ఇవి ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన విమానాశ్ర‌యాలు... ఎక్క‌డున్నాయో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-01-17T08:34:33+05:30 IST

నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 68 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు నవజాత శిశువులు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మందిలో నలుగురు ప్రయాణికులు యూపీకి చెందినవారు.

ఇవి ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన విమానాశ్ర‌యాలు... ఎక్క‌డున్నాయో తెలిస్తే...

నేపాల్‌లో జరిగిన విమాన ప్రమాదంలో 68 మంది మరణించారు. మృతుల్లో ముగ్గురు నవజాత శిశువులు, ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మందిలో నలుగురు ప్రయాణికులు యూపీకి చెందినవారు. ఈ ఘటన పొఖారాలో చోటుచేసుకుంది. ఈ విమానాశ్రయాన్ని చైనా నిర్మించింది. నేపాల్‌లో అనేక విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని విమానాశ్రయాలు ప్రమాదకరమైన విమానాశ్రయాల జాబితాలో చేరి ఉన్నాయి. ల్యాండింగ్ సమయంలో ప్రయాణికుల శ్వాస ఆగిపోయేంతటి ప్రమాదకరమని ఈ విమానాశ్రయాల గురించి చెబుతుంటారు. ప్రమాదకరమైన విమానాశ్రయాలలో చేరిన‌ నేపాల్ అటువంటి 3 విమానాశ్రయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విమానాశ్రయాల పేర్లు సిమికోట్, తాల్చా లుక్లా.

సిమికోట్ విమానాశ్రయం

సిమికోట్ విమానాశ్రయం నేపాల్‌లోని ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒకటి. ఈ విమానాశ్రయం నేషనల్ రోడ్ నెట్‌వర్క్‌కి అనుసంధానించి లేదు.. 4,300 మీటర్ల ఎత్తులో నిర్మిత‌మైన ఈ విమానాశ్రయాన్ని హుమ్లా విమానాశ్రయం అని కూడా అంటారు.

తాల్చా విమానాశ్రయం

నేపాల్‌లోని తాల్చా విమానాశ్రయం 2,735 మీటర్ల ఎత్తులో ఉంది. ఇది నేపాల్‌లోని ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒక‌టి. ఈ విమానాశ్రయంలో ఎక్కువ సమయం మంచు కురుస్తుంది. విమానాలు జారిపోతాయనే భయం నెల‌కొంటుంది. ఈ విమానాశ్రయంలో ప్రమాదాల భయం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణంగా ఇది ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒకటిగా గుర్దింపుపొందింది. ఈ విమానాశ్రయం మృగు జిల్లాలోని రారా నేషనల్ పార్క్‌లో ఉంది.

లుక్లా విమానాశ్రయం

నేపాల్‌లోని ప్రమాదకరమైన విమానాశ్రయాలలో లుక్లా విమానాశ్రయం కూడా ఒకటి. ఈ విమానాశ్రయపు రన్‌వే దగ్గర దాదాపు 600 మీటర్ల లోతైన గుంత‌ ఉంది. ఈ విమానాశ్రయం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ విమానాశ్రయం ఎవరెస్ట్ పర్వతానికి సమీపంలో ఉంది.

Updated Date - 2023-01-17T08:34:34+05:30 IST