55 ఏళ్ల మహిళతో 25 ఏళ్ల కుర్రాడి ప్రేమాయణం.. పెళ్లికోసం చేసుకున్న దరఖాస్తును చూసి అవాక్కైన అధికారులు..!
ABN , First Publish Date - 2023-02-22T21:00:08+05:30 IST
ఆ కుర్రాడి వయసు 25 ఏళ్లు.. ఆ మహిళ వయసు 55 ఏళ్లు.. తన కంటే వయసులో 30 ఏళ్లు పెద్దదైన ఆమెతో ఆ కుర్రాడు ప్రేమలో పడ్డాడు.. నాలుగేళ్లు ఆమె కోసం ఎదురు చూశాడు.. మెక్సికోకు చెందిన ఆ మహిళ కూడా ఆ కుర్రాడి కోసం ఎంతో పరితపించింది..
ఆ కుర్రాడి వయసు 25 ఏళ్లు.. ఆ మహిళ వయసు 55 ఏళ్లు.. తన కంటే వయసులో 30 ఏళ్లు పెద్దదైన ఆమెతో ఆ కుర్రాడు ప్రేమలో పడ్డాడు.. నాలుగేళ్లు ఆమె కోసం ఎదురు చూశాడు.. మెక్సికోకు (Mexico) చెందిన ఆ మహిళ కూడా ఆ కుర్రాడి కోసం ఎంతో పరితపించింది.. ప్రతి ఏడాది ఆ కుర్రాడి కోసం భారత్ వచ్చేది.. ఇద్దరూ ఒకరికొకరు బాగా నచ్చడంతో పెద్దల అంగీకారంతో పెళ్లికి సిద్ధపడ్డారు.. మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) ఛతర్పూర్కు చెందిన ఈ ప్రేమకథ (Viral Love Story) వైరల్‌గా మారింది.
ఛతర్పూర్కు చెందిన షేక్ అమన్ అనే యువకుడు ఖజురహోలోని (Khajuraho) హస్తకళల దుకాణంలో పని చేసేవాడు. నాలుగేళ్ల క్రితం 2019లో ఆ షాప్‌లోకి మార్తా జూలియా అనే మెక్సికన్ అమ్మాయి వచ్చింది. హస్తకళకు సంబంధించిన సమాచారం కోసం అమన్‌తో మార్తా మాట్లాడింది. అతను చెప్పిన విధానం మార్తాకు చాలా నచ్చింది. సాయంత్రం అమన్ ఇంటికి వెళుతుండగా బజారులో మళ్ళీ కలిశారు. ఇద్దరం కలిసి టీ తాగారు. అప్పుడు మార్తా తాను భారతదేశంలోని గ్రామాలను చూడాలనుకుంటున్నట్టు చెప్పింది. దీంతో అమన్ మూడు రోజులు దుకాణానికి సెలవు పెట్టి చుట్టుపక్కల గ్రామాల్లో తిప్పాడు. ఆ పర్యటన మార్తాకు చాలా నచ్చింది. నెల రోజుల పాటు అమన్‌తో కలిసి తిరిగింది. అనంతరం మెక్సికో వెళ్లిపోయింది. అయినా మొబైల్ ద్వారా ఇద్దరూ మాట్లాడుకునేవారు (25-year-old man fell in love with a 55-year-old woman).
భర్త గే అని ఆ భార్యకు డౌట్.. నిజమా..? కాదా..? అని నిర్ధారించుకునేందుకు నిఘా.. చివరకు ఆమె ఎంతవరకు వెళ్లిందంటే..
2020లో కరోనా రావడంతో ఆమె భారత్‌కు రాలేదు. 2021లో మాత్రం కేవలం అమన్‌ను కలిసేందుకు ఆమె ఇండియాకు వచ్చింది. ఇద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. దాంతో వారి స్నేహం మరింత గాఢంగా మారింది. ఆ తర్వాత మార్తా మెక్సికో వెళ్లిపోయి మళ్లీ 2022లో వచ్చింది. ఆ ఏడాది పూర్తిగా అమన్ ఇంట్లోనే ఉండి అన్నీ చూసింది. ఈ ఏడాది ఆమె తిరిగి ఖజరహో వచ్చినపుడు అమన్ తన మనసులో మాటను బయటపెట్టాడు. ఆమె కోసం స్పానిష్ కూడా నేర్చుకున్నాడు. అమన్ ప్రేమకు మార్తా కరిగిపోయింది. పెళ్లికి అంగీకరించింది. అమన్ ప్రేమ వివాహానికి అతడి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు.
Money Earning Tips: వాడి పడేసిన సిగరెట్ పీకలతో కూడా డబ్బులు సంపాదించొచ్చని మీకు తెలుసా..? ఈ కుర్రాడు చేస్తున్న పనేంటో తెలిస్తే..
వారిద్దరూ తమ పెళ్లి కోసం కోర్టుకు దరఖాస్తు సమర్పించారు. మహిళ విదేశీయురాలైనందున, కుటుంబంతో పాటు, ప్రభుత్వ సమ్మతి కూడా అవసరం. షేక్ అమన్, మార్తా తమ వివాహ పత్రాలను కోర్టుకు అందించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వివాహానికి కోర్టు అనుమతి ఇవ్వనుంది. అప్పుడు వారి వివాహం భారతీయ చట్టాల ప్రకారం రిజిస్టర్ అవుతుంది.