Home » Assembly elections
2024 ఏడాది .. దేశంలోని 8 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు తమదైన శైలిలో తీర్పు ఇచ్చారు.
శాసనసభ శీతాకాల సమావేశాలు గరంగరంగా జరుగుతున్నాయి. సోమవారం అసెంబ్లీలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇంతకుముందు మూడు జాబితాల్లో 32 మంది అభ్యర్థులను 'ఆప్' ప్రకటించింది. దీంతో ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు పూర్తిగా అభ్యర్థులను ప్రకటించినట్టయింది.
మహారాష్ట్ర కేబినెట్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనుంది. నాగపూర్లోని రాజ్భవన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్.. మంత్రుల చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.
70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి మరికొద్ది రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ఢిల్లీ మాజీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ శనివారం లేఖాస్త్రాం సంధించారు.
ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో అభ్యర్థులను రంగంలోకి దించాలని ఆలిండియా మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (మజ్లిస్) పార్టీ నిర్ణయించింది. ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు అధికంగా ఉన్న శాసనసభ నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులను పోటీకి దించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) ప్రణాళికుల రూపొందించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్ను ఆప్ విడుదల చేసింది.
ప్రతాప్గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సోసిడియా ఈసారి జంగ్పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించారు.
బీజేపీపై పోరుకు ఆప్, కాంగ్రెస్ చేతులు కలుపుతాయంటూ గతంలో ఊహాగానాలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆదివారంనాడు ఏర్పాటు చేసిన సమావేశంలో దీనిపై కేజ్రీవాల్ స్పష్టత ఇచ్చారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ఏక్నాథ్ షిండే ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు గురువారం రాత్రి దేశ రాజధాని న్యూఢిల్లీలో అమిత్ షాతో అజిత్ పవార్, ఫడ్నవీస్ సమావేశమై.. రాష్ట్రంలో అధికార పంపిణీ ఒప్పందంపై చర్చించారు.