Apple: యాపిల్ కొత్త అప్‌డేట్ తెచ్చిన తంటా.. తన పేరును మార్చుకున్న యువతి.. అసలు కథేంటో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-10-06T18:25:36+05:30 IST

యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ కారణంగా బ్రిటన్‌కు చెందిన ఓ యువతి తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. యాపిల్ సాఫ్ట్‌వేర్ iOS తాజా అప్‌డేట్ కారణంగా ఆ మహిళకు పలు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో 6 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ సిరి అనే యువతి తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకుంది.

Apple: యాపిల్ కొత్త అప్‌డేట్ తెచ్చిన తంటా.. తన పేరును మార్చుకున్న యువతి.. అసలు కథేంటో తెలిస్తే..

యాపిల్ (Apple) వాయిస్ అసిస్టెంట్ సాఫ్ట్‌వేర్ కారణంగా బ్రిటన్‌ (Britain)కు చెందిన ఓ యువతి తన పేరును మార్చుకోవాల్సి వచ్చింది. యాపిల్ సాఫ్ట్‌వేర్ iOS తాజా అప్‌డేట్ ( iOS Update) కారణంగా ఆ మహిళకు పలు ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో 6 ఏళ్ల ఫిట్‌నెస్ ట్రైనర్ సిరి (Siri) అనే యువతి తన పేరును మార్చుకోవాలని నిర్ణయించుకుంది. యాపిల్ ఉత్పత్తుల్లో వాయిస్-యాక్టివేటెడ్ డిజిటల్ అసిస్టెంట్ అయిన ``సిరి``ని ఆన్ చేయాలంటే ``హే సిరి`` (Hey Siri) అని పిలిస్తే సరిపోతుంది.

బ్రిటన్‌కు చెందిన ఆ యువతి పేరు కూడా ``సిరి`` కావడంతో ఆమెను స్నేహితులు కొందరు ``హే సిరి`` అని పిలిచేవారు. ఫ్రెండ్స్ అలా పిలిచినప్పుడల్లా ఆమె ఐఫోన్‌లోని ``సిరి`` యాక్టివేట్ అయ్యేది. ``నేను ఫిట్‌నెస్ ట్రైనర్‌ను కాబట్టి అందరూ నన్ను విష్ చేసేటపుడు ``హే సిరి``అని పలకరించేవారు. దాంతో నా ఫోన్‌లోని సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అయ్యేది. దాంతో వారు ``హే సిరి`` అని కాకుండా ``సిరి`` అని పిలవడం ప్రారంభించారు. అయితే యాపిల్ తాజా అప్‌డేట్ కారణంగా ఇప్పుడు ``సిరి`` అని పిలిస్తే చాలు ఆ సాఫ్ట్‌వేర్ యాక్టివేట్ అవుతోంద``ని సిరి తెలిపింది.

Shocking News: 9వ తరగతి బాలుడు ఆత్మహత్య.. కారణమేంటా అని ఆరా తీస్తే బయటపడ్డ ఇద్దరమ్మాయిల నిర్వాకం..!

దీంతో స్నేహితులు ఇప్పుడు ఆమెను సిరి అని కూడా పిలవలేకపోతున్నారు. ``నేను నా స్నేహితులతో కలిసి కూర్చుని ఆలోచించి ఓ నిర్ణయం తీసుకున్నాను. నా పేరు మార్చుకోవాలనుకున్నాను. నా పేరును ``సిరి`` నుంచి ``సిజ్``గా మార్చుకున్నాన``ని ఆమె తెలిపింది. మొత్తానికి యాపిల్ కొత్త అప్‌డేట్ ఆ యువతికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది.

Updated Date - 2023-10-06T18:25:36+05:30 IST