Shocking: నగ్నత్వంపై ఇంత మోజా? మహిళల దుస్తులు తొలగించే యాప్స్, వెబ్‌సైట్స్‌కు డిమాండ్ ఏ స్థాయిలో ఉందంటే..
ABN , First Publish Date - 2023-12-09T19:57:43+05:30 IST
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ పదం చాలా మందిని భయపెడుతోంది. ఏఐ అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉండవు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఏఐ వల్ల మరో అనర్థం గురించి షాకింగ్ గణాంకాలు బయటకు వచ్చాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI).. ఈ పదం చాలా మందిని భయపెడుతోంది. ఏఐ (Artificial Intelligence) అందుబాటులోకి వస్తే చాలా మందికి ఉద్యోగాలు ఉండవు అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తుంటారు. ఉద్యోగాల సంగతి పక్కన పెడితే ఏఐ వల్ల మరో అనర్థం గురించి షాకింగ్ గణాంకాలు బయటకు వచ్చాయి. ఏఐ ఉపయోగించి ఫొటోల్లో మహిళల దుస్తులను తొలగించే యాప్స్ (Undressing Apps), వెబ్‌సైట్స్‌కు భారీగా డిమాండ్ పెరుగుతోందని తాజాగా తేలింది. సోషల్ నెట్వర్క్ ఎనాలసిస్ కంపెనీ గ్రాఫికా తాజాగా చేసిన రీసెర్చ్ షాకింగ్ విషయాలు వెల్లడించింది.
ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్ నెలలోనే అలాంటి న్యూడ్ యాప్‌లను, వెబ్‌సైట్లను ఏకంగా2.4 కోట్ల మంది ఉపయోగించినట్టు తేలింది. అంతేకాదు ఈ ఏఐ ఆధారిత న్యూడ్ యాప్స్, వెబ్‌సైట్స్ తమ ప్రమోషన్ కోసం X (ట్విటర్), రెడిట్ వంటి మెయిన్ స్ట్రీమ్ సోషల్ మీడియా వేదికలను వాడుకుంటున్నాయి. ఈ అన్‌డ్రెస్సింగ్ యాప్స్‌కు చెందిన లింక్‌లను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం ఈ ఒక్క ఏడాదిలోనే 2400 శాతం వరకు పెరిగింది. ఈ యాప్‌లన్నీ పూర్తిగా మహిళలనే టార్గెట్ చేసుకుని రూపొందాయి. కేవలం మహిళల ఫొటోలను మార్చడం కోసం వీటిలో చాలా యాప్స్ రూపొందాయి (Undressing women in Photos).
Chinese Zodiac Sign: చైనా జ్యోతీష్యం ప్రకారం మీ రాశి, మీకు కలిసొచ్చే రంగులు ఏంటో తెలుసుకోండి..
గతంలో ఫొటోలను మార్ఫింగ్ చేయడం కాస్త కష్టంగా ఉండేది. ఏది ఒరిజినలో, ఏది ఫేక్ అనేది సులభంగా కనిపెట్టే వీలుండేది. అయితే ఈ ఏఐ ఆధారిత యాప్స్ వల్ల ఫేక్ ఫొటోలను, వీడియోలను గుర్తించడం కష్టంగా మారింది. ఇటీవల వైరల్ అయిన రష్మిక వీడియో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. నెలకు రూ. 1000 వరకు ఛార్జ్ చేసే పెయిడ్ యాప్స్‌లో కూడా యూజర్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోందట. ఈ యాప్స్ బారిన పడుతున్న మహిళల్లో చాలా మంది తాము బాధితులమనే విషయమే తెలియదట.