Share News

Viral News: సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉంటున్నారా..? ఈ బిల్డింగ్‌లోని బాల్కనీలు ఎలా కూలిపోయాయో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-11-13T18:29:14+05:30 IST

మీరు నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో నివసిస్తుంటారా? సిటీలోని ఎత్తైన బిల్డింగ్‌ల్లో ఉంటున్నారా? నాణ్యత లేకుండా కట్టిన కొన్ని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి.

Viral News: సిటీల్లో అపార్ట్మెంట్లలో ఉంటున్నారా..? ఈ బిల్డింగ్‌లోని బాల్కనీలు ఎలా కూలిపోయాయో తెలిస్తే..!

మీరు నగరాల్లోని అపార్ట్‌మెంట్లలో (Apartments) నివసిస్తుంటారా? సిటీలోని ఎత్తైన బిల్డింగ్‌ల్లో ఉంటున్నారా? నాణ్యత లేకుండా కట్టిన కొన్ని అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లు ఇటీవలి కాలంలో తరచుగా ప్రమాదాలకు కారణమవుతున్నాయి. తాజాగా గురుగ్రామ్‌ (Gurugram)లోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఐదో అంతస్థు నుంచి రెండో అంతస్థు వరకు ఉన్న బాల్కనీలు (Balconies) పేక మేడల్లా కూలిపోయాయి. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఈ ఘటనతో అపార్ట్‌మెంట్ వాసుల్లో అందోళన మొదలైంది.

గురుగ్రామ్‌లోని సెక్టార్ 109లో ఉన్న చింతల్ ప్యారడిసో సొసైటీలో మరోసారి ప్రమాదం జరిగింది. సొసైటీలోని డి టవర్‌లో ఉన్న అపార్ట్‌మెంట్ బాల్కనీలు కూలిపోయాయి. గురువారం రాత్రి ఐదో అంతస్తు నుంచి రెండో అంతస్థు వరకు బాల్కనీలు విరిగిపడ్డాయి. గత ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ సొసైటీలో భారీ ప్రమాదం జరిగింది. వెంటనే ఆయా బిల్డింగ్‌లను ఖాళీ చేయాలని అధికారులు సూచనలు ఇచ్చారు. ఆయా ఫ్లాట్ ఓనర్లకు బిల్డర్ ద్వారా నష్టపరిహారం ఇప్పించారు. అయినా కొందరు ఇంకా అక్కడే ప్రమాదకర పరిస్థితుల్లో నివసిస్తున్నారు.

Shocking Video: నువ్వు నిజంగా గొప్పోడివి సామీ.. ఎద్దును బైక్‌పై తీసుకెళ్తున్న వ్యక్తి.. డేంజరస్ డ్రైవింగ్ అంటూ నెటిజన్లు ఆగ్రహం!

ఫిబ్రవరిలో ప్రమాదం జరిగిన తర్వాత స్ట్రక్చరల్ ఆడిట్ కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించారు. విచారణలో ఈ సొసైటీలోని టవర్లు నివసించడానికి సురక్షితం కాదని తేలింది. వెంటనే టవర్లను ఖాళీ చేయాలని పరిపాలన శాఖ వారిని ఆదేశించింది. చాలా మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. కొందరు మాత్రం ఇప్పటికీ ఆ టవర్లలోనే నివసిస్తున్నారు. తాజాగా ప్రమాదం జరిగిన బిల్డింగ్‌లో మాత్రం ఎవరూ నివసించడం లేదు.

Updated Date - 2023-11-13T18:29:16+05:30 IST