BRS MLA Ticket : తెలంగాణలో అందరికంటే ముందుగా ఈ ఎమ్మెల్యేకే.. కేసీఆర్ టికెట్ ప్రకటించారా.. మంత్రి సంగతేంటో..!?
ABN , First Publish Date - 2023-07-10T19:54:48+05:30 IST
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ (BRS) దూకుడు మీద ఉంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అయితే కేసీఆర్‌కు (CM KCR) బ్రేక్‌లు వేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, Congress) ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి..
తెలంగాణలో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తుండటంతో అధికార బీఆర్ఎస్ (BRS) దూకుడు మీద ఉంది. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ తహతహలాడుతున్నారు. అయితే కేసీఆర్‌కు (CM KCR) బ్రేక్‌లు వేయాలని ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్‌లు (BJP, Congress) ఇప్పట్నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. జులై-15న 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ప్రకటించబోతున్నారని తెలియవచ్చింది. అయితే మిగిలిన అభ్యర్థులను ఈ నెల చివరిలో ప్రకటిస్తారని పార్టీ శ్రేణుల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఇప్పటికే సుమారు 10 నుంచి 17 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు నియోజకవర్గాల పర్యటనలో ప్రకటించారు. దీంతో ఆయా అభ్యర్థులు నియోజకవర్గాల్లో పనులు చేసుకుంటూ పోతున్నారు. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. తమకు టికెట్ వస్తుందో..? రాదో..? అన్న టెన్షన్ పడుతున్నారు. అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఓ సిట్టింగ్ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.
అసలేం జరిగిందంటే..?
డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యా నాయక్ (Dornakal MLA Redya Naik) రానున్న ఎన్నికల్లో పోటీ చేయట్లేదని గత కొన్నిరోజులుగా వార్తలొస్తున్నాయి. ఎమ్మెల్యేగా కుమార్తెను బరిలోకి దింపుతున్నట్లు నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సిట్టింగ్‌లకే కష్టం అని అంటుంటే ఇదేంటి..? అని బీఆర్ఎస్ శ్రేణులు ఆశ్చర్యపోతున్నాయి. అయితే తాజాగా.. రెడ్యానాయక్ మీడియా ముందుకొచ్చి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో అందరికంటే ముందే సీఎం కేసీఆర్ తనకే టికెట్ ప్రకటించారని రెడ్యా నాయక్ తనకు తానుగా ప్రకటించుకున్నారు. ఈ వరుస వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే వ్యాఖ్యలతో మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు రెడ్యా నాయక్ తాజా ప్రకటన ‘కుమార్తెకే టికెట్’ అనే ప్రచారానికి, వార్తలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. అయితే అధిష్టానం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన కానీ.. రియాక్షన్ గానీ రాలేదు. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాల్సి ఉంది.
ఏం జరుగుతుందో..?
2014లో కాంగ్రెస్ తరఫున డోర్నకల్ నుంచి పోటీచేసి గెలిచిన రెడ్యా నాయక్.. ఆ తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈయన గులాబీ తీర్థం పుచ్చుకోవడంతో బీఆర్ఎస్ తరఫున ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమనేలా పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సత్యవతికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన అధిష్టానం 2018 తర్వాత కేబినెట్‌లోకి తీసుకోవడం జరిగింది. అయితే రానున్న ఎన్నికల్లో డోర్నకల్ నుంచి పోటీచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఇదివరకు పలుమార్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే కేసీఆర్ నుంచి స్పష్టమైన ఆదేశాలిస్తే డోర్నకల్ నుంచి తానే పోటీచేస్తానని సత్యవతి మీడియాకు వెల్లడించారు. డోర్నకల్ నుంచే రాజకీయం ప్రారంభం అయినందున ఇక్కడ్నుంచే పోటీచేయడానికి కేసీఆర్ అవకాశం కల్పిస్తే తప్పుకుండా బరిలోకి దిగుతానన్నారు. అయితే రెడ్యా నాయక్ మాత్రం తన కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకురావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈ పరిస్థితుల్లో సత్యవతి ఎలా రియాక్ట్ అవుతారో.. ఫైనల్‌గా టికెట్ ఎవర్ని వరిస్తుందో వేచి చూడాల్సిందే మరి.