ATM Card: ఏటీఎం కార్డులపై కనిపించే 16 అంకెల సంఖ్యకు అర్థమేంటి..? 16వ స్థానంలో ఉండే అంకెతో అసలేం తెలుస్తుందంటే..!
ABN , First Publish Date - 2023-06-06T13:37:16+05:30 IST
ఏటీయం కార్డ్ ఎంత తరచుగా వాడేవారికైనా ఆ కార్డ్ మీద ఉన్న 16అంకెల నెంబర్ల గురించి వివరంగా తెలిసి ఉండదు. మరీ ముఖ్యంగా చివరి అంకె ద్వారా ఏం తెలుస్తుందంటే..
బ్యాంకు ఖాతాదారులకు బ్యాంకు వారు ఇచ్చే డెబిట్ కార్డును ఏటీయం కార్డ్ అనికూడా అంటాము. ఇప్పట్లో షాపింగ్ కు వెళ్ళడం నుండి హోటల్స్ లో భోజనం చేయడం వరకు, కిరాణా సరుకులు కొనడం నుండి హాస్పిటల్ బిల్ చెల్లింపుల వరకు ఏటీయం కార్డులు వాడుతున్నారు. డబ్బు అవసరం అయినప్పుడు బ్యాంకుకు కూడా వెళ్ళక్కర్లేకుండా ఏటీయం మెషీన్ దగ్గరకు వెళ్ళి ఏటీయం పిన్ సహాయంతో డబ్బు డ్రా చేయడం చేస్తుంటారు. అయితే ఏటీయం కార్డు మీద ఉన్న 16 అంకెల సంఖ్య గురించి తెలిసినవారు మాత్రం చాలా తక్కువ. ఈ అంకె వెనుక దాగున్న నిజమేంటో.. మరీ ముఖ్యంగా 16అంకెల సంఖ్యలో చివరి అంకె ఏం తెలియజెస్తుందో పూర్తీగా తెలుసుకుంటే..
ఏటీయం కార్డ్(ATM Card) ఎంత తరచుగా వాడేవారికైనా ఆ కార్డ్ మీద ఉన్న 16అంకెల నెంబర్(16 digit number) గురించి వివరంగా తెలిసి ఉండదు. ఏటీయం కార్డ్ మీద ఉండే మొదటి 6అంకెలు(first 6 numbers) బ్యాంక్ గుర్తింపు సంఖ్యను(bank identify number) సూచిస్తాయి. మిగిలిన 10అంకెలు(10digits) అకౌంట్ హోల్డర్ ప్రత్యేక ఖాతాను సూచిస్తాయి. ఏటీయం కార్డ్ మీద గ్లోబల్ హోలోగ్రామ్ (global hologram)ఉంటుంది. ఇది సెక్యూరిటీగా పనిచేస్తుంది. దీన్ని కాపీ చెయ్యడం కష్టం. డెబిట్ కార్డ్ మీద మొదటి అంకె(debit card first number) ఆధారంగా ఆ కార్డును జారీ చేసిన పరిశ్రమ ఏదో తెలుసుకోవచ్చు. దీనిని మేజర్ ఇండస్ట్రీ ఐడెంటిఫైయర్(Major Industry Identifier (MII)) అని అంటారు. బ్యాంకు ఖాతాదారులకు జారీచేసే ఏటీయం కార్డులు ముఖ్యంగా వీసా(visa), మాస్టర్ కార్ట్(master card) లు అయి ఉంటాయి. మాస్టర్ కార్డులు 2లేదా 5 నెంబర్ తో మొదలవుతాయి. వీసా కార్డులు 4 నెంబర్ తో మొదలవుతాయి.
Home Making Tips: ఎంత శుభ్రం చేసినా ఈగలు ఇంట్లోంచి వెళ్లడం లేదా..? ఈ సింపుల్ టిప్స్‌తో వాటిని చంపకుండానే పారిపోయేలా చేయొచ్చు..!
ఏటీయం కార్డు మీద ఉన్న మొదటి ఆరు అంకెలు(first 6 digit numbers) కార్డును జారీ చేసిన కంపెనీ గురించి తెలియజేస్తాయి. దీన్నిIssuer Identification Number (IIN) అంటారు. ఏటీయం కార్డ్ మీద ఉన్న 7 నుండి 15వ నెంబర్ వరకు గల సంఖ్యలు బ్యాంక్ ఖాతాకు ముడిపడి ఉంటాయి. కానీ ఈ నెంబర్లు బ్యాంకు ఖాతా గురించి ఏ విషయాలను వెల్లడించవు. ఇక ఏటీయం కార్డు మీద ఉన్న చివరి నెంబర్ ను చెక్ డిజిట్(check digit) అని అంటారు. ఈ అంకె ద్వారా ఏటీయం కార్డు చెల్లుబాటులో ఉందో లేదో తెలుసుకోవచ్చు.