BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?

ABN , First Publish Date - 2023-07-13T21:33:31+05:30 IST

అవును.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ సర్వేల్లో నెగిటివ్‌గా వచ్చిన ఎమ్మెల్యేలకు అస్సలు సీటివ్వకూడదని.. ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది టికెట్ ప్రకటన అయిపోయిందని.. ఇంకొందరు టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు...

BRS : తెలంగాణలో మారిపోతున్న రాజకీయ సమీకరణాలు.. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే ఔట్..!?

అవును.. తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఈసారి హ్యాట్రిక్ కొట్టాల్సిందేనని గులాబీ బాస్, సీఎం కేసీఆర్ (CM KCR) వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. అందుకే ఎంత కష్టమైనప్పటికీ సర్వేల్లో నెగిటివ్‌గా వచ్చిన ఎమ్మెల్యేలకు అస్సలు సీటివ్వకూడదని.. ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది టికెట్ ప్రకటన అయిపోయిందని.. ఇంకొందరు టికెట్ ఇవ్వకపోతే పార్టీలో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ఇలా అధికార పార్టీలో రోజుకో అసంతృప్తి గళం బయటికి వస్తున్న పరిస్థితి. టికెట్ ఇవ్వట్లేదని ముందుగానే తెలుసుకున్నారో లేకుంటే వేరే పార్టీలోకి వెళ్లాలని ఫిక్సయ్యారో తెలియట్లేదుగానీ.. కొన్నిరోజులుగా బీఆర్ఎస్ సిట్టింగ్‌లువరుసగా తమ అసంతృప్తిని బహిరంగంగానే వెల్లగక్కుతున్న పరిస్థితి. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఇద్దరూ కారు దిగి బయటికొచ్చేశారు. ఇదే బాటలో నడవడానికి ఎమ్మెల్సీలు కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి.. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి.. ఉన్నారని గత నాలుగైదు రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి..

ABN ఛానల్ ఫాలో అవ్వండి

chennamaneni-ramesh-babu.jpg

అసలేం జరిగింది.. ఎవరా సిట్టింగ్..?

తెలంగాణలో ఓ వైపు ‘పవర్’ పాలిటిక్స్ (Power Politics), మరోవైపు మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షు రావు (Himanshu Rao) వ్యవహారం హాట్ హాట్‌గా సాగుతుండగా.. సడన్‌గా వేమువాడ ఎమ్మె్ల్యే చెన్నమనేని రమేష్ బాబు (Chennamaneni Ramesh Babu) బహిరంగ సభలో తన అసంతృప్తిని వెల్లగక్కారు. 24 గంటల కరెంట్ విషయంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలతో బీఆర్ఎస్ (BRS) రగిలిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడ్రోజులుగా పెద్ద ఎత్తున ధర్నా, నిరసనలు తెలుపుతూ.. రేవంత్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు దగ్ధం చేస్తున్నాయి. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో రమేష్ బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో టికెట్ ఇష్యూ నా చేతిలో లేదు.. పార్టీ అధిష్టానం చేతిలో ఉంది. నా ప్లాన్ నాకు ఉంది. నేను పక్కకు జరగాలని కొందరు చూస్తున్నారు. దొంగలను నమ్మొద్దు.. నాకు అన్నీ తెలుసు. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచా.. నాకు ఏ పదవి మీద వ్యామోహం లేదు. బీఆర్ఎస్‌లో కొందరు అటు.. ఇటు ఉంటున్నారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా లేకున్నా పర్వాలేదు. నేను లేకపోతే ప్రజల భూములు కబ్జా చేస్తారు. ప్రజల ఆస్తులు కబ్జా చేస్తే మాత్రం ఊరుకోను.. కబడ్దార్. నా ముందు వాళ్లు లాగులు వేసుకున్నవారే. నేను వెళ్లాక మంచివారు రావాలి. కానీ.. దొంగలను రానివ్వద్దు. నా దగ్గర రెండు మాటలు ఉండవుఅని కార్యకర్తల సాక్షిగా కార్యకర్తలకు రమేష్ సూచించారు.

chennamaneni.jpg

సిట్టింగ్ ఔటేనా..?

మొత్తానికి చూస్తే.. రమేష్ బాబు మాటల్లో నిర్వేదం, ఆక్రోశం, అసంతృప్తి కనిపిస్తోంది.. పార్టీకి రాజీనామా చేసి బయటికి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదేమో..! ఇవన్నీ ఒక ఎత్తయితే ‘నా దారులు నాకున్నాయ్.. బీఆర్ఎస్ కొందరు అటు ఇటు ఉన్నారు’ అని ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్‌గా మారాయి. సో.. టికెట్ ఇవ్వకపోతే వేరే పార్టీలోకి వెళ్లయినా సరే పోటీ మాత్రం పక్కా అని పరోక్షంగా చెప్పేశారన్న మాట. అయితే ఒకట్రెండు రోజుల్లో 80 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా కేసీఆర్ రిలీజ్ చేయబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఆ జాబితాలో లేని వారు ఒక్కొక్కరుగా ఇలా ఏదో ఒక సందర్భంలో తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ఏం జరుగుతుందో చూడాలి మరి.

BRS.jpg


ఇవి కూడా చదవండి


TS Politics : హిమాన్ష్ సూచన తప్పకుండా తీసుకుంటాం.. రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు


Revanth Vs KCR : తెలంగాణలో ‘పవర్’ పాలిటిక్స్ నడుస్తుండగా.. షాకింగ్ సర్వే అంటూ సడన్‌గా బాంబ్ పేల్చిన రేవంత్ రెడ్డి


TS Elections : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయని తేలిందంటే..!


TS BJP : తెలంగాణపై బీజేపీ దూకుడు.. పెద్ద ప్లాన్‌తోనే కమలనాథులు వచ్చేస్తున్నారుగా.. ముహూర్తం ఫిక్స్..!


Pawan Anna lezhneva : ఉంటే ఉంటా.. పోతే పోతా.. భార్యకు క్షమాపణ చెప్పిన పవన్ కల్యాణ్.. భావోద్వేగం!


Kishan Reddy : కిషన్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చిపడింది.. పయనం ఎటో తేల్చుకోలేక అయోమయంలో అధ్యక్షుడు..!?


Modi Cabinet Reshuffle : మోదీ కేబినెట్‌ నుంచి ఔటయ్యేది ఎవరు.. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఇద్దరికీ ఛాన్స్..!?


Seethakka CM Candidate : సీతక్కను సీఎం అభ్యర్థిగా రేవంత్ ప్రకటించడం వెనుక వ్యూహమేంటి.. అసలు విషయం తెలిస్తే..!?


Updated Date - 2023-07-13T23:16:36+05:30 IST

News Hub