TollywoodBoxOffice: మూడు రోజుల్లో 108 కోట్లు, అదీ చిరంజీవి స్టామినా

ABN , First Publish Date - 2023-01-16T15:54:31+05:30 IST

చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' మూడు రోజుల్లో 108 కోట్లకు పైగా వసూల్ చేసి చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తన సత్తా ఏంటో చాటారు.

TollywoodBoxOffice: మూడు రోజుల్లో 108 కోట్లు, అదీ చిరంజీవి స్టామినా

సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల అయిన సినిమాల్లో చిరంజీవి (Mega Star Chiranjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (#WaltairVeerayya) విన్నర్ గా ప్రకటించారు. ఈ సినిమా మూడు రోజుల్లో 108 కోట్లకు పైగా వసూల్ చేసి చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర మరోసారి తన సత్తా ఏంటో చాటారు. (#WaltairVeerayya collected 108 crores gross in just three days) సినిమా విడుదల నుండే మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు దూసుకుపోయిన ఈ సినిమా సంక్రాంతి పండగను బాగా ఉపయోగించుకుంది అనటంలో సందేహమే లేదు. (That's the stamina of Chiranjeevi) జనవరి 13న విడుదల అయిన ఈ సినిమా సోమవారం అయిన ఈరోజు కూడా చాలా స్ట్రాంగ్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర వుంది. ఏ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందో, ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది లాంగ్ రన్ లో తెలుస్తుంది. చిరంజీవి నటించిన సినిమాల కలెక్షన్స్ లో ఇది బెస్ట్ అవుతుందో లేదో చూడాలి అంటే, ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడాలి అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు.

veera.jpg

ఇంకా బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన సినిమా 'వీరసింహా రెడ్డి' (Veerasimha Reddy) చిరంజీవి సినిమా కన్నా ఒకరోజు ముందుగా అంటే జనవరి 12న విడుదల అయి, మొదటి రోజు భారీగా అంటే ఎక్కువ థియేటర్స్ లో విడుదల అయింది. అందుకని మొదటి రోజే ఈ సినిమా కలెక్షన్స్ బాగున్నాయి, కానీ రెండో రోజు నుండీ పడిపోయాయి. (First day advantage for Balakrishna and it collected nearly 104 crores gross in four days) అందుకని ఈ సినిమా నాలుగు రోజులకు గాను 104 కోట్లు వసూల్ చేసింది. ఈ రెండు సినిమాలు కూడా ఒకరే నిర్మాత మైత్రీ మూవీ మేకర్స్ (#MythriMovieMakers) అవ్వడం ఆసక్తికరం.

ఇంకా విజయ్ (#ThalapathyVijay) నటించిన 'వారసుడు' (#Varasudu) కూడా విడుదల అయింది, కానీ ఇది డబ్బింగ్ సినిమా జాబితాలోకి వచ్చేసింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా తథా మాత్రంగానే వున్నాయి అని అంటున్నాడు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కలెక్షన్స్ గురించి ఎక్కడా బయటకి చెప్పలేదు. కానీ ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ సుమారు 5 కోట్ల గ్రాస్ (First day collected 5 crore gross) వసూల్ చేసిందని అంటున్నారు.

Updated Date - 2023-01-16T15:55:28+05:30 IST