AP Politics : వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలేమో.. ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం..!

ABN , First Publish Date - 2023-07-15T16:53:24+05:30 IST

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం.. ముఖ్యంగా ‘నాడు-నేడు’లో (Nadu-Nedu) భాగంగా ప్రభుత్వ పాఠశాలలు బాగుచేస్తూ.. విద్యార్థులకు ‘అమ్మఒడి’ (Amma Vodi) , ‘జగనన్న విద్యా దీవెన’ (Jagananna Vidya Deevena) ఇలా నవరత్నాల్లో (Nava Ratnalu) భాగంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తు్న్నామని వైసీపీ మంత్రుల నోట, ఏ బహిరంగ సభలో చూసినా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తెగ ఊదరగొడుతుంటారు...

AP Politics : వైఎస్ జగన్ పాలన ఎలా ఉందో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలేమో.. ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం..!

వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలకు న్యాయం చేస్తున్నాం.. ముఖ్యంగా ‘నాడు-నేడు’లో (Nadu-Nedu) భాగంగా ప్రభుత్వ పాఠశాలలు బాగుచేస్తూ.. విద్యార్థులకు ‘అమ్మఒడి’ (Amma Vodi) , ‘జగనన్న విద్యా దీవెన’ (Jagananna Vidya Deevena) ఇలా నవరత్నాల్లో (Nava Ratnalu) భాగంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తు్న్నామని వైసీపీ మంత్రుల నోట, ఏ బహిరంగ సభలో చూసినా సీఎం వైఎస్ జగన్ రెడ్డి (CM YS Jagan Reddy) తెగ ఊదరగొడుతుంటారు. ఆ రెండు పథకాలు ఎంతమందికి అందాయి..? సరైన నిరుపేదలకే అందుతున్నాయా..? అనేది దేవుడెరుగు.! స్కూళ్లకు వెళ్లడానికి కనీసం బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలలు ఊరికి కిలోమీటర్ల దూరంలో ఉండటం.. బస్సుల్లేకపోవడం, ఆటోల్లో విపరీతంగా ఛార్జీలు ఉండటంతో దిక్కుతోచని పరిస్థితి. ఇదిగో ఈ ఒక్క ఫొటో చూస్తే అసలు విషయమేంటో మీకు అర్థమైపోతుంది. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది..? ఎన్నిరోజులుగా విద్యార్థులు ఇలా ఇబ్బంది పడుతున్నారు..? ఇంత జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..


Tractors.jpg

ఇదీ అసలు కథ..!

చూశారుగా.. స్కూల్‌కు వెళ్లడానికి బస్సుల్లేక, ఆటోల్లో ఛార్జీల మోత భరించలేక విద్యార్థులు ప్రతిరోజూ ట్రాక్టర్‌లో (Tractor) చదువుకోవడానికి వెళ్తున్న పరిస్థితి. జగన్ ఏ మాత్రం పరిపాలన సాగిస్తున్నారో చెప్పడానికి ఈ ఒక్క ఫొటో చాలని సోషల్ మీడియాలో ప్రతిపక్ష పార్టీలు, నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఛీ.. ఛీ.. సిగ్గు పడండి సీఎం’ అని సామాన్యులు సైతం ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు.. సొంత పార్టీ కార్యకర్తలు కూడా అధికారంలోకి వచ్చి నాలుగేళ్లవుతున్నా ఏమిటీ దౌర్భాగ్యం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. రాయలసీమలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలో పలు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. ముఖ్యంగా ఈ మండలంలోని అల్వాల, ఏనుగుబాల గ్రామాలకు బస్సులు పెద్దగా రావట్లేదు. దీంతో ఆయా గ్రామాల్లోని గవర్నమెంట్ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులకు మరో మార్గంలేక ఇలా ప్రాణాలను పణంగా పెట్టి ట్రాక్టర్లలో ప్రయాణిస్తున్నారు. కరోనా తర్వాత ఈ గ్రామాలకు ఆర్టీసీ అధికారులు బస్సులు తగ్గించారని.. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడినా మునుపటిలా రవాణా పునరుద్ధరణ కాలేదని స్థానికులు, విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. విద్యార్థులు ట్రాక్టర్‌లో వెళ్లినప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వెళ్తున్నారని.. ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యులు..? అని తల్లిదండ్రులు జగన్ సర్కార్‌ను ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం మొద్దు నిద్రమాని బస్సు సౌకర్యం కల్పించి.. విద్యార్థుల చదువుకు సహకరించాలని అల్వాల, ఏనుగుబాల గ్రామస్థులు కోరుతున్నారు.

YS-Jagan.jpg

- అంతేకాదు.. కర్నూలులోని హొళగుంద మండలంలోని పలు గ్రామాల నుంచి జిల్లా పరిషత్ హై స్కూల్, మోడల్ స్కూల్‌కు వెళ్లేందుకు విద్యార్థులు కూడా ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు. బస్సులు లేక ట్రాక్టర్‌పై ప్రమాదకరంగా ప్రయాణించాల్సిన పరిస్థితి. ఆదోని నుంచి వలగుంద మండలంలోని పలు గ్రామాలకు రోడ్డు మార్గం బాగా లేనందున బస్సు సౌకర్యం లేదు.. దీంతో ఇలా ట్రాక్టర్‌లో వెళ్లి చదువుకోవాల్సి వస్తోందని విద్యార్థులు చెబుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అటు అల్వాల, ఏనుగుబాల గ్రామాల నుంచి, వలగుందల మీదుగా బస్సులు నడపాలని కోరుతున్నారు.

Kurnool-Ministers.jpg

సిగ్గో సిగ్గు సారూ..?

కర్నూలు జిల్లా నుంచి.. ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy), కార్మిక శాఖ మంత్రిగా గుమ్మనూరు జయరాం (Gummanur Jayaram) జగన్ కేబినెట్‌లో కొనసాగుతున్నారు. ఇద్దరు మంత్రులున్న ఈ జిల్లాలో కనీసం మారుమూల ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటు.! అదుగో అది చేసింది మేమే.. ఇది చేసింది మేమే.. అంతా మేమే చేస్తున్నామని ఓ రేంజ్‌లో గొప్పలు చెప్పుకునే జగన్.. విద్యార్థుల సమస్యలను, అది కూడా బస్సు సౌకర్యం గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఇకనైనా ఆర్టీసీ అధికారులు, రవాణా శాఖమంత్రి ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకుని ఆయా గ్రామాలకు బస్సులు నడిచేలా చూడాల్సిందేనని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మరి ఇవన్నీ తెలిశాక అయినా ప్రభుత్వం నుంచి స్పందన ఉంటుందో లేదో చూడాలి మరి.


ఇవి కూడా చదవండి


TeluguDesam : నారా లోకేష్‌తో చేతులు కలిపిన వైసీపీ యంగ్ ఎంపీ.. ఏదో జరుగుతోందంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ..!


Pawan Kalyan : చింతిస్తున్నా.. అందరి ముందు క్షమాపణలు కోరిన పవన్ కల్యాణ్


BJP Vs YSRCP : మొదటి ప్రసంగంతోనే వైఎస్ జగన్‌ను ఏకిపారేసిన పురంధేశ్వరి.. కనీసం కౌంటర్ ఇవ్వడానికి వైసీపీ సాహసించట్లేదంటే..!?


BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?


Updated Date - 2023-07-15T17:02:01+05:30 IST