Share News

Shocking: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సాగర కన్య.. షాకింగ్ విషయం బయటపెట్టిన శాస్త్రవేత్తలు!

ABN , First Publish Date - 2023-10-21T20:42:55+05:30 IST

సగం మానవ ఆకారంలోనూ, సగం చేప ఆకారంలోనూ ఉండే సముద్ర జంతువుల గురించి పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూస్తుంటాం. అలాంటి జీవులు నిజంగా ఉంటాయా, లేదా అనేది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే తాజాగా పపువా న్యూగినియాలోని బీచ్‌లో కనిపించిన ఓ వింత జీవి శాస్త్రవేత్తల్లో ఆసక్తిని పెంచింది.

Shocking: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన సాగర కన్య.. షాకింగ్ విషయం బయటపెట్టిన శాస్త్రవేత్తలు!

సగం మానవ ఆకారంలోనూ, సగం చేప ఆకారంలోనూ ఉండే సముద్ర జంతువుల గురించి పుస్తకాల్లోనూ, సినిమాల్లోనూ చూస్తుంటాం. అలాంటి జీవులు నిజంగా ఉంటాయా, లేదా అనేది ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు. అయితే తాజాగా పపువా న్యూగినియా (Papua New Guinea)లోని బీచ్‌లో కనిపించిన ఓ వింత జీవి శాస్త్రవేత్తల్లో ఆసక్తిని పెంచింది. బీచ్‌లో కనిపించిన ఆ జీవిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. అది మత్స్యకన్య (Mermaid) అని భావించారు. సెప్టెంబర్ 20వ తేదీన స్థానికులకు ఆ వింత జీవి (Strange Animal) కనిపించింది.

పాపువా న్యూ గినియాలోని బిస్మార్క్ సముద్రంలోని (Sea Animal) సింబ్రి ద్వీపంలో సెప్టెంబర్ 20న మత్స్యకన్య వంటి వింత జీవి కనిపించింది. ఆ జంతువు శరీరం పసుపు, తెలుపు రంగలు మిశ్రమంలో ఉంది. అలాగే ఆ జంతువు శరీరం కుళ్లిపోయింది. ఆ జీవిలో చలనం లేదు. చనిపోయిన తర్వాత ఆ జీవి ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. దానిని చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఆ జంతువును ఖననం చేశారు. ఆ జంతువేంటో తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ఆసక్తి కనబరిచారు.

Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆ అబ్బాయి కోసం అన్నీ వదిలేసి వచ్చింది.. పెళ్లి తర్వాత ఏం జరిగిందంటే..

ఇది సముద్రపు క్షీరదంలా కనిపిస్తోందని ఆస్ట్రేలియాలోని జేమ్స్ కుక్ యూనివర్సిటీకి చెందిన పర్యావరణ శాస్త్రవేత్త తెలిపారు. సముద్ర జీవులైన సెటాసియన్లు, తిమింగలాలు, డాల్ఫిన్లు మరణించిన తర్వాత వాటి శరీరాలు కుళ్లిపోయి ఈ స్థితిలోకి మారతాయని చెప్పారు. అయితే ఆ జంతువు డీఎన్‌ఏ, కొలతలు సరిగ్గా లేకపోవడం వల్ల అది ఏ జంతువనేది తెలుసుకోవడం కష్టమని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. కాగా, ఆ వింత జంతువుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Updated Date - 2023-10-21T20:42:55+05:30 IST