Viral: 26 ఏళ్ల యువతి.. ఏడాదికి రూ.66 లక్షలు సంపాదిస్తోంది.. అసలు ఏం చేస్తే ఆమెకు ఇంత డబ్బు వస్తోందంటే..!
ABN , First Publish Date - 2023-12-05T21:04:04+05:30 IST
ఆ యువతి వయసు 26 ఏళ్లు.. సరదాగా ప్రారంభించిన ఓ హాబీ ఆమెకు జీవనాధారంగా మారింది.. ఏడాదికి ఏకంగా రూ.66 లక్షలకు పైగా సంపాదిస్తోంది.. ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. అమెరికాలోని మిసిసిప్పీకి చెందిన జెన్నా టాటు అనే యువతికి రెండేళ్ల క్రితం ఆమె తల్లి ఓ బర్త్ డే గిఫ్ట్‌ను అందించింది.
ఆ యువతి వయసు 26 ఏళ్లు.. సరదాగా ప్రారంభించిన ఓ హాబీ ఆమెకు జీవనాధారంగా మారింది.. ఏడాదికి ఏకంగా రూ.66 లక్షలకు పైగా సంపాదిస్తోంది.. ఆమె కథ సోషల్ మీడియాలో వైరల్‌గా (Success Story) మారింది.. అమెరికా (America)లోని మిసిసిప్పీకి చెందిన జెన్నా టాటు అనే యువతికి రెండేళ్ల క్రితం ఆమె తల్లి ఓ బర్త్ డే గిఫ్ట్‌ను అందించింది. స్వయంగా చేతితో తయారు చేసిన ఓ బొమ్మను (Toy) అందించింది. ఆ బొమ్మ జెన్నాకు విపరీతంగా నచ్చింది. ఆమె స్నేహితులకు కూడా బాగా నచ్చింది. దీంతో జెన్నాకు ఓ ఆలోచన వచ్చింది. ఆ బొమ్మలను తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకుంది (Viral).
2022లో Etsyలో "క్రోచెట్ బై జెన్నా" అనే తన వెంచర్‌ను స్థాపించి చేతులతో తయారు చేసిన క్రోచెట్ బొమ్మలను అమ్మడం ప్రారంభించింది. వారానికి 20 గంటల పాటు జెన్నా, ఆమె తల్లి, మరికొందరు కలిసి ఈ బొమ్మలను తయారు చేస్తుంటారు. బొమ్మలను బట్టి వాటి ధరలను $10 నుంచి $200 (రూ.800 నుంచి రూ.16 వేల వరకు) వరకు నిర్ణయిస్తారు. ఆ బొమ్మలకు విపరీతమైన ఆదరణ లభించడంతో ఒక ఏడాదిలోనే 80 వేల డాలర్ల (రూ.66 లక్షలు) బిజినెస్ జరిగింది.
Viral: బాబోయ్.. ఇదెక్కడి ఆచారం.. అక్కడ కూతుళ్లను తండ్రులు పెళ్లి చేసుకుంటారట.. అసలు రహస్యం ఏంటంటే..!
ముందుగానే బొమ్మలను తయారు చేయడం కాకుండా, వినియోగదారుల అభిరుచి మేరకు వారి సలహాలు తీసుకుని బొమ్మలను రూపొందించడం జెన్నాకు బాగా కలిసి వచ్చింది. ఆ లక్షణమే మిగిలిన వారి నుంచి జెన్నాను వేరుగా ఉంచింది. జెన్నా తన వ్యాపారాన్ని మరింత విస్తరించే ప్రణాళికలతో బిజీగా ఉంది.