Python: బాబోయ్.. చూస్తోంటేనే గుండెదడ వచ్చేస్తోందిగా.. 17 అడుగుల కొండ చిలువ.. ఐదుగురు వ్యక్తులను ముప్పతిప్పలు పెట్టి మరీ..!
ABN , First Publish Date - 2023-11-10T21:08:22+05:30 IST
సాధారణ పాములను చూస్తేనే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. ఇక, కొండచిలువను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఏకంగా 17 అడగుల పొడవున్న భారీ కొండచిలువను చూస్తే ఎలా ఉంటుంది.
సాధారణ పాములను (Snakes) చూస్తేనే చాలా మంది భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటువైపు వెళ్లడానికి కూడా భయపడుతుంటారు. ఇక, కొండచిలువను (Python) చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఏకంగా 17 అడగుల పొడవున్న భారీ కొండచిలువను చూస్తే ఎలా ఉంటుంది. చూడడం మాత్రమే కాదు.. ఆ ఐదుగురూ తమ ప్రాణాలను పణంగా పెట్టి ఆ భారీ కొండచిలువను (Huge Python) పట్టుకున్నారు. ఆ కొండచిలువ దాదాపు 90 కిలోల బరువు ఉందంటే అది ఎంత పెద్దదో ఊహించుకోవచ్చు.
అమెరికా (America)లోని ఫ్లోరిడా (Florida)లో ఉన్న బిగ్ సైప్రస్ నేషనల్ ప్రిజర్వ్‌లో దాదాపు 90 కిలోల బరువున్న 17 అడుగుల భారీ కొండచిలువను వేటగాళ్ల బృందం పట్టుకుంది. పాములను పట్టడంలో సిద్ధహస్తుడైన మైక్ ఎల్ఫెన్‌బీన్ తన 17 ఏళ్ల కుమారుడు కోల్‌తో కలిసి అడవిలో ఆ భారీ కొండచిలువను కనుగొన్నారు. తోటి వేటగాళ్లు అయిన ట్రే బార్బర్, కార్టర్ గావ్లాక్, హోల్డెన్ హంటర్‌కు సమాచారం అందించారు. అందరూ కలిసి ఆ భారీ కొండచిలువను పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ క్రమంలో వారికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి.
ముందుగా దాని తోకను కార్టర్ పట్టుకున్నప్పుడు ఆ కొండచిలువ ఉగ్రరూపం దాల్చింది. వారితో భీకరంగా పోరాడింది. ఐదుగురిని పైకి లేపి కింద పడేసింది. చివరకు గ్లావాక్, బార్బర్ దాని తలను పట్టుకున్నారు. దాదాపు రెండు గంటల పోరాటం తర్వాత ఆ భారీ కొండచిలువను వారు నియంత్రించగలిగారు. అడవిలోని జంతువులను ఆ భారీ కొండచిలువ బారి నుంచి రక్షించేందుకు మైక్ బృందం రంగంలోకి దిగింది. కాగా, ఆ కొండచిలువ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.