పరిధికి మించి మస్కిటో కిల్లర్ లిక్విడ్‌ను వినియోగిస్తున్నారా? ఆయితే ఈ ముప్పు తప్పదు...

ABN , First Publish Date - 2023-04-08T13:47:29+05:30 IST

దోమల నివారణకు చాలామంది మస్కిటో కిల్లర్ లిక్విడ్(Mosquito killer liquid) వినియోగిస్తుంటారు. అయితే దీనిని ఒక పరిధికి మించి వినియోగిస్తే పలు అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తుతాయి.

పరిధికి మించి మస్కిటో కిల్లర్ లిక్విడ్‌ను వినియోగిస్తున్నారా? ఆయితే ఈ ముప్పు తప్పదు...

దోమల నివారణకు చాలామంది మస్కిటో కిల్లర్ లిక్విడ్(Mosquito killer liquid) వినియోగిస్తుంటారు. అయితే దీనిని ఒక పరిధికి మించి వినియోగిస్తే పలు అనారోగ్య సమస్యలు(Health problems) తలెత్తుతాయి. అందుకే మస్కిటో కిల్లర్ లిక్విడ్ ఎలా వినియోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. మస్కిటో కిల్లర్ లిక్విడ్ కారణంగా కంటి సమస్యలు(Eye problems), అలెర్జీలు చుట్టుముడతాయి. ఇందులోని రసాయనాలు(Chemicals) శ్వాస సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తాయి. తలనొప్పి, చికాకు, తల తిరగడం, వికారం, వాంతులు మొదలైన సమస్యల బారిన పడేలా చేస్తాయి.

దోమలను(Mosquitoes) చంపే ద్రవాన్ని రోజులో 2 నుండి 3 గంటల పాటు మాత్రమే వినియోగించాలి. నిద్రిస్తున్నప్పుడు కూడా దీనిని వినియోగించడం ప్రమాదకరంగా(dangerous) మారుతుంది. నిద్రించడానికి 2-3 గంటల ముందు దీనిని వినియోగించడం ఉత్తమం. నిద్రపోయే ముందు దీనిని ఆపివేయాలి. ముఖ్యంగా ఆస్తమా(Asthma), న్యుమోనియా, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారు ఈ దోమల ద్రవానికి దూరంగా ఉండటం ఉత్తమం. అలాగే చిన్న పిల్లలను(Small children) కూడా ఈ ద్రవానికి దూరంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు.

Updated Date - 2023-04-08T13:47:29+05:30 IST