పాదయాత్రకు రెడీ అయిన పెళ్లి కాని ప్రసాదులు.. 30 ఏళ్లు దాటినా పెళ్లవడం లేదంటూ ఏకంగా 200 మంది..

ABN , First Publish Date - 2023-02-11T16:05:27+05:30 IST

పెళ్లెప్పుడవుతుంది బాబు.. మాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు.. అంటూ కర్ణాటకకు చెందిన 200 మంది పెళ్లి కాని ప్రసాదులు తలలు పట్టుకుంటున్నారు. తమకిక దేవుడే దిక్కని పాదయాత్ర ప్రారంభించబోతున్నారు.

పాదయాత్రకు రెడీ అయిన పెళ్లి కాని ప్రసాదులు.. 30 ఏళ్లు దాటినా పెళ్లవడం లేదంటూ ఏకంగా 200 మంది..

పెళ్లెప్పుడవుతుంది బాబు.. మాకు పిల్ల యాడ దొరుకుతుంది బాబు.. అంటూ కర్ణాటకకు చెందిన 200 మంది పెళ్లి కాని ప్రసాదులు తలలు పట్టుకుంటున్నారు. తమకిక దేవుడే దిక్కని పాదయాత్ర ప్రారంభించబోతున్నారు (200 unmarried youths do Padyatra). మాండ్య నుంచి చామరాజనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ MM హిల్స్ ఆలయం వరకు పాదయాత్ర సాగించనున్నారు. ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు 30 ఏళ్లకు పైబడిన పెళ్లి కాని యువకులే అర్హులని నిర్వాహకులు ఇప్పటికే ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన కొద్ది రోజులకే భారీ స్పందన రావడం గమనార్హం.

కర్ణాటకలోని (Karnataka) మాండ్య జిల్లాలో అబ్బాయిలు పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు దొరకడం కష్టంగా మారింది. ముఖ్యంగా వ్యవసాయ పనులు చేసే అబ్బాయిలు పెళ్లి (Marriage) కోసం ఎన్నో తంటాలు పడుతున్నారు. ఒకప్పుడు ఆడశిశువుల భ్రూణహత్యలకు పేరొందిన మాండ్య జిల్లా నేడు అందుకు మూల్యం చెల్లించుకుంటోందని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో 200 మంది యువకులు అప్పటి పాప పరిహారంగా పాదయాత్ర ప్రారంభించబోతున్నారు. 30 ఏళ్లు పైబడిన 200 మంది యువకులు బ్రహ్మచారిగళ్ అనే ఈ పాదయాత్రలో పాల్గొంటారు.

విడాకులు ఇవ్వకుండా రెండో పెళ్లి చేసుకుంది.. భార్యపై ఓ భర్త పెట్టిన కేసు ఇదీ.. అసలేం జరిగిందంటే..

బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాలకు చెందిన పెళ్లికాని యువకులు (Bachelors) చాలా మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఫిబ్రవరి 23న మాండ్య నుంచి మొదలయ్యే ఈ పాదయాత్ర 105 కిలోమీటర్లు సాగి ఫిబ్రవరి 25న చామరాజనగర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ MM హిల్స్ ఆలయం దగ్గర ఆగుతుంది. ఈ పాదయాత్రలో పాల్గొనే వారికి నిర్వాహకులు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. పెళ్లికాని వారిని మానసిక క్షోభ నుంచి బయటపడేయడమే ఈ యాత్ర ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ యాత్ర కోసం ఎవరి దగ్గర నుంచీ డబ్బులు వసూలు చేయడం లేదని నిర్వాహకులు తెలిపారు.

Updated Date - 2023-02-11T16:05:29+05:30 IST