MP Avinash CBI Enquiry : ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో మరో ట్విస్ట్.. ఎవరూ క్లారిటీ ఇవ్వరేం..!?

ABN , First Publish Date - 2023-04-17T15:58:49+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణలో (CBI Enquiry) అధికారులు మరో ట్విస్ట్ ఇచ్చారు

MP Avinash CBI Enquiry : ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణలో మరో ట్విస్ట్.. ఎవరూ క్లారిటీ ఇవ్వరేం..!?

తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (YS Vivekananda Reddy) హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) సీబీఐ విచారణలో (CBI Enquiry) అధికారులు మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి కాన్వాయ్‌లో బయల్దేరిన అవినాష్ నిమిషాల వ్యవధిలోనే సీబీఐ ఆఫీసు నుంచి వెనుదిరిగారు. ఆదివారం సీబీఐ ఇచ్చిన నోటీసుల్లో ఇవాళ మధ్యాహ్నం 3:00 గంటలకు విచారణకు రావాలని పేర్కొంది. అయితే.. 3:45 నిమిషాలకు హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. దీంతో సాయంత్రం 5 గంటలకు అవినాష్‌ను విచారించొద్దన్న సీబీఐను హైకోర్టు ఆదేశించింది. ఇందుకు స్పందించిన సీబీఐ.. సాయంత్రం 5 తర్వాతే విచారణకు పిలుస్తామని తెలిపింది.

ఇదీ ట్విస్ట్..!

ఈ లోపే అవినాష్ విచారణ ఇవాళ కాదని మంగళవారం 10 గంటలకు రావాలని సీబీఐ అధికారులు మరోసారి నోటీసులిచ్చినట్లు వార్తలు వచ్చాయి. అటు మెయిన్‌స్ట్రీమ్ మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఇందుకు సంబంధించి వార్తలు వైరల్ అయ్యాయి. అయితే.. సీబీఐ ఇంతవరకూ విచారణ విషయంలో నోటీసులివ్వలేదు. అంతేకాదు కొన్ని చానెల్స్‌లో వస్తున్నట్లుగా మంగళవారం 10 గంటలకు విచారణకు రమ్మని కూడా అధికారులు ఆదేశించలేదు. అయితే.. మంగళవారం విచారణకు తన క్లయింట్ వస్తారని అవినాష్ అడ్వకేట్ సీబీఐ అధికారులకు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోయారు. ఈ గ్యాప్‌లోనే ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.

CBI.jpg

ఇవాళే విచారణ..!

ఇదిలా ఉంటే అవినాష్ విచారణ ఇవాళ సాయంత్రమే ఉండే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇప్పటికే సీబీఐ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఐదు గంటలకు అవినాష్ విచారణకు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో విచారణ ఇవాళ.. లేకుంటే రేపు ఉంటుందా అనేదానిపై ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు.. రేపు ఉదయం 10.30 గంటలకు అవినాష్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు న్యాయవాది మీడియాకు వివరించారు. అయితే న్యాయవాది వ్యాఖ్యలపై ఇంతవరకూ సీబీఐ నుంచి ఎలాంటి స్పష్టత కూడా రాలేదు. మరోవైపు.. కొద్దిసేపటి క్రితమే అవినాశ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభమైంది. అరెస్ట్ చేయకుంటే విచారణకు హాజరయ్యేందుకు సిద్ధమని అవినాశ్‌ లాయర్‌ చెబుతున్నారు. ఈనెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు చెప్పిందని అందుకే వేగవంతం చేస్తున్నట్లు సీబీఐ లాయర్ చెబుతున్నారు. విచారణకు ఎప్పుడు పిలిచినా కోర్టుల్లో పిటిషన్లు వేస్తున్నారని.. సీబీఐ లాయర్ ఒకింత ఆగ్రహానికి లోనైనట్లు తెలుస్తోంది. అయితే.. కోర్టులో వాదనలు మగిశాక విచారణకు హాజరవుతామని అవినాశ్‌ లాయర్‌ మీడియాకు వివరించారు.

MP-Avinash-Reddy-Media.jpg

మొత్తానికి చూస్తే.. తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చిన తర్వాతే విచారణ ఇవాళ ఉంటుందా.. లేకుంటే రేపు ఉంటుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే కోర్టు ముందస్తు బెయిల్ ఇస్తుందా లేకుంటే విచారణకు వెళ్లాల్సిందేనని తీర్పు ఇస్తుందా అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అంతేకాదు అవినాష్ విచారణకు వెళ్తే కచ్చితంగా అరెస్ట్ చేస్తారని వార్తలు వస్తుండటంతో ఏం జరుగుతుందో అని వైసీపీలో నరాలు తెగే టెన్షన్ మొదలైంది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్‌ మూడాఫ్‌ అయ్యారా.. ఈ దెబ్బతో..!

******************************

YS Bhaskar Reddy Arrest : తండ్రి అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్ రెడ్డి.. కీలక విషయాలు వదిలి సిల్లీగా...!

******************************

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?


******************************

YS Jagan : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో సీఎం జగన్ సడన్‌గా.. ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చ

*****************************

Updated Date - 2023-04-17T16:02:43+05:30 IST