Death Mystery: 24 ఏళ్ల ఈ కుర్రాడికి అసలేమైంది..? చివరిసారి వీడియో కాల్ చేసి.. ప్రేయసి చూస్తుండగానే ఘోరం..!
ABN , First Publish Date - 2023-09-27T20:09:40+05:30 IST
ఆ యువకుడి వయసు 24 ఏళ్లు.. లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా దగ్గర మీడియా అడ్వైజర్‌గా పని చేస్తున్నాడు.. ఇటీవల ఆ యువకుడు ఈ నెల 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే ముందు అతడు తన ప్రేయసికి వీడియో కాల్ చేశాడు.. అనంతరం ఆమె చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఆ యువకుడి వయసు 24 ఏళ్లు.. లక్నోలోని బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా దగ్గర మీడియా అడ్వైజర్‌గా పని చేస్తున్నాడు.. ఇటీవల ఆ యువకుడు ఈ నెల 24వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు.. ఆత్మహత్య చేసుకునే ముందు అతడు తన ప్రేయసికి వీడియో కాల్ (Video Call) చేశాడు.. అనంతరం ఆమె చూస్తుండగానే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.. ఈ ఘటన యూపీ (Uttar Pradesh) వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ కుర్రాడు అసలు ఎందుకు చనిపోయాడో ఇప్పటికీ పోలీసులకు అంతుబట్టడం లేదు (Crime News).
లక్నో (Lucknow)లో నివసిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే యోగేష్ శుక్లా సోషల్ మీడియా హ్యాండ్లర్ అయిన శ్రేష్ట తివారీ అనే యువకుడు ఎందుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడో పోలీసులకు ఇంకా అర్థం కాలేదు. చనిపోయే ముందు శ్రేష్ట తన ప్రియురాలికి వీడియో కాల్ చేశాడు. కొద్ది సేపు మాట్లాడిన తర్వాత ఆమె చూస్తుండగానే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కంగారు పడిన యువతి ఫ్లాట్‌కు వెళ్లేసరికి శ్రేష్ట విగత జీవిగా పడి ఉన్నాడు. అసలేం జరిగిందో శ్రేష్ట ప్రియురాలు చెప్పడం లేదు. వారిద్దరి మధ్య వివాదం ఏమిటనేది తెలుసుకునేందుకు పోలీసులు వారిద్దరి కాల్ డిటైల్స్‌ను బయటకు తీస్తున్నారు.
Wife: ఓ పక్క తండ్రి.. మరోపక్క తల్లి.. మధ్యలో ఉన్నది కన్న కూతురే.. ఏం చేసి మరీ ఇలా పోలీసులకు దొరికిపోయారో తెలిస్తే..!
శ్రేష్ట సోదరుడు సౌరభ్ ఈ కేసులో కీలక వ్యక్తిగా మారాడు. అతడు తన సోదరుడి గాళ్‌ఫ్రెండ్ పైనే అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ప్రియురాలితో గొడవ పడి ఒత్తిడికి లోనై శ్రేష్ట చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. వీడియో కాల్ సమయంలో శ్రేష్ఠ ఆత్మహత్యకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా ఆ యువతి తీసిందని పోలీసులు తెలిపారు. ఇద్దరూ గత 4 సంవత్సరాలుగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఈ ఆగస్టు 27న వారి బంధానికి 4 సంవత్సరాలు పూర్తయ్యాయి. అలీగంజ్‌లోని ఓ రెస్టారెంట్‌లో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగిందో కనిపెట్టే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.