Lokesh.jpeg

బాధ్యతగా నిలిపివేత..!

ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు. యువగళం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. సోమవారం నాడు సాయంత్రం మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ప్రస్తుతం యువగళం యాత్రను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిపారు. ‘మా పార్టీ అధినేతపై దాడి జరుగుతోంది. దాన్ని ఆపాల్సిన బాధ్యత నాపై ఉంది. మా కార్యకర్తలు, నాయకులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నాను. మళ్లీ ఎప్పుడు మొదలు పెడతామనే విషయాన్ని త్వరలోనే తెలియజేస్తాం అని లోకేష్ తెలిపారు. మరోవైపు.. బంద్‌కు సహకరించిన ప్రజలు, రాజకీయ పార్టీలు.. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రత్యేకంగా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు.

Lokesh-and-CBN-Advocate.jpg

స్ట్రాంగ్ వార్నింగ్..

ఎన్నిసార్లు జైలుకు పంపినా మా పోరాటం ఆగదు.. మిమ్మల్ని వదిలిపెట్టం. చంద్రబాబు అరెస్ట్‌ను ప్రజలంతా ఖండించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అవినీతి అనేది ఆరోపణే. టీడీపీ ప్రభుత్వంలో లక్ష మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం. సీఐడీ అంటే కక్ష సాధింపు డిపార్ట్‌మెంట్‌. చంద్రబాబుపై అవినీతి మరక వేసేందుకు సైకో కుట్రలు చేస్తున్నారు. జగన్‌కు ఉన్న అవినీతి బురదను అందరికీ రుద్దేందుకు కుట్రలకు తెగబడ్డారు. అవినీతి అనేది చంద్రబాబు రక్తంలోనే లేదు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణలు చేశారు. దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారు అని లోకేశ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBN-Marriage.jpg

ఐదు నిమిషాలు కూడా..!

నిన్న అమ్మా నాన్నల పెళ్లి రోజు, కుటుంబ సభ్యులతో 5 నిమిషాలు కూడా మాట్లాడనివ్వలేదు. చంద్రబాబు జైలుకెళ్లారనే షాక్‌లో మా కుటుంబం ఉంది. నేను 8th క్లాస్ వరకూ నాన్నని ప్రత్యక్షంగా సరిగా చూసింది లేదు. కుటుంబం కంటే ప్రజా సేవకోసమే పరితపించిన నాయకుడిని ఇలా చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం. సైకోతో పోరాడుతున్నప్పుడు ఇవన్నీ తప్పవని మాకు మేము సద్ది చెప్పుకున్నాం. యువగళం పాదయాత్ర, మా నాయకుడి పోరాటానికి ప్రభుత్వం భయపడిందని స్పష్టమయింది. ప్రజా చైతన్యంలో భాగంగా రేపటి నుంచి పార్లమెంట్ పార్టీ సమావేశాలు నిర్వహించుకుంటూ వెళ్తాం. భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికనూ త్వరలోనే ప్రకటిస్తాం. ప్రజలు, రాష్ట్రం దేశం తప్ప వేరే ఏదీ ఆలోచించని నాయకుడు చంద్రబాబు. అవినీతికి ఆస్కారం లేని నేత. ప్రపంచానికి తెలిసిన నాయుడిపై దొంగ కేసులు పెట్టి జైలుకు పంపారుఅని లోకేష్ ఒకింత తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.

lokesh-202-day.jpg


ఇవి కూడా చదవండి


Chandrababu Case : చంద్రబాబు హౌస్ రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తీర్పు వాయిదా.. ఎప్పుడొస్తుందంటే..!?


CBN House Custody : హౌస్ కస్టడీపై ఏసీబీ కోర్టు తీర్పుకు ముందు కీలక పరిణామం


NCBN Arrest : చంద్రబాబును హౌస్‌ రిమాండ్‌కు ఇవ్వాలని లూథ్రా ఎందుకు అడుగుతున్నారంటే..?


CBN House Custody : ముగిసిన వాదనలు.. మరో అరగంటలో కీలక తీర్పు


NCBN Arrest : చంద్రబాబు కేసుపై ఏసీబీ కోర్టులో వాడివేడిగా వాదనలు.. లూథ్రా టీమ్ ఏం చేయబోతోంది..!?


Updated Date - 2023-09-11T19:43:52+05:30 IST