Amazon: అమెజాన్ నుంచి ఇంపార్టెంట్ అప్‌డేట్.. సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అమల్లోకి కొత్త రూల్..!

ABN , First Publish Date - 2023-09-15T18:06:15+05:30 IST

షాప్‌లకు వెళ్లే కొనుగోలు చేసే అవసరం లేకుండా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ సైట్లు నేరుగా ఇంటికే మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకొస్తున్నాయి. అమెజాన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే వారి కోసం ఓ కీలక ఆప్‌డేట్ వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతోంది.

Amazon: అమెజాన్ నుంచి ఇంపార్టెంట్ అప్‌డేట్.. సెప్టెంబర్ 19వ తారీఖు నుంచి అమల్లోకి కొత్త రూల్..!

ప్రస్తుతం ఆన్‌లైన్ షాపింగ్‌ (Online Shopping)కు విపరీతమైన డిమాండ్ ఉంది. షాప్‌లకు వెళ్లి కొనుగోలు చేసే అవసరం లేకుండా అమెజాన్ (Amazon), ఫ్లిప్‌కార్ట్ (Flipkart) వంటి ఈ-కామర్స్ సైట్లు నేరుగా ఇంటికే మనం ఆర్డర్ చేసిన వస్తువులను తీసుకొస్తున్నాయి. ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే క్యాష్ ఆన్ డెలివరీ (Cash On Delivery) సదుపాయం కూడా ఉండడంతో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్‌ వైపే మొగ్గు చూపుతున్నారు. అమెజాన్ ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేసి ఇంటికి వచ్చాక డబ్బులు ఇచ్చే వారి కోసం ఓ కీలక ఆప్‌డేట్ వచ్చింది. ఈ నెల 19వ తేదీ నుంచి ఈ నిబంధన అమల్లోకి రాబోతోంది.

సెప్టెంబర్ 19 నుంచి క్యాష్ ఆన్ డెలివరీ (COD) పేమెంట్స్‌ ద్వారా రూ.2,000 నోట్లను అమెజాన్‌ స్వీకరించదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా అమెజాన్‌ ఈ నిర్ణయం తీసుకుంది (Amazon Will Not Accept Rs 2,000 Notes). అయితే అమెజాన్ పార్సిళ్లను డెలివరీ చేసే థర్డ్ పార్టీ కొరియర్ సర్వీస్‌లకు ఈ నిబంధన వర్తించదు. థర్డ్-పార్టీ కొరియర్ పార్ట్‌నర్‌ డెలివరీ చేస్తే, రూ.2,000 కరెన్సీ నోట్లు స్వీకరించడం అనేది వారి వ్యక్తిగత విధానాన్ని బట్టి ఉంటుంది.

Prime Minister Salary: ప్రపంచ దేశాల్లో ఏ ప్రధానమంత్రికి శాలరీ ఎక్కువ..? భారత ప్రధాని మోదీకి ఏటా అసలెంత జీతమంటే..?

రూ.2000 నోట్లను రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మే 19న రూ.2000 నోట్ల జారీని ఆర్బీఐ నిలిపివేసింది. అయితే సర్క్యులేషన్‌లో ఉన్న నోట్లు కొనసాగుతాయని పేర్కొంది. సెప్టెంబర్‌ 30 వరకు రూ.2000 నోట్లు చెల్లుబాటులో ఉంటాయని ఆర్బీఐ ప్రకటించింది. ఆ తేదీ లోపు ఆ నోట్లను ఎక్స్ఛేంజ్ చేసుకోవాలని సూచించింది. ఆ తేదీ తర్వాత రూ.2000 నోట్లు చట్టబద్ధంగా చెల్లవు.

Updated Date - 2023-09-15T18:06:15+05:30 IST