Mathematics: బాబోయ్.. అమ్మాయిల లెక్కలు ఇలా ఉంటాయా? నెటిజన్ల స్పందన ఏంటంటే..
ABN , First Publish Date - 2023-10-01T14:01:39+05:30 IST
ఏదైనా ఒక విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఆలోచించే విధానం మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ఒకే విషయం గురించి అమ్మాయిలు ఒకలా ఆలోచిస్తే, అబ్బాయిలు మరోలా ఆలోచిస్తారు. అమ్మాయిల లెక్కలు ఎలా ఉంటాయో వివరిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
ఏదైనా ఒక విషయంలో అమ్మాయిలు (Girls), అబ్బాయిలు (Boys) ఆలోచించే విధానం మధ్య కచ్చితంగా తేడా ఉంటుంది. ఒకే విషయం గురించి అమ్మాయిలు ఒకలా ఆలోచిస్తే, అబ్బాయిలు మరోలా ఆలోచిస్తారు. అమ్మాయిల లెక్కలు (Mathematics) ఎలా ఉంటాయో వివరిస్తూ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ (Viral Tweet) అవుతోంది. ఆ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. @BowTiedBernard అనే ట్విటర్ యూజర్ ఈ పోస్ట్ చేశారు.
ప్రముఖ వెబ్‌సైట్ ``నో యువర్ మీమ్`` పరిశోధన ప్రకారం.. కొంత మంది అమ్మాయిల షాపింగ్ (Shopping) లాజిక్ చాలా వెరైటీగా ఉంటుందని టిక్‌టాకర్ సామ్‌జేమ్స్ అనే వ్యక్తి పేర్కొన్నారు. షాపింగ్ చేసేటపుడు ఐదు డాలర్ల కంటే తక్కువ విలువ కలిగిన వస్తువు మహిళలకు ఉచితంగా అనిపిస్తుందని, 50 డాలర్ల వస్తువును రిటర్న్ ఇచ్చి 100 డాలర్ల వస్తువును కొన్నప్పుడు వారికి కేవలం 50 డాలర్లు మాత్రమే ఖర్చు పెట్టినట్టు అనిపిస్తుందని ట్వీట్ చేశారు. ఈ ఫన్నీ పోస్ట్ చాలా మంది నెటిజన్లను ఆకట్టుకుంది. ఈ పోస్ట్‌పై చాలా మంది ఫన్నీగా రియాక్ట్ అయ్యారు.
Viral Video: పెళ్లి వేడుకలో వరుడికి, అతిథులకు కళ్ల గంతలు కట్టిన వధువు.. ఆమె ఎందుకలా చేసిందో తెలిస్తే కన్నీళ్లు రాకమానవు!
``తన పుట్టిన రోజు కోసం ఎంత ఖర్చు పెట్టినా అది వృథా కాదని నా గాళ్‌ఫ్రెండ్ చెబుతుంది``, ``డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అమ్మాయిలు ఎమోషనల్‌గా ఆలోచిస్తారు, అబ్బాయిలు లాజికల్‌గా ఆలోచిస్తారు``, ``లెక్కల విషయంలో అమ్మాయిల కంటే అబ్బాయిలు చాలా ఫాస్ట్``, ``చాలా దేశాల్లో ద్రవ్యోల్భణానికి అమ్మాయిలే కారణం``, ``అమ్మాయిలు అందరూ అలా ఉండరు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.