Lokesh Yuvagalam : లోకేష్ యువగళం పాదయాత్రలో తొలి మైలురాయి.. ఎప్పటికీ గుర్తుండి పోవాలని..

ABN , First Publish Date - 2023-02-03T22:33:39+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర తొలి మైలురాయి చేరుకుంది..

Lokesh Yuvagalam : లోకేష్ యువగళం పాదయాత్రలో తొలి మైలురాయి.. ఎప్పటికీ గుర్తుండి పోవాలని..

అమరావతి/చిత్తూరు : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘యువగళం’ (Yuvagalam) పాదయాత్ర తొలి మైలురాయి (First Milestone) చేరుకుంది. శుక్రవారం సాయంత్రం 6.45 గంటలకు బంగారుపాళ్యం (Bangarupalem) శివార్లకు చేరుకోవడంతో యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) 100 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. పాదయాత్రలో ఇదో తొలి మైలురాయి. ఈ సందర్భంగా స్థానిక నేతలు ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకంను లోకేశ్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రికి కిడ్నీ రోగుల కోసం డయాలసిస్‌ పరికరాలను కూడా ఉచితంగా (Free) అందజేశారు. 8వ రోజు ఆయన 12.3 కిలోమీటర్లు నడిచారు. తొలిరోజు నుంచీ లెక్కిస్తే శుక్రవారానికి మొత్తం 103 కిలోమీటర్లు పాదయాత్ర పూర్తి చేశారు.

Milon-Completed.jpg

పూలతో ఆహ్వానం

ఇదిలా ఉంటే.. బంగారుపాళ్యంలో ప్రధాన రహదారి నుంచి మసీదు ప్రాంగణంలోపలి వరకూ ముస్లిం సోదరులు బంతిపూలు పరిచి లోకేశ్‌ను ఆహ్వానం పలికారు. గతంలో ఈ మసీదులోనే ఇమామ్‌లకు గౌరవ వేతనం అందిస్తామని చంద్రబాబు (Chandrababu) హామీ ఇచ్చి సీఎం అయ్యాక అమలు చేశారని వారు లోకేశ్‌ వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ముస్లిం మైనారిటీల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని, అధికారంలోకి వస్తే అన్ని సంక్షేమపథకాలనూ తిరిగి ప్రారంభిస్తామని వారికి లోకేశ్‌ హామీ ఇచ్చారు.

శనివారం పాదయాత్ర ఇలా.. (9వ రోజు 4/02/2023)

పూతలపట్టు నియోజకవర్గంలో 9వ రోజు పాదయాత్ర

ఉదయం

8.00 గంటలకు వజ్రాలపల్లి విడిది కేంద్రంలో బీసి ప్రముఖుల ముఖాముఖి.. ఆ తర్వాత పాదయాత్ర ప్రారంభం

10.15 గంటలకు వంకమిట్టలో మామిడిరైతులతో సమావేశం

11.10 గంటలకు సదకుప్పంలలో ఎస్సీ మాల సామాజికవర్గీయులతో భేటీ

12.05 గంటలకు గొల్లపల్లిలో వడ్డెర సామాజికవర్గీయులతో ముఖాముఖి.

1.45 గంటలకు కొండ్రాజు కాల్వ వద్ద భోజన విరామం

సాయంత్రం

3.00 గంటలకు కొండ్రాజుకాల్వలో మహిళలతో సమావేశం

4.50 గంటలకు ఎగువ తడకర గ్రామస్తులతో మాటమాంతీ

7.15 గంటలకు తవనంపల్లి విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-02-03T22:43:43+05:30 IST