Viral: తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక.. నడి సముద్రంలో 60 రోజుల పాటు నరకం.. ఎలా బయటపడ్డారంటే..

ABN , First Publish Date - 2023-07-17T16:27:04+05:30 IST

ఆస్ట్రేలియాకు చెందిన ఓ నావికుడు 2 నెలల పాటు పసిఫిక్ మహాసముద్రంలో చిక్కుకుపోయి సజీవంగా తిరిగి వచ్చాడు. 51 ఏళ్ల టిమ్ షాడాక్ తన కుక్క బెల్లాతో కలిసి మెక్సికో నుంచి ఫ్రెంచ్ పాలినేషియాకు బోటులో విహారయాత్రకు వెళ్లాడు. సముద్రం మధ్యలో అతని పడవ తుఫానులో చిక్కుకుంది.

Viral: తినడానికి తిండి లేక.. తాగడానికి నీళ్లు లేక.. నడి సముద్రంలో 60 రోజుల పాటు నరకం.. ఎలా బయటపడ్డారంటే..

ఆస్ట్రేలియా (Australia)కు చెందిన ఓ నావికుడు (Sailor) 2 నెలల పాటు పసిఫిక్ మహాసముద్రం (Pacific Ocean)లో చిక్కుకుపోయి సజీవంగా తిరిగి వచ్చాడు. 51 ఏళ్ల టిమ్ షాడాక్ (Tim Shaddock) తన కుక్క బెల్లాతో కలిసి మెక్సికో (Mexico) నుంచి ఫ్రెంచ్ పాలినేషియాకు బోటులో విహారయాత్రకు వెళ్లాడు. సముద్రం మధ్యలో అతని పడవ తుఫాను (Cyclone)లో చిక్కుకుంది. సముద్రంలో ఒంటరిగా ఆహారం, నీళ్లు లేకుండా రెండు నెలల పాటు బతకడం సామాన్య విషయం కాదని, షాడాక్ సజీవంగా తిరిగి రావడం ఓ గొప్ప పాఠమని నిపుణులు ప్రశంసిస్తున్నారు.

మెక్సికోలోని లా పాజ్ నుంచి ఫ్రెంచ్ పాలినేషియాకు షాడాక్ 6 వేల కిలోమీటర్ల ప్రయాణం ప్రారంభించాడు. వారం తర్వాత సముద్రంలో బలమైన తుపాను వచ్చింది. అందువల్ల షాడాక్ పడవ దారి తప్పింది. అంతేకాదు తుఫాను తాకిడికి పడవ పాడైపోయింది. దీంతో సముద్రం మధ్యలో షాడాక్ సహాయం కోసం ఎన్నో రోజులు వేచి చూశాడు. ఎన్నో కష్టాల పడ్డాడు. చేపలు పట్టుకుని తినేవాడు. వర్షం నీటితో దాహం తీర్చుకునేవాడు. అదృష్టవశాత్తూ అతడి పెంపుడు కుక్క (Pet Dog) బేలా తోడుగా ఉండడంతో అతడు కాస్తాయినా ధైర్యంగా ఉండగలిగాడు.

Viral Video: ఇంటి బయట ఏదో అలికిడి.. నిద్రలేచి ఏంటా.. అని కిటికీలోంచి చూస్తే.. గుండె ఆగినంత పనయింది..!

దాదాపు రెండు నెలల తర్వాత షాడాక్‌ను, అతడి పడవను మెరైన్ హెలికాఫ్టర్ గుర్తించి కాపాడింది. అప్పటికి షాడాక్ చాలా బలహీనంగా అయిపోయాడు. గెడ్డం విపరీతంగా పెరిగిపోయింది. తమను కలిసిన తర్వాత షాడాక్ నవ్వుతూ పలకరించాడని హెలీకాఫ్టర్ సిబ్బంది తెలిపారు. తనకు ప్రస్తుతం విపరీతంగా నిద్ర, మంచి ఆహారం కావాలని షాడాక్ తెలిపాడు.

Updated Date - 2023-07-17T16:27:04+05:30 IST