Airport: విమానాశ్రయంలోని బాత్రూంలో పర్సు, బ్యాగులను మర్చిపోయిందో మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-08-16T16:38:45+05:30 IST

పాపం బాత్రూమ్ కు వెళ్లిన ఆమె కంగారులో బయటకు వస్తూ తన హ్యాండ్ బ్యాగును బాత్రూం లోనే మరచిపోయింది. అందులో ఉన్న విలువైన వస్తువులు గుర్తుకురాగానే ఆందోళనలో మునిగిపోయింది. కానీ ఆ తరువాత..

Airport: విమానాశ్రయంలోని బాత్రూంలో పర్సు, బ్యాగులను మర్చిపోయిందో మహిళ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..!

బస్సు ప్రయాణాలు, రైలు ప్రయాణాల సందర్భంలో దిగేటప్పుడో, ఎక్కేటప్పుడో కంగారులో తమ వస్తువులు మరచిపోతుంటారు చాలామంది. ఇలా మరచిపోయిన వస్తువులు అదృష్టం బాగుంటే తిరిగి తమ దగ్గరకు చేరుతాయి. లేకుంటే ఇక వాటి మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. కానీ విచిత్రంగా ఓ మహిళ విమానాశ్రయంలోని బాత్రూంలో తన హ్యాండ్ బ్యాగ్, వాలెట్, తాళం చెవులు అన్నీ మరచిపోయింది. అవన్నీ గుర్తొచ్చిన తరువాత ఆమె చాలా కంగారు పడింది. ఆ తరువాత జరిగిన విషయాలు చాలా షాకింగ్ గా ఉన్నాయి. పొరుగురాష్ట్రం బెంగుళూరు విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..


కర్ణాటక రాష్ట్రం బెంగుళూరు విమానాశ్రయంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మేఘనా గిరీష్ అనే మహిళ అర్ధరాత్రి సమయంలో బెంగుళూరు ఎర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఆమె విమానాశ్రయంలోని వాష్ రూమ్ కు వెళ్లి ఆ తరువాత టెర్మినల్ నుండి బయటకు వచ్చింది. రాత్రి సమయం కావడంతో ఆమె కంగారులో వాష్ రూమ్ లోనే తన వాలెట్, ఇంటి తాళాలు అన్నీ ఉన్న హ్యాండ్ బ్యాగ్(Hand bag) మరచిపోయింది. తీరా బయటకు వచ్చిన తరువాత ఆమెకు తన బ్యాగ్ గుర్తొచ్చింది. వెంటనే ఏం చేయాలో ఆమెకు అర్థం కాలేదు. అక్కడే ఉన్న సిఐఎస్ఎప్ అదికారిని(CISF Officer) ఆమె సంప్రదించింది. తన బ్యాగ్ వాష్ రూమ్ లోనే మరచిపోయినట్టు ఆమె ఆయనకు వివరించింది. 'ఇక్కడ ఒక పిన్ కూడా మిస్ అవ్వదు, మీ వస్తువులు మీకు లభిస్తాయి' అని ఆయన ఆమెకు భరోసా ఇచ్చాడు. వెంటనే ఆయన విస్తారా గ్రౌండ్ స్టాఫ్ ను కలవడానికి వెళ్ళారు. సాధారణంగా విమానాశ్రయాల్లో మిస్ అయిన వస్తువులు తిరిగి యజమానులకు చేరినప్పటికీ అవి సుమారు వారం రోజుల తరువాత కానీ వారికి చేరవు. సదరు మహిళ ఇదే విషయాలు ఆలోచిస్తుండగా విస్తారా గ్రౌండ్ స్టాఫ్ ఆమెను విచారణకు పిలిచారు. హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న వస్తువులు, ప్రయాణం చేసిన ఆమె ఐడీ, మొదలైనవి ఆమె ఫోన్ లో ఉన్న బోర్డింగ్ కార్డుతో సరిపోలడంతో ఆమె బ్యాగ్ ను ఆమెకు తిరిగిచ్చారు. ఇదంతా మహిళ సిఐఎస్ఎఫ్ అధికారిని సంప్రదించిన 10నిమిషాల్లోనే జరిగింది. ఆమె తన బ్యాగ్ లభించగానే ఆయనకు, తనకు సహకరించిన వారికి కృతజ్ఞతలు చెప్పి సంతోషంగా ట్యాక్సీ మాట్లాడుకుని ఇంటికెళ్ళింది.

Food Habits: రోజూ పొద్దున్నే ఈ 5 రకాల టిఫిన్లను మాత్రం అస్సలు తినకండి.. పొరపాటున తింటే జరిగేది ఇదే..!




జరిగిన విషయం మొత్తాన్ని Meghna Girish తన ట్విట్టర్(Twitter) అకౌంట్ నుండి షేర్ చేసింది. '10నిమిషాల్లో నా ఒత్తిడి మొత్తం మాయమైపోయింది' అంటూ తన అనుభవాన్ని పంచుకుంది. ఈ పోస్ట్ చదివిన నెటిజన్లు విమానాశ్రయ సిబ్బందిని కొనియాడుతున్నారు. 'మీకు సహాయం చేసిన వారికి థ్యాంక్స్' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'సెక్యురిటీ చెకప్ తరువాత నేను నా ల్యాప్టాప్ మరచిపోయాను, ఇంటికి చేరుకున్నతరువాత చూసుకున్నాను. వారిని అడిగితే జాగ్రత్త చేశారు. నేను నా ల్యాప్టాప్ తిరిగిపొందాను. అని మరొకరు తన అనుభవం పంచుకున్నారు. 'కొంతమంది మంచిమనుషులు ఇప్పటికీ ఉన్నారు' అని మరొకరు కామెంట్ చేశారు. మొత్తంమీద బెంగుళూరు విమానాశ్రయ సిబ్బందిని అందరూ పొగుడుతున్నారు.

Viral: జాబ్‌లో చేరిన 8 నెలల తర్వాత మొట్టమొదటిసారి లీవ్ అడిగిందో యువతి.. బాస్ రియాక్షన్ ఏంటో నెట్టింట షేర్ చేస్తే..!


Updated Date - 2023-08-16T20:30:55+05:30 IST