Amazing: ఈ బుడ్డోడి తెలివి ముందు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే బలాదూర్.. వయసు రెండున్నరేళ్లే కానీ..!

ABN , First Publish Date - 2023-07-26T11:55:43+05:30 IST

ఎంత బట్టీ కొట్టించినా 60 తెలుగు సంవత్సరాల పేర్లలో సగం కూడా చెప్పలేని వారు యువన్ తెలివి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.

Amazing: ఈ బుడ్డోడి తెలివి ముందు పెద్ద పెద్ద శాస్త్రవేత్తలే బలాదూర్.. వయసు రెండున్నరేళ్లే కానీ..!

'పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది'అని అన్నారు పెద్దలు. అందరి విషయంలో ఏమో కానీ ఈ బుడ్డోడిని చూస్తే ఆ మాటను తప్పకుండా సమర్థిస్తారు . రెండున్నరేళ్ళ వయసుకే ఈ పిల్లాడు తన తెలివితో యావత్ భారతదేశాన్ని సంభ్రమంలో ముంచేస్తున్నాడు. ఈ పిల్లాడి తల్లిదండ్రులు అప్పుడే పుత్రోత్సాహాన్ని అనుభూతి చెందుతున్నారు. ఎంత బట్టీ కొట్టించినా 60 తెలుగు సంవత్సరాల పేర్లలో సగం కూడా చెప్పలేని వారు యువన్ తెలివి చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ పిల్లాడు 62కార్ల బ్రాండ్ పేర్లను కేవలం లోగోలు చూస్తే చాలు చెప్పేస్తున్నాడు. ఇంతకూ అందరినీ అంత ఆశ్చర్యపరుస్తున్న ఈ బుడ్డోడి సంగతేంటి? ఇతనెక్కడి వాడు ? మొదలైన విషయాలు తెలుసుకుంటే..

హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రం సిమ్లాలోని పంథామటిలో దేవగ్యా అత్రి అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇతని భార్య పేరు పాయల్ అత్రి. వీరికి యువన్ అత్రి(Yuvaan Atri) అనే రెండున్నరేళ్ళ(two and half years kid) కుమారుడున్నాడు. 2021, ఏప్రిల్ 9 న జన్మించిన ఈ బుడ్డోడు బొమ్మలతో ఆడుకోవాల్సిన వయసులో యావత్ బారతదేశమంతా హాట్ టాపిక్ గా మారాడు. రెండున్నరేళ్ల వయసుకే కేవలం లోగో చూసి 62 వాహానాల బ్రాండ్లను చెప్పేస్తున్నాడు ఈ బుడతడు(kid said car brand names after seeing logo). ఈ పిల్లాడిలో ట్యాలెంట్ బయటపడటం కూడా చాలా ఆశ్చర్యంగా జరిగిందట. ఒకరోజు దేవాగ్య తన భార్య, కొడుకుతో కలిసి జైపూర్ కు విమాన ప్రయాణం చేస్తున్నాడు. ఆ సమయంలో విమానంలో పిల్లాడు అల్లరి చేయకుండా ఉండేందుకు పిల్లాడి చేతిలో మొబైల్ ఉంచాడు అతని తండ్రి. ఆ తరువాత ఇంట్లో టీవీలో యాడ్స్ చూసేవాడు. ఇలా యువన్ తను చూసిన వాటిని బాగా గుర్తుపెట్టుకున్నాడు. వాహనాల లోగోలు చూడగానే వాటి బ్రాండ్ నేమ్స్ చెప్పడంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఆ తరువాత పిల్లాడిని పలుసార్లు పరీక్షించి అతనిలో ఉన్న ట్యాలెంట్ ను ధృవీకరించుకున్నారు.

Aloe Vera Side Effects: కలబంద ఎంత మంచిదో అని అంతా అనుకుంటారు కానీ.. ఈ సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు తెలుసా..?


పిల్లాడి తెలివి తేటలకు గుర్తింపు తీసుకురావాలనే ఉద్దేశ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్(Limca Book of Records) లో పిల్లాడి పేరు నమోదు చేశాడు. అంతేకాదు భారతీయులు ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియా వరల్డ్ రికార్డ్స్ లో(Indian world record)పిల్లాడి పేరు నమోదు చేయించారు. ఉనాలోని తన అవ్వతాతల దగ్గర ఉన్న సమయంలో ఇండియన్ వరల్డ్ రికార్డ్స్ వారు నేరుగా యువన్ ను పరీక్షించి, అతని ప్రతిభకు గుర్తింపునిచ్చారు. పరీక్షలో యువన్ 62వాహనాల లోగోలను చూసి వాటి బ్రాండ్ పేర్లను టకాటకా చెప్పేశాడు. కాగా యువన్ తండ్రి దేవాగ్య, తల్లి పాయల్ తమ కొడుకు టాలెంట్ కు వచ్చిన గుర్తింపుకు తెగ సంబరపడిపోతున్నారు. 'నా కొడుకుకు వాహనాల మీద ఉన్న క్రేజ్ చూసి అవాక్కయ్యాను, అతని ప్రతిభను ప్రోత్సహిస్తాను' అని చెప్పుకొచ్చాడు.

Credit Card Penalty: క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో కట్టకపోయినా.. జరిమానా పడకుండా ఉండాలంటే..!


Updated Date - 2023-07-26T11:55:43+05:30 IST