సిగరెట్ మానివేసేందుకు కృత్రిమ మేధస్సు సాయం... ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే...

ABN , First Publish Date - 2023-04-16T13:27:50+05:30 IST

ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు(Researchers) క్విట్ సెన్స్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు.

సిగరెట్ మానివేసేందుకు కృత్రిమ మేధస్సు సాయం... ఇది ఎలా పనిచేస్తుందో తెలిస్తే...

ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు(Researchers) క్విట్ సెన్స్ అనే కృత్రిమ మేధస్సు ఆధారిత అప్లికేషన్‌ను అభివృద్ధి చేశారు. ఇది ధూమపానం చేసే వ్యక్తులు ఉంటున్న స్థానాన్ని తక్షణమే గుర్తిస్తుంది. తరువాత వారికి ఈ యాప్ వివిధ సందేశాలను(messages) పంపిస్తుంది. ఈ యాప్ సహాయంతో సిగరెట్ తాగే అలవాటును తగ్గించవచ్చని పరిశోధకులు భావిస్తున్నారు.

సిగరెట్ తాగే అలవాటును మానుకోవాలని బ్రిటీష్ పరిశోధకులు చెబుతున్నారు. ఈ అలవాటను మానివేసేందుకు క్విట్ సెన్స్ యాప్ అభివృద్ధి చేశారు. ఈస్ట్ ఆంగ్లియా విశ్వవిద్యాలయం(University of East Anglia)లోని పరిశోధకులు క్విట్ సెన్స్ అనే AI స్మార్ట్‌ఫోన్ యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను పరీక్షించడం కోసం సోషల్ మీడియా ద్వారా 209 మంది పొగతాగేవారిని(Smokers) ఎంపిక చేశారు. వారికి ఒక టెక్స్ట్ సందేశం పంపారు. దీని ద్వారా వారు ధూమపానం మానేయడానికి ఉపకరించే చికిత్సకు ఉపక్రమించారు. 6 నెలల ఫాలోఅప్(Follow up) అనంతరం వారు సిగరెట్ తాగడం మానేశారు.

Updated Date - 2023-04-16T13:28:41+05:30 IST