Share News

Viral Video: ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? ఈ తాతగారు చెప్పింది వినండి.. 94 ఏళ్ల వృద్ధుడి సలహాపై డాక్టర్లు కూడా ప్రశంసలు!

ABN , First Publish Date - 2023-11-11T16:45:43+05:30 IST

గతంలో జీవించిన వ్యక్తులు చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవారు. పోషకాహారం తినడమే కాకుండా, శారీరకంగా ఎక్కువ శ్రమ కూడా పడేవారు. అందుకే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కాలంతో పాటు ఆహారంలోనూ, జీవన శైలిలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

Viral Video: ఎక్కువ కాలం బతకాలనుకుంటున్నారా? ఈ తాతగారు చెప్పింది వినండి.. 94 ఏళ్ల వృద్ధుడి సలహాపై డాక్టర్లు కూడా ప్రశంసలు!

గతంలో జీవించిన వ్యక్తులు చాలా క్రమశిక్షణ కలిగి ఉండేవారు. పోషకాహారం (Healthy Food) తినడమే కాకుండా, శారీరకంగా ఎక్కువ శ్రమ (Exercise) కూడా పడేవారు. అందుకే వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కాలంతో పాటు ఆహారంలోనూ, జీవన శైలిలోనూ (Life Style) ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫాస్ట్‌ఫుడ్ (Fast Food), నిల్వ ఉంచిన ఆహారంపై మక్కువ పెరగడం, శారీరక శ్రమం లోపించడం మొదలైన కారణాలతో చిన్న వయసులోనే చాలా మంది మధుమేహం (Diabetes), రక్తపోటు వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చిన్న వయసులోనే గుండె పోటు వల్ల ఎంతో మంది చనిపోతున్నారు.

ఆరోగ్యకరంగా జీవించాలంటే ఏం చేయాలి? 94 ఏళ్ల వయసులో కూడా చురుగ్గా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలి? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో (Viral Video)లో ఓ వృద్ధుడు (Old Man) తన ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పాడు (Secret for Long Life). @DrParulSharma అనే ట్విటర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలోని వ్యక్తి తన ఆరోగ్య రహస్యాన్ని వెల్లడించాడు. ``యుక్త వయసులో ఉన్నప్పటి నుంచి ఇప్పటివరకు నేను వ్యాయామం చేస్తున్నాను. నేను ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు నిద్ర లేస్తాను. రెండు గంటల పాటు యోగా చేస్తాను. చాలా త్వరగా అరిగిపోయే ఆహారం తింటాను. నాన్-వెజ్ తింటాను కానీ, చాలా తక్కువ. ఏ విషయం గురించీ ఎక్కువ ఆలోచించను`` అని చెప్పాడు (Food and Health).

Crime: కూలి పనికి వెళ్లి అదృశ్యమైన కూతురి కోసం తల్లి పోరాటం.. పోలీసులు పట్టించుకోకపోవడంతో ఏకంగా హోం మినిస్టర్‌కు ఫిర్యాదు చేస్తే..

ఈ వీడియోపై చాలా మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. డాక్టర్లు కూడా ఆ వృద్ధుడు చెప్పిన దాంతో ఏకీభవిస్తున్నారు. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 3.6 లక్షల మందికి పైగా వీక్షించారు. ``మా అమ్మానాన్నా వర్షం వచ్చినపుడు కూడా వాకింగ్ మానేవారు కాదు. ఇద్దరూ 85 ఏళ్లు బతికారు``, ``ఆహారం, వ్యాయామం విషయంలో చాలా క్రమశిక్షణ అవసరం``, ``మా అమ్మమ్మ పొగాకు కాలుస్తుంది. అయినా జీన్స్ కారణంగా ఆమె 90 ఏళ్లు వచ్చినా ఇంకా ఆరోగ్యంగా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Updated Date - 2023-11-11T16:45:45+05:30 IST