Share News

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా

ABN , First Publish Date - 2023-12-11T21:47:19+05:30 IST

TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి ఇవాళ తన పదవికి రాజీనామా సమర్పించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపగా.. ఆమె జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించి సీఎస్‌ శాంతికుమారికి పంపించారు.

TSPSC: టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ పదవికి జనార్దన్‌రెడ్డి రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే పలు కార్పొరేషన్‌ల ఛైర్మన్‌లు రాజీనామాలు చేయగా.. తాజాగా టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ పంపగా.. ఆమె జనార్దన్‌రెడ్డి రాజీనామాను ఆమోదించి సీఎస్‌ శాంతికుమారికి పంపించారు.

కాగా సోమవారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్‌రెడ్డి కలిశారు. టీఎస్‌పీఎస్సీకి సంబంధించిన ఉద్యోగ నియామకాలు, నోటిఫికేషన్లపై చర్చించారు. అనంతరం అనూహ్యంగా జనార్ధన్ రెడ్డి తన పదవికి రాజీనామా సమర్పించారు. దీంతో రేవంత్ రెడ్డితో జరిగిన భేటీలో ఏం జరిగిందన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2021 మేలో టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌గా జనార్ధన్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. ఆయన హయాంలో టీఎస్పీఎస్సీలో పలు ప్రశ్నాపత్రాల లీకేజీలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆయన రాజీనామా చేయాలని సర్వత్రా విమర్శలు వినిపించాయి. కానీ వాటిని పట్టించుకోకుండా జనార్దన్‌రెడ్డి తన పదవిలో కొనసాగారు. ఇప్పుడు ప్రభుత్వం మారగానే ఆయన రాజీనామా చేశారు.


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - 2023-12-11T21:47:20+05:30 IST