Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు

ABN , First Publish Date - 2023-04-17T16:50:00+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో..

Viveka Murder Case : ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్‌పై ముగిసిన వాదనలు.. తగ్గేదేలే అని తేల్చి చెప్పేసిన సీబీఐ.. హైకోర్టు కీలక ఆదేశాలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్యకేసులో సీబీఐ విచారణ జరుపుతున్న నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఇవాళ సీబీఐ విచారణ కూడా ఆగిపోయింది. హైకోర్టు తీర్పు అనంతరమే విచారించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. మధ్యాహ్నం 3:45 గంటలకు ప్రారంభమైన అవినాష్ ముందస్తు బెయిల్‌పై వాదనలు 4:45 గంటలకు ముగిశాయి. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. విచారణకు పిలిచినప్పుడల్లా ఇలా హైకోర్టును అవినాష్ రెడ్డి ఆశ్రయించడాన్ని సీబీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అవినాష్ విచారణకు వస్తే అరెస్ట్ చేస్తారా..? జస్టిస్ సురేందర్ రెడ్డి ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన సీబీఐ తరఫు న్యాయవాది.. విచారణ తర్వాత అవినాష్‌ను అవసరం అయితే అరెస్ట్ చేస్తామని తేల్చిచెప్పేశారు.

MP-Avinash-Reddy.jpg

బెయిల్ పిటిషన్‌పై వాదనలు ఇలా..

అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఎంపీ తరఫు న్యాయవాది.. సీబీఐ లాయర్‌ తమ వాదనలు వినిపించారు. వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు.. హైకోర్టులో భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసింది. భాస్కర్ రెడ్డిని అరెస్టు చేయడానికి దస్తగిరి కాంఫెషన్ తప్ప ఇంకా ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని సీబీఐ బెదిరించినట్టు, చిత్రహింసలకు గురిచేసినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పారు. దస్తగిరి సీబీఐకి భయపడి భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. అవినాష్ రెడ్డి సహ నిందితుడు అంటూ ప్రచారం జరుగుతోంది.. దస్తగిరికి బెయిల్ వచ్చిన తర్వాతి రోజే సీబీఐ వాళ్ళు 306 పిటిషన్ వేశారు. ఆయన్ను అప్రూవర్‌గా మార్చారు. హత్యకు సంబంధించిన ఆధారాలు లేవు. హత్య తర్వాత సాక్షాలు తుడిచివేయడంపై చెబుతున్నారు. సాక్షాలు రూపుమాపడం ఆరోపణ అయితే ఆయన్ను అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దానికి 7 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్షలు లేవు. అన్ని కోణాల్లో విచారించి హత్య ఎవరో చేశారో తేల్చే కోణంలో విచారణ జరగట్లేదు. రాజకీయ కోణంలోనే విచారణ జరుగుతోంది. రాజకీయ కోణంలో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి ఇరికించే కుట్ర జరుగుతోందిఅవినాష్ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

ఇందుకు స్పందించిన హైకోర్టు న్యాయమూర్తి.. పిటిషన్‌పై విచారణ మాత్రమే జరుగుతోందని.. అంతేకానీ అరెస్ట్ చేయొద్దనే ఆదేశాలు, మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు కదా..? అని చెప్పారు.

CBI.jpg

సీబీఐ వాదనలు ఇవీ..

అవినాష్ రెడ్డి నాలుగు సార్లు విచారణకు హాజరయ్యారు. మూడోసారి విచారణకు రమ్మనప్పుడు 5 రోజులు సమయం తీసుకుని హాజరయ్యారు. ఇప్పుడు విచారణకు రమ్మని నోటీసులు ఇస్తే మళ్ళీ పిటిషన్ వేశారు. మా తరఫు దర్యాప్తు పూర్తి చేయడానికే నోటీసులు ఇచ్చాం. వివేకా హత్య జరిగిన తర్వాత అవినాష్ పోలీసులకు ఫోన్ చేశారు. ముగ్గురు లేదా నలుగురు కానిస్టేబుల్స్ పంపండి చాలు అని చెప్పారు. అంతేకాదు.. గుండెపోటుతోనే వివేకా చనిపోయారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. హత్యను కప్పిపుచ్చుకునేందుకు సహజ మరణం కింద చిత్రీకరించారు. సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ రెడ్డి కీలక పాత్ర పోషించారు అని సీబీఐ తరఫు లాయర్ తన వాదనలు వినిపించారు.

TS-High-Court.jpg

విచారణ వాయిదా..

ఇలా ఇరువురి వాదనలు విన్న హైకోర్టు అవినాష్ రెడ్డిని రేపు (మంగళవారం) సాయంత్రం 4 గంటలకు విచారణకు పిలవాలని సీబీఐని ఆదేశించింది. అనంతరం బెయిల్ పిటిషన్‌పై విచారణను కూడా రేపటికే వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.

******************************

ఇవి కూడా చదవండి..

******************************

YSRCP : తాడేపల్లి ప్యాలెస్‌లో సీఎం వైఎస్ జగన్‌ మూడాఫ్‌ అయ్యారా.. ఈ దెబ్బతో..!

******************************

YS Bhaskar Reddy Arrest : తండ్రి అరెస్ట్‌పై ఫస్ట్ టైమ్ స్పందించిన అవినాష్ రెడ్డి.. కీలక విషయాలు వదిలి సిల్లీగా...!

******************************

YS Viveka Murder Case : వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డిపై ఉన్న అభియోగాలేంటి.. సీబీఐ అనుమానాలేంటి..!?


******************************

YS Jagan : వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో సీఎం జగన్ సడన్‌గా.. ఏపీ రాజకీయాల్లో ఓ రేంజ్‌లో చర్చ

*****************************

Updated Date - 2023-04-17T17:27:01+05:30 IST