Congress 1st List: కాంగ్రెస్ తొలి జాబితాలో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

ABN , First Publish Date - 2023-09-23T18:49:05+05:30 IST

కాంగ్రెస్ తొలి జాబితాలో సుమారు 60 మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. తొలి విడత జాబితాలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాలలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది.

Congress 1st List: కాంగ్రెస్ తొలి జాబితాలో చోటు దక్కించుకునేది వీళ్లేనా?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే అధికార పార్టీ బీఆర్ఎస్ తమ అభ్యర్థులతో తొలి విడత జాబితాను విడుదల చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే పనిలో నిమగ్నమై ఉంది. ఈ అంశంపై గురువారం, శుక్రవారం రెండు రోజుల పాటు ఢిల్లీలో అభ్యర్థుల ఖరారుపై స్క్రీనింగ్ కమిటీ వరుస సమావేశాలు నిర్వహించింది. శనివారం నాడు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో మాణిక్‌రావు థాక్రేతో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి సమావేశం అయ్యారు. రెండు విడతల్లో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఈనెలాఖరు కల్లా తొలి విడత జాబితా విడుదల చేస్తామని మాణిక్‌రావు థాక్రే వెల్లడించారు. తొలి విడతలో 50 శాతానికి పైగా అభ్యర్థుల ప్రకటన ఉంటుందని తెలిపారు. అభ్యర్థుల జాబితాను కేంద్ర ఎన్నికల కమిటీ విడుదల చేస్తుందన్నారు.

119 నియోజకవర్గాల నుంచి దరఖాస్తు చేసుకున్న 300 మంది పేర్లపై స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చించారు. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహకర్త సునీల్ తాము చేసిన సర్వేల నివేదికను అధిష్టానానికి అందజేసినట్లు సమాచారం. ఇద్దరు, ముగ్గురు, అంతకన్నా ఎక్కువ మంది పోటీ పడుతున్న నియోజకవర్గాల్లో ఎవరికి ఎంత శాతం గెలుపు అవకాశాలు ఉన్నాయనే దానిపైన వివరాలు అందించగా దానిపై చర్చించి కమిటీ నేతలు అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: Muthireddy Yadagiri Reddy: జనగామ టికెట్‌పై మరోసారి హట్ కామెంట్స్ చేసిన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

అయితే కాంగ్రెస్ తొలి జాబితాలో సుమారు 60 మంది పేర్లు ఉంటాయని ప్రచారం జరుగుతోంది. తొలి విడత జాబితాలో బలమైన, ముఖ్యమైన అభ్యర్థులతో ఏకాభిప్రాయం ఉన్న కొన్ని స్థానాలలో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. ఈ మేరకు తొలి జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (కొడంగల్), సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (మధిర), ఉత్తమ్ కుమార్ రెడ్డి (హుజూర్ నగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), సీతక్క (ములుగు), పోదెం వీరయ్య (భద్రాచలం), శ్రీధర్ బాబు (మంథని), జగ్గారెడ్డి (సంగారెడ్డి), దామోదర్ రాజనర్సింహ (ఆందోల్), జీవన్ రెడ్డి (జగిత్యాల), జి. వినోద్ (బెల్లంపల్లి), షబ్బీర్ అలీ (కామారెడ్డి), సంపత్ కుమార్ (ఆలంపూర్), వంశీ చంద్ రెడ్డి (కల్వకుర్తి), గడ్డం ప్రసాద్ కుమార్ (వికారాబాద్), పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు (సత్తుపల్లి), ఫిరోజ్ ఖాన్ (నాంపల్లి), ప్రేమ్ సాగర్ రావు (మంచిర్యాల), అంజన్ కుమార్ యాదవ్, ఉత్తమ్ పద్మావతి రెడ్డి (కోదాడ), మల్‌రెడ్డి రంగారెడ్డి (ఇబ్రహీంపట్నం), విజయ రమణారావు (పెద్దపల్లి), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), వంశీకృష్ణ వంటి నేతల పేర్లు ఫైనల్ చేసినట్లు సమాచారం. అయితే కొందరు నేతలకు నియోజకవర్గాల కేటాయింపు విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.

Updated Date - 2023-09-23T19:07:30+05:30 IST