Viral video: రెండేళ్ల బాబు తన తల్లిని ఎలా మోటివేట్ చేస్తున్నాడో చూడండి.. నెటిజన్లను ఆకట్టుకుంటున్న క్యూట్ వీడియో!
ABN , First Publish Date - 2023-05-08T12:58:17+05:30 IST
వీకెండ్‌లో బాగా ఎంజాయ్ చేశాక సోమవారం తిరిగి డ్యూటీకి వెళ్లాలంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. చదువుకునే పిల్లలు కూడా అలాగే ఇబ్బంది పడతారు. అయితే అలాంటి వాళ్ల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
వీకెండ్‌లో బాగా ఎంజాయ్ చేశాక సోమవారం తిరిగి డ్యూటీకి వెళ్లాలంటే ఎవరికైనా చాలా కష్టంగా ఉంటుంది. చదువుకునే పిల్లలు కూడా అలాగే ఇబ్బంది పడతారు. అయితే అలాంటి వాళ్ల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ (Viral Video) అవుతోంది. ఆ వీడియోలో.. సోమవారం ఆఫీస్‌కు వెళ్లడానికి ఇబ్బందిపడుతున్న తల్లిని ఓ రెండేళ్ల బాలుడు మోటివేట్ చేస్తున్నాడు (2-year-old boy motivating his mother). ఆ వీడియో చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Yuvansh Bhardwaj అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియోలో ఒక మహిళ తన కొడుకును పట్టుకుని ``నేను ఆఫీస్‌కు వెళ్లను`` అంటూ సరదాగా ఏడవడం మొదలుపెట్టింది. వెంటనే ఆ బాలుడు తన తల్లి తలపై చేయి వేసి ``షటప్.. నువ్వు ఆఫీస్‌కు వెళ్లాలి`` అని చెబుతున్నాడు. ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను ఇప్పటివరకు 70 లక్షల మంది వీక్షించారు. 3.50 లక్షల మంది లైక్ చేశారు.
Viral Video: బాబూ.. అది గుర్రం అనుకున్నావా? నడిరోడ్డుపై ఎద్దు స్వారీ.. ఆశ్చర్యపోతున్న నెటిజన్లు!
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ``నాకూ అలాంటి మోటివేషన్ కావాలి``, ``క్యూట్ వీడియో``, ``స్కూల్‌లో జాయిన్ అయితే ఆ కుర్రాడికి కూడా తెలుస్తుంది``, ``అమ్మ ఇంటి దగ్గరే ఉంటే నేను ఎలా ఆడుకోవాలి`` అంటూ ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.