ఒక్క రూపాయి ప్యాకెట్‌తో రూ.2 కోట్ల బిజినెస్.. ఇదెలా సాధ్యం అని అవాక్కవుతున్నారా.. ఇతని కథేంటో తెలిస్తే..
ABN , First Publish Date - 2023-02-11T19:04:26+05:30 IST
జీవితాలను మార్చే పెద్ద పెద్ద ఆలోచనలు చిన్న చిన్న వాటి నుంచి పుడతాయని అంటుంటారు. లక్నోకు చెందిన ఈ వ్యక్తి కథ వింటే నిజమేనేమో అనిపిస్తుంది.
జీవితాలను మార్చే పెద్ద పెద్ద ఆలోచనలు చిన్న చిన్న వాటి నుంచే పుడతాయని అంటుంటారు. లక్నోకు చెందిన ఈ వ్యక్తి కథ వింటే నిజమేనేమో అనిపిస్తుంది. చిన్నప్పుడు తను రూపాయి పెట్టి కొనుకున్న గోధుమ పఫ్ (గోధుమలతో తయారు చేసే చెక్కీ లాంటిది) అతడి జీవితాన్నే మార్చేసింది. ఓ పెద్ద పరిశ్రమకు అధిపతిని చేసింది. ఉత్తరప్రదేశ్‌కు (Uttar Pradesh) చెందిన రాహుల్ కథ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. ప్రస్తుతం లక్నోలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సమ్మిట్‌కు (UP Investors Summit) రాహుల్ ఆహ్వానితుడిగా వెళ్లాడు (Inspirational Story).
బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత రాహుల్ ఉద్యోగ ప్రయత్నాల కోసం ఎంతో సమయం వెచ్చించాడు. ఎక్కడా ఉద్యోగం దొరక్కపోవడంతో స్వంతంగా వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. తను చిన్నప్పుడు ఎంతో ఇష్టంగా తినే స్థానిక స్నాక్ గోధుమ్ పఫ్ (ధమాల్ నమ్‌కీన్)ను పెద్ద ఎత్తున తయారు చేసి విక్రయించాలనుకున్నాడు. స్నేహితుల సహాయంతో సత్యం ఫుడ్ అనే సంస్థను రిజిస్టర్ చేయించాడు. ఇద్దరితో కలిసి లక్నోలో ఒక చిన్న ఫ్యాక్టరీని స్థాపించారు. మొదట్లో తమ గ్రామానికి సమీపంలో ఉన్న ఊళ్లలో ధమాల్ నమ్‌కీన్‌ను పరిచయం చేశాడు. మొదటి నెలలో రూ.10 వేలు లాభం రావడంతో రాహుల్‌కు నమ్మకం కుదరింది.
పాదయాత్రకు రెడీ అయిన పెళ్లి కాని ప్రసాదులు.. 30 ఏళ్లు దాటినా పెళ్లవడం లేదంటూ ఏకంగా 200 మంది..
14 ఏళ్లలో రాహుల్ వ్యాపారం యూపీలోని పలు జిల్లాలకు విస్తరించింది. ముగ్గురితో ప్రారంభమైన రాహుల్ సంస్థలో ప్రస్తుతం 35 మంది పని చేస్తున్నారు. కంపెనీ వార్షిక టర్నోవర్ రూ. 2 కోట్లకు చేరింది. రాబోయే 5 సంవత్సరాలలో, 'ధమాల్ నమ్‌కీన్'ని (Dhamal Namkeen) యూపీలో అన్ని గ్రామాలకు పరిచయం చేయాలని రాహుల్ టార్గెట్‌గా పెట్టుకున్నాడు. పార్లే, నెస్లే, బ్రిటానియా వంటి ఫుడ్ కంపెనీలతో కలిసి ఈ ప్రోడక్ట్‌ను దేశమంతా సప్లై చేయాలనేది రాహుల్ కల. అది నెరవేరాలని ఆశిద్దాం.