AC vs Cooler: ఏసీ కొనేంత బడ్జెట్ లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో కూలర్‌తోనే ఏసీని మించిన చల్లదనం..!

ABN , First Publish Date - 2023-03-09T19:12:23+05:30 IST

అంతగా చల్లదనం ఇవ్వడం లేదని మనం అసంతృప్తి చెందే కూలర్ నుండే ఏసీని తలదన్నే చల్లదనాన్ని రాబట్టుకోవచ్చు..

AC vs Cooler: ఏసీ కొనేంత బడ్జెట్ లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో కూలర్‌తోనే ఏసీని మించిన చల్లదనం..!

వేసవికాలం వచ్చేసింది, ఉదయం, సాయంత్రం తప్ప మధ్యాహ్న సమయాల్లో అడుగు బయటపెట్టాలంటే భయమేస్తుంది. బయటే కాదు వేడెక్కిన గోడలతో ఇంట్లోనూ ఉక్కపోతతో కుతకుతలాడిపోతారు అందరూ. చంటిపిల్లలు ఉన్న ఇళ్ళలో పరిస్థితి మరీ దారుణంగా తయారవుతుంది. ఏసీ ఉంటే చల్లగా హాయిగా ఉంటుందని అనుకుంటారు కానీ దాన్ని కొనడం, దానికయ్యే కరెంట్ బిల్లు భరించడం సగటు మధ్యతరగతి కుటుంబాలకు తలకు మించిన పని. ఇంట్లో ఉన్న చిన్నా చితకా కూలర్లు పెద్దగా కూలింగ్ ఇవ్వడం లేదని అసంతృప్తి చెందుతుంటారు చాలామంది. కానీ ఓసారి మీ కూలర్ వైపు చూడండి.. 'నేనేమైనా చిన్నవాడినా చితకవాడినా వేల రూపాయలు పెట్టి మీరు కొన్న కూలర్ నే కదా!' అనే మాట మీ కూలర్ చెప్పినట్టే అనిపిస్తుంది. మనం అసంతృప్తి చెందే కూలర్ నుండే ఏసీని తలదన్నే చల్లదనాన్ని రాబట్టుకోవచ్చు. అందుకోసం ఈ టిప్స్ ఫాలో అయిపోండి..

మీ కూలర్ కొని ఎంతకాలం అయింది? మీరు ఎప్పుడైనా కూలర్ లో ఉండే కూలింగ్ ప్యాడ్స్ మార్చారా? కేవలం కూలర్ లో నీళ్ళు పోసేస్తే చాలు మన పని అయిపోయినట్టే చల్లగాలి అదే వస్తుంది అనుకుంటే పొరపాటే.. కూలర్ లో ఉండే కూలింగ్ ప్యాడ్స్ అప్పుడప్పుడు మారుస్తూ ఉండాలి. ఈ కూలింగ్ ప్యాడ్స్ లో ఉండే గడ్డి చెడిపోతే చల్లగాలి రాదు.

కూలర్ లో అమర్చే కూలింగ్ ప్యాడ్ లు ఒకటికి బదులు రెండు కూడా సెట్ చేయించుకోవచ్చు. ఈ టిప్ ఫాలో అయితే కూలర్ కు ముందుకంటే ఎక్కువ నీరు ఖర్చవుతుంది. కానీ రెండింతల చల్లగాలి వస్తుంది.

కూలర్ గాలి చల్లగా ఉండటానికి మరొక అద్భుతమైన టిప్ కూల్ వాటర్, ఐస్. ఇప్పట్లో ప్రతి ఇంట్లో ఫ్రిజ్ లు ఉంటున్నాయి. దీంతో చల్లనీళ్ళు, ఐస్ క్యూబ్స్ ఇంట్లోనే స్టాక్ ఉంటాయి. కూలర్లో నీరు నింపేటప్పుడు చల్లనీళ్ళు పోయడం లేదా ఐస్ క్యూబ్స్ వేయడం చేయచ్చు. ఇప్పట్లో నీటికి బదులుగా ఐస్ ను జోడించే రూమ్ కూలర్లు కూడా వస్తున్నాయి, ఇవి గదిని సాధారణ నీరు పోసినప్పటికంటే బాగా చల్లబరుస్తాయి. సాధారణ కూలర్ లో కూడా ఈ టిప్ ఫాలో అవచ్చు. కూలర్ లో పోసిన నీటిలో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.

కూలర్ లోపల ఉండే పైపులను జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి. కూలింగ్ ప్యాడ్ లకు నీటిని తీసుకెళ్ళే ఈ పైపులు ఏమాత్రం దెబ్బతిన్నా, వాటిలో దుమ్ము ధూళి పేరుకుపోయినా కూలర్ చల్లదనాన్ని ఇవ్వదు. కూలర్ లో పాత నీటిని తీసి కొత్తనీటిని నింపుతూ ఉండాలి. ఇప్పట్లో కూలర్ పెర్ఫ్యూమ్ లు కూడా అందుబాటులో ఉంటున్నాయి. వీటిని కూలర్ లో వేస్తుంటే చల్లదనంతో పాటు గది మొత్తం సువాసనతో ఆహ్లాదంగా ఉంటుంది.

Read also: Uber Driver Attacked By Girls Video: అమ్మబాబోయ్.. వీళ్లేం అమ్మాయిలండీ బాబూ.. డబ్బులు అడిగిన పాపానికి ఉబర్ డ్రైవర్‌ను కార్లోనే చితకబాదారు..!


Updated Date - 2023-03-09T19:20:28+05:30 IST