హనుమజ్జయంతి వేళ... వానరాలకు విందు... ఏ తీరులో జరిగిందంటే...
ABN , First Publish Date - 2023-04-08T12:41:00+05:30 IST
మహారాష్ట్ర(Maharashtra)లోని అకోలా జిల్లా, కోతలి గ్రామంలో హనుమజ్జయంతి సందర్భంగా కోతులకు ఘనంగా విందు ఇచ్చారు. ఒక్క క్షణం కూడా ఒకచోట నిలువని కోతులు(Monkeys) వరుసగా కూర్చొని ఆహారం తింటుంటే చూసేవారు తెగ ఆశ్చర్యపోయారు.
మహారాష్ట్ర(Maharashtra)లోని అకోలా జిల్లా, కోతలి గ్రామంలో హనుమజ్జయంతి సందర్భంగా కోతులకు ఘనంగా విందు ఇచ్చారు. ఒక్క క్షణం కూడా ఒకచోట నిలువని కోతులు(Monkeys) వరుసగా కూర్చొని ఆహారం తింటుంటే చూసేవారు తెగ ఆశ్చర్యపోయారు. గ్రామానికి చెందిన ముంగ్సాజీ మహారాజ్ సంస్థాన్(Mungsaji Maharaj Sansthan) తరపున వానరాలకు మిఠాయిలు అందించారు.
ఇక్కడ విశేషమేమిటంటే ఈ కోతులు ఎంతో క్రమశిక్షణ(discipline)తో స్థిరంగా కూర్చొని స్వీట్లను తిన్నాయి. ఈ ఉదంతానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్(Viral) అవుతున్నాయి. కాగా సుందరమైన, దట్టమైన చెట్ల నీడలో ముంగ్సాజీ మౌలి సంస్థాన్ ఉంది. హనుమాన్ జయంతి(Hanuman Jayanti) సందర్భంగా ఈ సంస్థ తరపున మహాప్రసాదం పంపిణీ చేశారు.
భక్తులకే కాకుండా ఆ ప్రాంతంలోని కోతులకు కూడా మహాప్రసాదం(Mahaprasad) అందించాలని నిర్వాహకులు అనుకున్నారు. వానరాలకు వరుసగా స్టీలు ప్లేట్లలో మహాప్రసాదం వడ్డించారు. సంస్థ నిర్వాహకులు రామదాస్ మహారాజ్(Ramdas Maharaj) ఆ ప్రాంతంలోని కోతులను మహాప్రసాదం స్వీకరించేందుకు ఆహ్వానించారు. దీంతో ఆ ప్రాంతంలోని కోతులన్నీ వచ్చి క్రమశిక్షణ(discipline)తో వరుసగా కూర్చొని, మహాప్రసాదాన్ని ఆనందంగా ఆరగించాయి.