Viral: ఆకలితో ఉన్న మొసళ్లతో వ్యక్తి చెలగాటం.. తాడు పట్టుకుని పైనుంచి వేళాడుతుండగా..
ABN , First Publish Date - 2023-10-21T21:16:04+05:30 IST
మొసళ్లు ఉన్న నీటిపై తాడు పట్టుకుని ఉయ్యాల చివరకు ఏం జరిగిందంటే..
ఇంటర్నెట్ డెస్క్: ఎందుకో గానీ కొందరు ప్రమాదానికి ఎదురెళ్లేందుకు ఇష్టపడతారు. సవాళ్లతోనే సావాసం చేస్తామంటారు. లైఫ్‌లో ఎంతోకొంత థ్రిల్ ఉంటేనే మజా అని ఇతరులతో ఢంకాబజాయించి చెబుతారు. ఈ ఫిలాసఫీ వినడానికి, చెప్పుకోడానికీ బానే ఉంటుంది కానీ వాస్తవంలో అనుసరిస్తే మాత్రం ఫలితాల్లో భారీ తేడాలు వచ్చేస్తాయి. అదృష్టం కలిసి రాకపోతే మాత్రం ప్రాణాలపై ఆశలు వదులుకోవాల్సిందే. చావు తప్పినా కూడా లొట్టపోయిన కన్నుతో జీవితాంతం ఇబ్బంది పడాలి. ప్రస్తుతం అలాంటి వ్యక్తి గురించే మనం చెప్పుకోబోతున్నాం. థ్రిల్ కోసం అతడు చేసిన పనికి ప్రాణాలు కోల్పోయాడా లేక కన్ను మాత్రమే లొట్టపోయిందా అనేది మాత్రం మిస్టరీగా మారింది.
H-1b visa: హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌లో భారీ మార్పులు ప్రతిపాదించిన అమెరికా!
Agra: బాబోయ్..ఇలాక్కూడా జరుగుతుందా? గుండెకు దగ్గరగా ఫోన్ ఉండటంతో తప్పిన ప్రాణాపాయం!
వీడియోలోని వ్యక్తి ఓ పెద్ద తొట్టె వద్దకు వెళ్లాడు. అందులో బోలెడన్నీ మొసళ్లు ఉన్నాయి. అవన్నీ ఆకలితో ఉన్నట్టే కనిపించాయి. తొట్టె వద్దకు ఎవరైనా వస్తే చాలు అవి అశగా నోళ్లు తెరుచుకుని బయటకు వచ్చాయి. పొరపాటున ఏ జీవి అయినా ఆ తొట్టెలో కాలు పెడితే నేరుగా పైలోకానికి వెళ్లకతప్పదనేలా ఉంది అక్కడ పరిస్థితి. అలాంటి వాటి జోలికి వెళ్లేందుకు మనిషే కాదు ఏ జంతువు సాహసించదు. కానీ వీడియోలోని వ్యక్తి మాత్రం ఎవరూ ఊహించిన పని చేశాడు.
Viral video: నల్లా నుంచి నీరు లోప్రెజర్‌తో వస్తోందని ఇతడేం చేశాడో తెలిస్తే..
ఏకంగా తొట్టెపైనే తనదైన స్టంట్ చేసేందుకు పూనుకున్నాడు. తొట్టె పైన వేళాడుతున్న ఓ తాడు పట్టుకుని అక్కడే అటూ ఇటూ ఉయ్యాల ఊగేందుకు రంగంలోకి దిగాడు. మనిషి కాస్త బరువు కూడా ఉండటంతో ఒక్కసారి ఊగేసరికే పట్టుజారి మొసళ్లు ఉన్న తొట్టెలో పడ్డాడు. చూస్తేనే గుండె ఆగిపోయేలా ఉందీ సీన్. ఆ తరువాత ఏం జరుగుతుందా మనం ఆతృతగా ఎదురు చూస్తుండగానే వీడియో ముగిసిపోతుంది. దీంతో, నెక్స్ట్ ఏం జరిగిందనేదానిపై స్పష్టత లేదు. కానీ జనాలు మాత్రం తమకు తోచినది ఊహించుకుంటూ భయపడిపోతున్నారు. మొసళ్ల బారిన పడి అతడు అత్యంత భయానకంగా చనిపోయి ఉండొచ్చని అనేక మంది చెప్పారు. అయితే, చుట్టు ఉన్న వారు, వీడియో తీస్తున్న వారు అతడిని కాపాడి ఉండొచ్చని కూడా కొందరు చెబుతున్నారు.
Canada Visa: ముదిరిన దౌత్య వివాదం.. భారతీయ విద్యార్థులకు భారీ షాకిచ్చిన కెనడా!