Pretha Kalyanam: ప్రేతాత్మలకు పెళ్లి.. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా వింత ఆచారం.. 30 ఏళ్ల క్రితం చనిపోయినోళ్లు కూడా..!
ABN , First Publish Date - 2023-08-14T19:01:51+05:30 IST
ప్రపంచవ్యాప్తంగా రకరకాల సాంప్రదాయలు, విభిన్నమైన సంస్కృతులు ఉంటాయి. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకమైన ఆచాలను పాటిస్తుంటారు. వాటిల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఓ సాంప్రదాయం కర్ణాటకలోని తుళునాడులో అమల్లో ఉంది. ఆ ప్రాంతంలో చాలా మంది ప్రేతాత్మలకు పెళ్లిళ్లు చేయిస్తుంటారు.
ప్రపంచవ్యాప్తంగా రకరకాల సాంప్రదాయలు, విభిన్నమైన సంస్కృతులు ఉంటాయి. ఒక్కో ప్రాంతం వారు ఒక్కో రకమైన ఆచాలను పాటిస్తుంటారు. వాటిల్లో కొన్ని విచిత్రంగా ఉంటాయి. అలాంటి ఓ సాంప్రదాయం కర్ణాటక (Karnataka)లోని తుళునాడులో అమల్లో ఉంది. ఆ ప్రాంతంలో చాలా మంది ప్రేతాత్మలకు పెళ్లిళ్లు చేయిస్తుంటారు. ప్రత్యేకంగా తుళు మాసంలోనే ఇలాంటి పెళ్లిళ్లు జరుగుతాయి. ఈ తుళు మాసంలో ప్రేతాత్మల పెళ్లిళ్లు (Pretha Kalyanam) తప్ప మరే ఇతర శుభకార్యాలూ చేసుకోరు.
కుటుంబంలో ఎవరైనా పెళ్లి కాకుండా మరణిస్తే వారికి పెళ్లి (Marriage of the dead) చేసే సాంప్రదాయం కర్ణాటక, కేరళ (Kerala)లోని కొన్ని ప్రాంతాల వారు పాటిస్తారు. అంటే పెళ్లి కాకుండా మరణించిన ఓ పురుషుడికి పెళ్లి కాకుండా మరణించిన యువతితో వివాహం జరిపిస్తారు. చనిపోయిన వారిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి పెళ్లి తంతు పూర్తి చేస్తారు. తాజాగా వగ్గ గ్రామానికి చెందిన విశాలాక్షి అనే యువతి రెండేళ్ల క్రితం మరణించింది. అలాగే చోళ్మ అనే గ్రామానికి చెందిన ధరణేశ్ అనే యువకుడు కూడా రెండేళ్ల క్రితం మరణించాడు.
Hostel Boys: ``గే`` అంటూ హాస్టల్‌లో సీనియర్స్ కామెంట్స్.. కాదని ఎంత చెప్పినా వినకపోవడంతో ఈ కుర్రాడు ఏం చేశాడంటే..!
వీరిద్దరూ అవివాహితులు కావడంతో ఇరు కుటుంబాల వారూ వారికి ప్రేత కల్యాణం జరిపించారు. ఈ పెళ్లిలో పూర్తిగా నాన్-వెజ్ వంటకాలనే వడ్డిస్తారు. చికెన్, మటన్, చేపలతో చేసిన వంటలను పెళ్లి విందులో వడ్డిస్తారు. ఈ రకమైన పెళ్లిళ్లు చేయడం వల్ల చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయని వారు నమ్ముతారు.