Avinash In Viveka Case Live Updates : అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని చెబుతూనే.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు..

ABN , First Publish Date - 2023-04-18T13:59:42+05:30 IST

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి రెండు కీలక అంశాలు ఇవాళ విచారణ జరుగుతున్నాయి..

Avinash In Viveka Case Live Updates : అవినాష్‌ను అరెస్ట్ చేయొద్దని చెబుతూనే.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు..

04:49pm : కీలక తీర్పు..

  • అవినాష్ ముందస్తు బెయిల్, సీబీఐ విచారణపై హైకోర్టు కీలక తీర్పు..

  • అవినాష్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

  • అవినాష్ రెడ్డిని ఈనెల 25 వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి హైకోర్టు ఆదేశాలు

  • 25 వరకు ప్రతిరోజు అవినాష్ విచారణకు హాజరుకావాలన్న హైకోర్టు

  • అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను అనుమతించిన హైకోర్టు

  • అవినాష్ విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డ్ చేయాలని సీబీఐకి ఆదేశాలు

  • విచారణ సమయంలో ప్రశ్నలు లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వాలి : హైకోర్టు

  • 25వరకు సీబీఐ ఎప్పుడు పిలిచినా అవినాష్ విచారణకు వెళ్లాల్సిందే : హైకోర్టు

  • ముందస్తు బెయిల్‌పై ఈనెల 25న తుదితీర్పు ఇవ్వనున్న హైకోర్టు

TS-High-Court.jpg

4:30PM: కాసేపట్లో తీర్పు

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో వాదనలు ముగిశాయి. ముందస్తు బెయిల్‌పై మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది. న్యాయమూర్తి ఆర్డర్ కాపీని నిశితంగా పరిశీలిస్తున్నారు. బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో నిన్న, ఈరోజు వాదనలు జరిగాయి. అవినాష్‌ రెడ్డికి బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాది, ఇవ్వాలని అవినాష్‌ రెడ్డి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. సునీత రెడ్డి ఇంప్లీడ్ పిటిష‌న్‌పై కూడా వాదనలు జరిగాయి. ఒకానొక దశలో సునీతరెడ్డి లాయర్, అవినాష్ రెడ్డి లాయర్ మధ్య హాట్ డిస్కషన్ నడిచింది. వాదనలు ముగియడంతో బెయిల్‌పై ఎలాంటి తీర్పు రాబోతుందనే ఉత్కంఠ నెలకొంది.

04: 25 pm : రేపు కస్టడీకి తీసుకుంటాం..

  • ఉదయ్ కుమార్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను రేపు పోలీసు కస్టడీకి తీసుకుంటాం : సీబీఐ తరపు న్యాయవాది

  • వాళ్ళతో కలిపి అవినాష్‌ను విచారించాల్సి ఉంది

  • చాలా విషయాలపై స్పష్టత తీసుకోవాల్సి ఉంది : సీబీఐ

  • రేపు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న విచారణ

04: 20 pm : కస్టడీకి అనుమతి..

  • A6 ఉదయ్ రెడ్డి, A7 భాస్కర్‌రెడ్డికి ఆరు రోజుల కస్టడీ అనుమతి ఇచ్చిన నాంపల్లి కోర్టు

  • రేపటి నుంచి 24 వరకు కస్టడీ విచారణ చేయనున్న సీబీఐ అధికారులు

Bhaskar-Reddy-Arrives-Hyder.jpg

4:12PM: గాయాలుంటే గుండెపోటని ఎలా అంటారు? : హైకోర్టు

  • ఎంపీ అవినాష్‌ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై అవినాష్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు.

  • వివేకా చేతిపై ఏ2 గొడ్డలితో నరికాడు అని చెపుతున్నారు

  • నరికిన తర్వాత ఆయన లెటర్ ఎలా రాసారు... దానిపై సీబీఐ స్పష్టత ఇవ్వలేదు: అవినాష్ న్యాయవాది.

  • చేతిపై తలపై కూడా గాయాలు ఉన్నాయా?: న్యాయమూర్తి ప్రశ్న

  • చేతి, తలపైనే కాదు చాలా చోట్ల గొడ్డలితో నరికిన గాయాలు ఉన్నాయి: అవినాష్ న్యాయవాది

  • మరి అలాంటప్పుడు అది గుండెపోటు అని ఎలా చెప్పారు: న్యాయమూర్తి ప్రశ్న

  • వేరే వాళ్లు చెప్పడం వల్ల అవినాష్ అలా అనుకున్నారు.: అవినాష్ లాయర్

3:54PM: గంట నుంచి కొనసాగుతున్న వాదనలు

  • వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి.

  • గంట క్రితం నుంచి వాదనలు జరుగుతున్నాయి.

  • భాస్కర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్‌లో గూగుల్ టేక్ ఔట్, దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు: అవినాష్ న్యాయవాది

  • ఇన్వెస్టిగేషన్ పూర్తి అయింది అని భాస్కర్ రెడ్డి రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

  • మళ్లీ ఇంకా అవినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని కోర్టు ముందు చెబుతున్నారు.

  • అసలు అవినాష్‌కు వివేకా మరణం గురించి ముందుగా చెప్పిందే సునీత భర్త సొంత తమ్ముడు.

  • ఆయనను విచారించకుండా వదిలేశారు: అవినాష్ లాయర్

  • దస్తగిరి స్టేట్‌మెంట్ ఆధారంగా ఎలా అవినాష్ రెడ్డిని, భాస్కర్ రెడ్డిని నిందితులుగా చేరుస్తారు?

  • గూగుల్ టేక్ ఔట్ రిపోర్ట్ తప్పుగా ఉంది.. దస్తగిరి స్టేట్‌మెంట్ కూడా నమ్మదగినదిగా లేదు: అవినాష్ న్యాయవాది

3:40 PM : రేపు అవినాష్‌ను విచారిస్తాం: సీబీఐ

  • గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అవినాష్ విచారణను ఆడియో వీడియో రికార్డ్ చేస్తున్నాం: సీబీఐ న్యాయవాది

  • అవినాష్ రెడ్డిని రేపు (బుధవారం) ఉదయం 10:30 గంటలకు విచారిస్తాం: సీబీఐ

  • సీబీఐ ఇప్పటి వరకు రెండు ఛార్జ్‌షీట్‌లు వేసింది: అవినాష్ న్యాయవాది

  • మొదటి ఛార్జ్‌షీట్ ముందే దస్తగిరి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు.

  • ఎక్కడా అవినాష్ రెడ్డి పాత్ర లేదు.

  • కానీ అనూహ్యంగా అవినాష్‌ను టార్గెట్ చేసింది సిబీఐ: అవినాష్ లాయర్

3:30 PM : అవినాష్ న్యాయవాదితో సునీత న్యాయవాది వాగ్వాదం

  • అవినాష్ రెడ్డి పిటిషన్‌పై వాదనల సందర్భంగా అవినాష్ న్యాయవాది నిరంజన్ రెడ్డితో సునీత రెడ్డి న్యాయవాది రవి చందర్ వాగ్వాదానికి దిగారు.

  • 25 గంటలకుపైగా అవినాష్‌ను సీబీఐ విచారించింది: అవినాష్ లాయర్

  • సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తాడు - అవినాష్ న్యాయవాది

3:26 PM: ఇద్దరు లాయర్ల మధ్య హాట్ డిస్కషన్

  • అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సునీత లాయర్, అవినాష్ రెడ్డి లాయర్ మధ్య హాట్ డిస్కషన్ నడుస్తోంది.

  • దస్తగిరికి సీబీఐ అలాగే సునీత రెడ్డి సహకరిస్తున్నారు: అవినాష్ తరపు న్యాయవాది

  • దస్తగిరి బయట కూర్చుని సీఎం జగన్, అవినాష్‌పై ఆరోపణలు చేస్తున్నాడు.

  • సీబీఐ అధికారులను కూడా అవినాష్ రెడ్డి మార్చేశాడు అంటున్నారు.

  • సి.బి.ఐ ఎస్పీ రామ్ సింగ్‌ను మార్చింది సుప్రీం కోర్టు: అవినాష్ లాయర్

  • గూగుల్ టేక్ ఔట్ అనే టూల్ ద్వారా అవినాష్ నేరం చేశారని ఎలా చెబుతారు?

  • ఏ4 దస్తగిరి తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చారు.

  • దస్తగిరి, సునీల్ యాదవ్‌ల మధ్య జరిగిన ఎస్‌ఎంఎస్, ఆయన కదలికలపై గూగుల్ టేక్ ఔట్ చెప్పిన సమయం టాలీ కావట్లేదు.

  • మొన్న అరెస్ట్ అయిన నిందితుడి రిమాండ్ రిపోర్టుకు అంతకు ముందు వేసిన ఛార్జ్‌షీట్లలో సమయం టాలీ కావట్లేదు.

  • తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చిన దస్తగిరిని సునీత న్యాయవాది సమర్ధిస్తున్నారు.

  • ఆయన తరపున వకాలత్ తీసుకున్నాడో ఏమో: అవినాష్ న్యాయవాది

  • వెంటనే కలగ చేసుకుని అభ్యంతరం చెప్పిన సునీత న్యాయవాది.

  • ఇద్దరి మధ్య హాట్ డిస్కషన్

3:15 PM: గదికి కాపలాగా భాస్కర్‌రెడ్డి.. లోనికి వెళ్లిన అవినాష్: సునీత లాయర్

  • గంగాధర్ రెడ్డి 161 స్టేట్‌మెంట్‌లో శివ శంకర రెడ్డి సన్నిహితుడుగా చెప్పారు..

  • అవినాష్ రెడ్డి , భాస్కర్ రెడ్డిల కుటుంబం ప్రమేయం లేకుండా హత్య చేసే అవకాశం లేదని శివ శంకర్ రెడ్డి చెప్పారు.

  • దస్తగిరి స్టేట్‌మెంట్ మాత్రమే కాదు గంగాధర్ రెడ్డి స్టేట్‌మెంట్‌ కూడా అవినాష్ ఈ కేసులో ప్రమేయం ఉందని చూపుతోంది.

  • రంగయ్య స్టేట్‌మెంట్ ప్రకారం వివేకా డెడ్ బాడీ ఉన్న గదిలోకి ఒకరిద్దరు పని వాళ్ళను తప్ప ఎవరినీ రానివ్వలేదు.

  • గదికి కాపలాగా భాస్కర్ రెడ్డి ఉన్నారు... అవినాష్ మాత్రం లోపలికి వెళ్లి వచ్చారన్న సునీత న్యాయవాది.

2:50 PM : తిరిగి విచారణ ప్రారంభం

  • వాయిదా తర్వాత అవినాష్ ముందస్తు బెయిల్‌పై తిరిగి విచారణ ప్రారంభం

  • అంతకుముందు వాదనలు వినిపించిన అవినాష్‌రెడ్డి లాయర్, సీబీఐ లాయర్

  • సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తున్న లాయర్ రవిచంద్

avinash-reddy.jpg

02: 15 pm : సీబీఐ నోట పదే పదే ఇదే మాట..

  • బెయిల్ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టిన అవినాష్ తరఫు లాయర్

  • ఎంపీ అవినాష్‌కు బెయిల్ ఇవ్వొద్దు

  • సీబీఐ నోట పదే పదే ఇదే మాట

  • బెయిల్ ఇవ్వొద్దని వాదించిన సీబీఐ తరఫు లాయర్

  • ఇప్పటివరకు అవినాష్‌ను నాలుగుసార్లు విచారించాం

  • రూ.40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించాం: సీబీఐ

  • అవినాష్‌రెడ్డి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు సాక్షాలు ఉన్నాయి

  • సాక్షాలు తారుమారు చేయడంలో అవినాశ్‌ది కీలక పాత్ర: సీబీఐ

  • వివేకా హత్య వెనకున్న కుట్ర కోణం వెలికి తీసేందుకు ప్రయత్నం

  • దీనిపై అవినాశ్‌రెడ్డిని విచారించాల్సి ఉంది: సీబీఐ లాయర్‌

CBI-Enquiry.jpg

02: 00 pm : విజయ్ కుమార్‌ విషయం వాస్తవమే కానీ.. : వైవీ సుబ్బారెడ్డి

  • విజయ్ కుమార్ స్వామి ఎవరి ద్వారా.. ఎందుకు.. ఎవరి విమానంలో వచ్చారు..?

  • విశ్వేశ్వరరావు కుమారుడు శశిధర్‌తో కలిసి ప్రత్యేక విమానంలో వచ్చారు : సుబ్బారెడ్డి

  • విజయ్ కుమార్ స్వామి నాకు 2007 నుంచి తెలుసు

  • విజయవాడ వచ్చారు కదా.. సీఎం గారిని కలిసి ఆశీస్సులు ఇవ్వమని నేను అడిగా..

  • సీఎం జగన్‌కు ఆశీస్సులు ఇవ్వడానికి వస్తే లాబీయింగ్ కోసం అని రాస్తున్నారు : సుబ్బారెడ్డి

  • మీరు చేస్తే ఆశీస్సులు కోసం... మేము చేస్తే లాబీయింగ్ కోసమా?

  • వివేకా కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది : సుబ్బారెడ్డి

  • నిజాలు తేల్చే పద్దతిలో విచారణ జరగాలి..

  • వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణలో ఒత్తిడులు ఉన్నాయని అనిపిస్తోంది..

  • వివేకా ఉన్నా వేరే సంబంధాల గురించి ఫోటోలు, చూస్తున్నాం.. : సుబ్బారెడ్డి

  • సునీత భర్త రాజశేఖర్ రెడ్డి పాత్రపై విచారణ జరపాలి : సుబ్బారెడ్డి

YV-Subba-Reddy.jpg

01: 45 pm : సునీతా రెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌పై ఇలా..

  • సునీతారెడ్డి ఇంప్లీడ్ పిటిషన్‌పై కొనసాగుతున్న వాదనలు

  • వాదనలు వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ ఎల్ రవిచంద్

  • అవినాష్ రెడ్డి వివేకా హత్య కేసుతో సంబంధం ఉందని కోర్టుకు ఇచ్చిన చార్జిషీట్‌లో ఉంది

  • దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్‌లోనూ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉందని తేలింది : రవిచంద్

  • ఎప్పుడు నోటీసు ఇచ్చినా అరెస్ట్ చేయవద్దని అవినాష్ కోర్టును ఆశ్రయిస్తున్నారు : సునీత న్యాయవాది

  • వివేక హత్య రోజు అవినాష్ రెడ్డి శివ శంకర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వచ్చారు

  • వివేక చనిపోయింది గుండె పోటుతోనే అని తేల్చారు : సునీత న్యాయవాది

  • గూగుల్ టేక్ ఔట్ సాక్షాలు సరిపోతాయా..? లేవా..? అనేవి విచారణ ఈ దశలో ఉన్నపుడు నిందితుడు తేల్చేది కాదు.. సరైన సమయంలో కోర్టులు పరిశీలిస్తాయి

  • విచారణను అడ్డుకోవదానికే అవినాష్ ప్రతిసారి ప్రయత్నం చేస్తున్నారు

  • సునీతకు, వివేకాకు కన్న కూతురు.. వారి మధ్య విబేధాలు లేవు : రవిచంద్

  • ఆంధ్రా నుండి తెలంగాణకు కేసు బదిలీ కావడానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి

  • ఏపీలో పలుకుబడి ఉపయోగించి విచారణను తప్పుదోవ పట్టించారు.. అందులో అవినాష్ రెడ్డి కూడా ఒకరు : రవిచంద్

YS--Sunitha.jpg

01: 40 pm : విచారణ వాయిదా..

  • మధ్యాహ్నం 2:30 గంటలకు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా

TS-High-Court-New.jpg

01: 20 pm : బెయిల్ ఇవ్వొద్దు..

  • సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌కుమార్‌ వాదనలు ఇవీ..

  • ఇప్పటివరకు నాలుగు సార్లు అవినాష్‌ను విచారించాం

  • అవినాష్‌రెడ్డి ఈ కేసులో ప్రమేయం ఉన్నట్లు సాక్ష్యాలు ఉన్నాయి

  • సైన్టిఫిక్ ఎవిడెన్స్ అన్ని సేకరించాం : సీబీఐ

  • 40 కోట్ల డీల్ జరిగినట్లు ఆధారాలు సేకరించాము

  • హత్య జరిగిన రోజు సాక్షాలు తారుమారు చేయడంలో అవినాష్ కీలక పాత్ర పోషించాడు

  • వైఎస్ వివేకా తలకు బ్యాండేజ్ వేసిన సహజ మరణంగా చిత్రికరించారు

  • ఉదయ్ కుమార్ తండ్రి జయ ప్రకాష్ రెడ్డి చేత ఇదంతా చేయించారు

  • అవినాష్ రెడ్డికి వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయి

  • ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు : సీబీఐ

  • వివేక హత్య జరిగిన రోజు అవినాష్ ఇంట్లోనే ఉన్నాడు..

  • సునీల్ యాదవ్ వైయస్ వివేకా పై గొడ్డలితో దాడి చేసాకా అవినాష్ ఇంటికి వెళ్ళాడు..

  • వివేక హత్య జరిగిన రోజు అవినాష్ మొబైల్ యాక్టివిటీస్ చాలా కీలకంగా ఉన్నాయి

  • హత్య జరిగిన రోజు జరిగిన నాలుగు కోట్ల లావాదేవీల వ్యవహారం పై విచారణ జరగాల్సి ఉంది

  • కేసులో A6 ఉదయ్ కుమార్ తండ్రి వివేకా బాడీపై ఉన్న గాయాలకు కుట్లు వేశారు : సీబీఐ

  • వివేకా హత్య వెనుక కుట్ర కోణం బయటకి తేసేందుకు ప్రయత్నిస్తున్నాం..

  • వీటిపై అవినాష్‌ని ఇంకా విచారించాల్సి ఉంది : సీబీఐ

  • ఇంతకు ముందు విచారణలో ఇవన్నీటికీ సమాధానం చెప్పలేదు.. : సీబీఐ

CBI.jpg

01: 10 pm : వాదనలు మొదలు..

  • అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యాహ్నం మొదలైన వాదనలు

TS-High-Court.jpg

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సహ నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి రెండు కీలక అంశాలు ఇవాళ విచారణ జరుగుతున్నాయి. ఇందులో ఒకటి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో విచారణ.. మరొకటి సాయంత్రం 4 గంటలకు సీబీఐ విచారణ. హైకోర్టులో అవినాష్ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి (T Niranjan Reddy).. సీబీఐ తరఫు న్యాయవాది అనిల్‌కుమార్‌ (CBI Lawyer Anil Kumar) వాదనలు వినిపిస్తున్నారు. అయితే.. హైకోర్టు ఏం తీర్పు ఇస్తుంది..? బెయిల్ ఇస్తుందా లేదా..? అనేదానిపై మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకల్లా స్పష్టత వచ్చే ఛాన్స్ ఉంది. సీబీఐ విచారణకు వెళ్తే పరిస్థితి ఏంటి..? విచారణ మాత్రమే ఉంటుందా..? విచారణ అనంతరం అరెస్ట్ ఉంటుందా..? అనేదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి చూస్తే.. హైకోర్టు తీర్పు తర్వాత కీలక పరిణామాలు మాత్రం చోటుచేసుకునే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. మరోవైపు.. సునీతారెడ్డి ఇప్లీడ్ పిటిషన్‌పై కూడా వాదనలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-04-18T17:37:05+05:30 IST