Share News

Firefox: ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను వాడుతున్న వాళ్లకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అలెర్ట్.. వెంటనే..!

ABN , First Publish Date - 2023-11-28T15:51:53+05:30 IST

మీరు వెబ్ బ్రౌజింగ్ కోసం ఫైర్‌ఫాక్స్ ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే మీ కోసం ఓ ముఖ్యమైన సమాచారం ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి. డేటాను దొంగిలించడం, నగదు కాజేయడం వంటివి సర్వసాధారణంగా మారాయి.

Firefox: ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌ను వాడుతున్న వాళ్లకు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంపార్టెంట్ అలెర్ట్.. వెంటనే..!

మీరు వెబ్ బ్రౌజింగ్ కోసం ఫైర్‌ఫాక్స్ (Firefox) ఎక్కువగా ఉపయోగిస్తారా? అయితే మీ కోసం ఓ ముఖ్యమైన సమాచారం ఉంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు (Cyber Crimes) విపరీతంగా పెరిగిపోయాయి. డేటాను దొంగిలించడం, నగదు కాజేయడం వంటివి సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో మీ ఆన్‌లైన్ వ్యవహారాలను భద్రంగా ఉంచుకోవడం అతి కీలకంగా మారింది. ఈ విషయంపై కేంద్ర వర్గాలు ఎప్పటికప్పుడు యూజర్లను అలెర్ట్ చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) మరోసారి భారతీయ వినియోగదారులను హెచ్చరించింది.

మొజిల్లా ఫైర్‌ఫాక్స్ వెబ్ బ్రౌజర్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలని అలెర్ట్ (Alert) చేసింది. ఫైర్‌ఫాక్స్ బ్రౌజర్‌లో లోపాల్ని గుర్తించామని, వాటితో డేటా చౌర్యం, మాల్‌వేర్ దాడులు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఫైర్‌ఫాక్స్‌లో చాలా భద్రతా సమస్యలు ఉన్నాయని, ఇవి వినియోగదారుల డివైజ్‌లను ప్రమాదంలో పడేసే అవకాశం ఉందని స్పష్టం చేసింది. హ్యాకర్లు బ్రౌజర్లోకి ఆర్బిటరీ కోడ్ ప్రవేశపెట్టి యూజర్ల అనుమతి లేకుండానే డివైజ్‌ల్లో నిషేధిత వెబ్‌సైట్లను ఓపెన్ చేయడం, ఇతర ముఖ్యమైన వ్యక్తిగత సమాచారం దొంగిలించడం వంటివి చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది (Security Alerts).

Break Up: ఇదెక్కడి లవ్‌స్టోరీ తల్లి.. రీల్స్‌కు లైక్ కొట్టలేదని బ్రేకప్.. మధ్యలో దోమ కథ ఏంటంటే..

CERT-In అలర్ట్‌ ప్రకారం .. 115.5.0కి ముందు వచ్చిన ఫైర్‌ఫాక్స్‌ ESR వెర్షన్‌లు, 120కి ముందున్న ఫైర్‌ఫాక్స్‌ iOS వెర్షన్‌లు, 115.5కి ముందు మొజిల్లా థండర్‌బర్డ్ వెర్షన్లను వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి. ఎలాంటి సైబర్ దాడులూ జరగకుండా ఉండేందుకు వినియోగదారులు ఫైర్‌ఫాక్స్‌ బ్రౌజర్ ఆటోమేటిక్ అప్‌డేట్స్‌ని ఎనేబుల్‌ చేసుకోవాలి. అజ్ఞాత వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్‌లు, ఈ-మెయిల్స్ ద్వారా వచ్చే లింక్‌లు, అటాచ్‌మెంట్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకూడదు.

Updated Date - 2023-11-28T15:51:59+05:30 IST