Viveka Murder Case : చంచల్‌గూడ జైల్‌లో ఎర్రగంగిరెడ్డిని కలిసిన వైఎస్ సునీత న్యాయవాది.. ఎందుకంటే..!

ABN , First Publish Date - 2023-05-20T22:35:46+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే..

Viveka Murder Case : చంచల్‌గూడ జైల్‌లో ఎర్రగంగిరెడ్డిని కలిసిన వైఎస్ సునీత న్యాయవాది.. ఎందుకంటే..!

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్యకేసులో (YS Viveka Murder Case) రోజుకో కీలక పరిణామం చోటుచేసుకుంటూనే ఉంది. ఇప్పటికే ఈ కేసులో సహనిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి (Kadapa MP Avinash Reddy) సీబీఐ విచారణకు (CBI Enquiry) హాజరుకాకుండా సాకులు చెబుతున్నారు. అయితే.. వివేకా హత్య కేసులో ఏ1 ఎర్రగంగిరెడ్డి (Erra Gangireddy) చంచల్‌గూడ జైల్‌లో ఉన్న ఆయన్ను శనివారం నాడు వైఎస్ సునీతారెడ్డి (YS Sunitha Reddy) న్యాయవాది కలిశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన నోటీసు కాపీని గంగిరెడ్డికి లాయర్ ఇచ్చి వెళ్లారు. అయితే.. గంగిరెడ్డిని కలిసేందుకు శుక్రవారం నుంచి సునీత విశ్వప్రయత్నాలు చేస్తున్నారని వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు.. గంగిరెడ్డిని కలవాలంటూ నేరుగా జైలు అధికారులకు రిక్వెస్ట్ చేసినప్పటికీ జైలు అధికారులు కుదరదని చెప్పేశారంటూ వైసీపీ కార్యకర్తలు ట్విట్టర్‌లో హడావుడి చేస్తున్నారు. అయితే సునీత తరఫు న్యాయవాది మాత్రమే వెళ్లి కలిసొచ్చారు.

Sunitha-Reddy.jpg

కాగా.. నిందితుడు ఎర్ర గంగి రెడ్డి బెయిల్ రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు సీజే జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆశ్చర్యం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బెయిల్‌ను రద్దు చేసి, మళ్లీ ఫలానా రోజున బెయిల్ ఇవ్వాలంటూ ఇచ్చిన ఉత్తర్వులపై అసహనం వ్యక్తం చేశారు. ఇవేం ఉత్తర్వులని ప్రశ్నించారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన తర్వాత.. విచారణను వెకేషన్ బెంచ్‌కి బదిలీ చేశారు. గంగిరెడ్డిని మళ్ళీ జూలై-1న విడుదల చేయాలని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చిన విషయం విదితమే. అయితే.. ఈ తీర్పును సుప్రీంకోర్టులో సునీతారెడ్డి సవాల్ చేశారు. దీనిపై వెకేషన్ బెంచ్‌లో సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. వివేకా హత్య కేసు దర్యాప్తును జూన్ 30 లోపు ముగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. దీంతో దూకుడు పెంచిన సీబీఐ అధికారులు కేసును కొలిక్కి తీసుకురావడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2023-05-20T22:40:00+05:30 IST