Blind Acting: అమ్మబాబోయ్.. స్టార్ హీరోయిన్లు కూడా ఈమె ముందు దిగదుడుపే.. ఏకంగా 15 ఏళ్ల పాటు అంధురాలిగా ఎందుకు నటించిందంటే..
ABN , First Publish Date - 2023-04-01T15:03:15+05:30 IST
యాక్టర్లను సినిమాల్లో చూస్తాం. వాళ్లంటే డబ్బులు తీసుకుని నటిస్తారు. ఎలా నటించమంటే అలా నటిస్తారు. కానీ రీల్‌లో అలాంటి వాళ్లుంటే.. అంతకంటే బాగా నటించే మనుషులు సమాజంలో ఉన్నారు. వీళ్ల ముందు సినిమా నటులు కూడా ఎందుకు పనికిరారు. ఇంతకీ ఏమైందనే కదా? మీడౌట్. అయితే ఈ వార్త చదవాల్సిందే.
యాక్టర్లను సినిమాల్లో చూస్తాం. వాళ్లంటే డబ్బులు తీసుకుని నటిస్తారు. ఎలా నటించమంటే అలా నటిస్తారు. కానీ రీల్‌లో అలాంటి వాళ్లుంటే.. అంతకంటే బాగా నటించే మనుషులు సమాజంలో ఉన్నారు. వీళ్ల ముందు సినిమా నటులు కూడా ఎందుకు పనికిరారు. ఇంతకీ ఏమైందనే కదా? మీడౌట్. అయితే ఈ వార్త చదవాల్సిందే.
ఆమె అన్ని రకాలుగా ఆరోగ్యవంతురాలు. కాళ్లూ చేతులూ.. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి. కష్టపడి బ్రతకొచ్చు. కానీ అదే ఆమెకు నచ్చలేదు. కాలు కదపకుండా డబ్బులు సంపాదించాలని ప్రణాళిక వేసుకుంది. ఇందుకోసం మొత్తం గెటప్పే మార్చేసింది. అసలు సిసలైన దివ్యాంగులకు అందాల్సిన సామాజిక పింఛన్ కోసం ఏకంగా అంధురాలిగా (Blind Acting) మారిపోయింది. ఇప్పటిదాకా కోటి రూపాయలకు పైగా నొక్కేసింది. అయితే ఓ చిన్న పొరపాటుతో అడ్డంగా దొరికిపోయింది. అయితే ఈ మాయలేడీ ముందు స్టార్ హీరోయిన్లు (Star heroines) కూడా దిగదుడుపే అని చెప్పొచ్చు. ఈ సంఘటన ఇటలీ (Italy)లో చోటుచేసుకుంది.
48 ఏళ్ల వయసు కలిగిన ఓ మహిళ అంధురాలినంటూ పదిహేనేళ్లు క్రితం డాక్టర్ నుంచి ధృవీకరణ పత్రాన్ని సంపాదించింది. అనంతరం దివ్యాంగుల కోటాలో సామాజిక పింఛన్ కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుంది. నిజమే అని నమ్మిన అధికారులు పెన్షన్ (Pension) మంజూరు చేశారు. ఇలా దాదాపు 15 ఏళ్ల నుంచి ప్రభుత్వం నుంచి రూ.1.8 కోట్లు పింఛన్ రూపంలో లబ్ధిపొందింది. మొత్తం మీద పాపం పండి అధికారుల కంటికి చిక్కింది. సెల్‌ఫోన్ వీక్షించడం.. ఫైళ్లపై సంతకాలు పెట్టడం అన్నీ ఆమెనే స్వయంగా చేయడాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆమె యవ్వారం బట్టబయలైంది. తప్పుడు ధృవీకరణ పత్రంతో బోల్తా కొట్టించిందన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. దీంతో ఆమెపై చట్టపరమైన చర్యలకు అధికారులు ఉపక్రమించారు. అలాగే ఆమెకు అంధురాలిగా తప్పుడు ధృవీకరణ పత్రాన్ని ఇచ్చిన వైద్యుడ్నీ కూడా విచారించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Viral Video: ఈ అమ్మాయిలేంటి..? కాలేజీకి పప్పు కుక్కర్లు, చెత్త డబ్బాలు, బకెట్లను తీసుకొచ్చారేంటని అవాక్కవుతున్నారా..? అసలు కథేంటంటే..