చనిపోయాడనుకుని పాతిపెట్టేశారు.. కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి నుంచి ఫోన్ రావడంతో షాక్!
ABN , First Publish Date - 2023-02-06T20:29:43+05:30 IST
మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడని పాతి పెట్టేసిన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు.
మహారాష్ట్రలోని (Maharashtra) పాల్ఘర్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. చనిపోయాడని పాతి పెట్టేసిన వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రావడంతో కుటుంబ సభ్యులు షాకయ్యారు. ఆ తర్వాత ఆనందంలో మునిగిపోయారు. పాల్ఘర్‌కు చెందిన రఫీక్ షేక్ అనే 60 ఏళ్ల వృద్ధుడు ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్ని నెలల క్రితం తప్పిపోయాడు. అతని కోసం కుటుంబసభ్యులు అన్ని చోట్లా వెతికారు. అయినా ఎక్కడా అతడి ఆచూకీ దొరక లేదు.
రఫీక్ కనబడడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. రిఫీక్ ఆచూకీ తెలుసుకోవాలని వేడుకున్నారు. జనవరి 29న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం రైలు పట్టాలపై కనిపించింది. ఆ మృతదేహాన్ని చూసిన రఫీక్ భార్య, సోదరుడు గుర్తు పట్టారు. ఆ మృతదేహం రఫీక్‌దేనని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు మృతదేహాన్ని రఫీక్ కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబీకులు ఆ మృతదేహాన్ని ఖననం చేసి అంత్యక్రియలు నిర్వహంచారు. అయితే దాదాపు మూడు నెలల తర్వాత హఠాత్తుగా రఫీక్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది (Man presumed dead by family was found alive).
కేన్సర్‌తో భార్య మృతి.. 10 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు కానీ నెల రోజులకే ఆ భర్తకు ఊహించని షాక్..!
తాను బతికే ఉన్నానంటూ స్నేహితుడికి రఫీక్ కాల్ చేసి చెప్పాడు. స్నేహితుడు నమ్మకపోవడంతో వీడియో కాల్ కూడా చేసి మాట్లాడాడు. ఈ విషయం తెలుసుకున్న రఫీక్ కుటుంబ సభ్యుల ఆనందానికి ఆవధులు లేకుండా పోయింది. రఫీక్ బతికే ఉన్నాడని పోలీసులకు తెలియజేయడంతో వారు ఖననం చేసిన మృతదేహన్ని వెలికితీసి, అతను ఎవరో కనిపెట్టే పనిలో పడ్డారు.