సొంతంగా గ్రామాభివృద్ది పనులు చేస్తున్న ఇతడికోసం 6రాష్ట్రాల పోలీసుల వేట మామూలుగా లేదు.. కారణమేంటంటే..

ABN , First Publish Date - 2023-02-27T10:22:52+05:30 IST

రహదారులు వేయించాడు, వీధి దీపాలు ఏర్పాటు చేయించాడు, గ్రామంలోని పేదల కోసం హాస్పిటల్ కట్టించి వైద్యాన్ని అందరికీ చేరువచేశాడు. కానీ ఇతని కోసం

సొంతంగా గ్రామాభివృద్ది పనులు చేస్తున్న ఇతడికోసం 6రాష్ట్రాల పోలీసుల వేట మామూలుగా లేదు.. కారణమేంటంటే..

తను సంపాదించే దాంట్లో కొంత ఇతరులకు సహాయం చెయ్యాలని ప్రతి మత గ్రంథం బోధిస్తుంది. కానీ దాన్ని పాటించేవారు కొందరే ఉంటారు. అలాంటి వాళ్ళలో ఇతను ముందు వరుసలో ఉంటాడు. అతను తన సొంత డబ్బుతో తన గ్రామంలో రహదారులు వేయించాడు, వీధి దీపాలు ఏర్పాటు చేయించాడు, గ్రామంలోని పేదల కోసం హాస్పిటల్ కట్టించి వైద్యాన్ని అందరికీ చేరువచేశాడు. కానీ ఇతని కోసం 6రాష్ట్రాల పోలీసులు వేట సాగిస్తున్నారు. పోలీసులకు తలనొప్పిగా మారిన ఇతని గురించి తెలుసుకుంటే..

బీహార్(Bihar) రాష్ట్రం సీతామర్హి(sitamarhi) జిల్లాలో పుప్రి పోలిస్ స్టేషన్ పరిధిలో జోగియా అనే గ్రామం ఉంది. ఇర్ఫాన్ అనే వ్యక్తి ఇదే గ్రామంలలో నివసిస్తున్నాడు. ఈ గ్రామంలో ఇర్ఫాన్ కు సుమారు 2కోట్లు విలువచేసే రాజమహల్ లాంటి ఇల్లు ఉంది. ఇతను గ్రామంలో రహదారులు వేయించి, వీధి దీపాలు ఏర్పాటు చేశాడు. హాస్పిటల్ కట్టించి పేదలకు వైద్యాన్ని చేరువ చేశాడు. అయితే ఇర్ఫాన్ ఏదో బిజినెజ్ చేసో వీరికి బోలెడు ఆస్తులుండటం వల్లో ఇలా గ్రామసేవ చేస్తున్నాడని అనుకుంటే పొరపాటే.. ఇతను చేసేది అక్షరాలా దొంగతనం, దోపిడీలు. ఇలాంటివి చేసే ఇతను డబ్బు సంపాదించిస్తున్నాడు. ఆ డబ్బుతోనే గ్రామంలో పనులు చేయిస్తున్నాడట.

Read also:Smartphone Charging: ఈ నిజం తెలియకపోతే స్మార్ట్‌ఫోన్‌ను వాడటం వృథా.. అసలు చార్జింగ్ ఎంత ఉండాలో.. ఎంతలోపు ఉండకూడదో తెలుసా..?


ఈ జోగియా గ్రామ ప్రజలకు ఇర్ఫాన్ ఏమి చేస్తాడనే విషయం అసలు తెలియదు. వీరికే కాదు కనీసం ఇర్ఫాన్ తల్లికి కూడా ఇర్ఫాన్ ఏమి చేస్తుంటాడనే విషయం తెలియకపోవడం గమనార్హం. ఇతని భార్య జోగియా పంచాయతీ ఎన్నికల్లో జిల్లాపరిషత్ సభ్యురాలిగా ఎంపికైంది. ఇర్ఫాన్ కేవలం తన గ్రామంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా అభివృద్ది పనులు చేపడుతుంటాడని గ్రామస్తులు తెలిపారు. ఇతను కులమనే ప్రాతిపదికన ఎప్పుడూ ఇతరులను చూడడని ఆ గ్రామ ప్రజలు చెప్పుకొచ్చారు. హిందువులకు అయినా ముస్లింకు అయినా ఇబ్బందులలో ఉంటే ఇర్ఫాన్ సహాయం చేస్తుంటాడని చెప్పారు. పేదవారికి పెళ్ళిళ్ళ కోసం, వైద్యసహాయం కోసం ఇతను లేదనకుండా సహాయం చేస్తాడట. ఇవి మాత్రమే కాకుండా గ్రామంలో జరగాల్సిన సామాజిక కార్యక్రమాలకు అయ్యే ఖర్చు మొత్తం ఇతనే భరిస్తాడు. ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్, బీహార్, గోవా మొదలైన రాష్ట్రాలలో ఇర్ఫాన్ మీద సుమారు 69కి పైగా ఏఫ్ఐఆర్(Fir) లు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఇలా డబ్బున్న వారిని దోచుకుని పేదలకోసం ఖర్చుచేస్తున్న ఇతన్ని రాబిన్ హుడ్(Rabin Hood) అంటున్నారు.

Updated Date - 2023-02-27T10:23:31+05:30 IST